For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాస్ట్ కట్టింగ్: HSBCలో 10,000కు పైగా ఉద్యోగాల కోత!

|

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు కాస్ట్ కట్టింగ్‌కు తెరలేపాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. తాజాగా, ఐరోపా బ్యాంకింగ్ దిగ్గజం HSBC కూడా వేలాదిమంది ఉద్యోగులకు షాకివ్వనుంది. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా 10వేలమందికి పైగా ఉద్యోగుల్ని తొలగించే అవకాశముందని తెలుస్తోంది.

థర్డ్ క్వార్టర్ ఫలితాల ప్రకటన సమయంలో ఈ నిర్ణయాన్ని హెచ్‌ఎస్‌బీసీ ప్రకటించనుందని తెలుస్తోంది. ఆగస్ట్ నెలలో HSBC ఇంటర్మ్ సీఈవోగా నోయెల్ క్విన్‌ను నియమించింది. అంతకుముందు ఉన్న జాన్ ఫ్లింట్‌ను తొలగించింది. బాధ్యతలు చేపట్టిన క్విన్... నిర్వహణ ఖర్చులు తగ్గించే చర్యల్లో భాగంగా కాస్ట్ కట్టింగ్‌కు తెరలేపారని వార్తలు వస్తున్నాయి.

జగన్ ఇచ్చే రూ12,500 రైతుభరోసాలో మోడీ ప్రభుత్వం వాటా రూ6,000!జగన్ ఇచ్చే రూ12,500 రైతుభరోసాలో మోడీ ప్రభుత్వం వాటా రూ6,000!

HSBC planning to cut 10,000 more posts!

ముఖ్యంగా ఎక్కువ వేతనం ఉన్న వారిని తొలగించే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా ముంచుకు వస్తోన్న సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికల్లో భాగంగా జాన్‌ను తొలగించి క్విన్‌ను సీఈవోగా తీసుకున్నట్లు హెచ్ఎస్‌బీసీ నాడు తెలిపింది. అయితే కంపెనీ నిర్వహణ ఖర్చులు తగ్గించే వ్యూహాల్లో జాన్ విఫలమయ్యారని భావించినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

క్విన్‌కు పద్దెనిమిది నెలల క్రితం బాధ్యతలు అప్పగించినప్పుడే ప్రపంచవ్యాప్తంగా తమ బ్యాంకుకు చెందిన 2 శాతం ఉద్యోగులు లేదా 4,000 వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకుంటామని తెలిపింది.

కాగా, హెచ్‌ఎస్‌బీసీ తొలి అర్ధ సంవత్సరం నెట్ ప్రాఫిట్ 18.6 శాతంగా ఉంది. ఇది అక్టోబర్ చివరలో మూడో క్వార్టర్ ఫలితాలను ప్రకటిస్తుంది. జేపీ మోర్గాన్ చేస్, వెల్స్ ఫార్గో వంటి అమెరికా టాప్ బ్యాంకులు తమ 2019 ప్రాఫిట్ అంచనాలను తగ్గించాయి. ఇటీవల జర్మన్ సెకండ్ లార్జెస్ట్ లెండర్ కామర్స్ బ్యాంక్ తన వర్క్ ఫోర్స్‌ను తగ్గించింది. డచెస్ బ్యాంక్ 18,000 ఉద్యోగాలు, ఫ్రాన్స్‌కు చెందిన సోసియెట్ జనరల్ బ్యాంకు 1600 ఉద్యోగాలను కట్ చేస్తున్నట్లు ప్రకటించాయి.

English summary

కాస్ట్ కట్టింగ్: HSBCలో 10,000కు పైగా ఉద్యోగాల కోత! | HSBC planning to cut 10,000 more posts!

HSBC is planning to lay off up to 10,000 staff, a report said Monday, just weeks after its chief executive stepped down and announced the axing 4,000 posts citing a weak global outlook.
Story first published: Monday, October 7, 2019, 13:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X