For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన డిమాండ్, సెప్టెంబర్ నెలలో భారత్‌లో తగ్గిన ఉత్పత్తి

|

భారతదేశవ్యాప్తంగా డిమాండ్ మందగమనం కారణంగా ఉత్పాదక రంగం ఉత్పత్తిని తగ్గించిందని కీలక ఆర్థిక సూచిక మంగళవారం వెల్లడించింది. IHS మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) ప్రకారం సెప్టెంబర్ నెలలో 51.4 శాతం ఇండెక్స్ ఉంది. ఇది ఆగస్టులోను మారలేదు. 2018 మే నెల తర్వాత కనిష్టస్థాయి ఇది.

ధరలు భారీగా పెంచిన జగన్ ప్రభుత్వం, 8 గం.ల వరకే లిక్కర్ షాప్స్ధరలు భారీగా పెంచిన జగన్ ప్రభుత్వం, 8 గం.ల వరకే లిక్కర్ షాప్స్

ఇండెక్స్ రీడ్ 50కి పైగా ఉంటే మొత్తం ఆర్థిక కార్యకలాపాలను లేదా వృద్ధిని సూచిస్తుంది. 50కి తక్కువగా ఉంటే తగ్గుదలను చూపిస్తుంది. దేశవ్యాప్తంగా అలాగే బాహ్యప్రపంచంలోను డిమాండ్ పరిస్థితులు తగ్గినట్లు సర్వే సూచించింది. దీంతో పరిమిత ఉత్పత్తికి పరిమితమైంది. ఇన్‌పుట్ కొనుగోలును తగ్గించింది. అదే సమయంలో బిజినెస్ కాన్ఫిడెన్స్ రెండున్నర సంవత్సరాల కనిష్టస్థాయికి పడిపోయింది.

Subdued demand hampers India’s production growth in September

తాజా సర్వే ఫలితాలపై IHS మార్కిట్ ఇండియా ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ పాలియాన్నా డిలైమా మాట్లాడుతూ... 2019-20 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో క్వార్టర్‌లోను ఉత్పాదకరంగ పరిస్థితులు మందగమనంతో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ త్రైమాసికంలో పర్చేసింగ్ మేనేజింగ్ ఇండెక్స్ 2017లో ఇదే సమయానికి సమానంగా ఉందని, అలాగే అప్పటి నుంచి ఇది కనిష్టమని చెప్పారు.

సెప్టెంబర్ నెలలో బిజినెస్ కాన్ఫిడెన్స్, కొనుగోళ్ల పరిణామాలు వంటి సూచీకలు తగ్గాయని చెబుతున్నారు. అయితే ఆగస్టు నెలలో బెంచ్ మార్క్ వడ్డీ రేటులో మరోసారి తగ్గింపు, కార్పోరేట్ పన్ను తగ్గింపు వంటి ఉద్దీపన చర్యల వల్ల ఈ రంగం వృద్ధి సాధించగలదని ధీమా వ్యక్తం చేశారు.

English summary

తగ్గిన డిమాండ్, సెప్టెంబర్ నెలలో భారత్‌లో తగ్గిన ఉత్పత్తి | Subdued demand hampers India’s production growth in September

Overall demand slowdown subdued India's manufacturing sector output in September, a key economic indicator showed on Tuesday.
Story first published: Wednesday, October 2, 2019, 17:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X