For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేశంలో అతి పెద్ద ఎయిర్ పోర్ట్: ఎక్కడ కడుతున్నారో తెలుసా?

|

భారత దేశం అభివృద్ధి చెందుతోంది. నిజమే, విమానాల్లో తిరిగే భారతీయుల సంఖ్యను చూస్తే ఇది స్పష్టమవుతోంది. ఏడాదికేడాది భారత ఏవియేషన్ పాసెంజర్ ట్రాఫిక్ భారీగా పెరుగుతోంది. ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో నిలుస్తోంది. చైనా ఒక్కటే ఈ విషయంలో మన కన్నా ముందు ఉంది. అందుకే, పెరిగిపోతున్న విమాన ప్రయాణీకుల అవసరాలు తీర్చేందుకు, దేశంలో కొత్త ఎయిర్ పోర్టులు కడుతున్నారు. ఇప్పటికే ఉన్న వాటి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నారు.

అధికారిక అంచనాల ప్రకారం .. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో విమాన ప్రయాణికుల సంఖ్య 34.47 కోట్లుగా ఉంది. ఇందులో 27.52 కోట్ల మంది దేశీయ ప్రయాణికులు ఉండగా... 6.94 కోట్ల మంది విదేశీ పాసెంజర్లు ఉండటం విశేషం. ఈ ప్రక్రియలో భాగంగా దేశంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి పురుడుపోసుకొంటోంది. దేశ రాజధానికి సమీపములో గ్రేటర్ నోయిడా లోని జేవర్ లో ఈ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ కేవలం భారత్ లో అతి పెద్దది మాత్రమే కాదు, కొన్ని విషయాల్లో ప్రపంచంలోని అతి పెద్ద ఎయిర్ పోర్టులతో పోటీ పడనుంది. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా మరి?

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి మీకేం తెలుసు?రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి మీకేం తెలుసు?

6 రన్ వేలు ... 12,500 ఎకరాలు....

దేశంలోనే మరెక్కడా లేని విధంగా నోయిడా లోని జేవర్ లో అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ విమానాశ్రయంలో మొత్తం 6 రన్ వేలు ఉండనున్నాయి. ప్రస్తుతం దేశంలోకెల్లా ఒక్క న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మాత్రమే అత్యధికంగా 3 రన్ వేస్ ఉన్నాయి. నాలుగో రన్ వే నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. మరో వైపు జేవర్ ఎయిర్ పోర్ట్ 12,500 ఎకరాల్లో (5 హెక్టార్లు) ప్రతిపాదిస్తున్నారు. ఈ విషయాన్నీ ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో వెల్లడించింది. ఇంత విశాలమైన ఎయిర్పోర్ట్ మన దేశంలో మరెక్కడా లేదు. మన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ 5,000 ఎకరాల్లో నిర్మిస్తేనే ... వామ్మో అన్నారంతా! హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తో పోల్చితే జేవర్ ఎయిర్ పోర్ట్ 2.5 రేట్లు అధిక స్థలంలో నిర్మిస్తారు. యమునా ఎక్సప్రెస్ వే డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ అరుణ్ వీర్ సింగ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ గురించి వివరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.

India biggest airport near delhi

రూ 20,000 కోట్ల ఖర్చు ...

అత్యంత అధునాతన సౌకర్యాలతో నిర్మించే ఈ ఎయిర్ పోర్ట్ కోసం యమునా అథారిటీ భారీ బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. ఈ ఎయిర్ పోర్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను ప్రతిష్ట్మాక ప్రైస్ వాటర్ హౌస్ కూపేర్స్ (పీడబ్ల్యూసీ) తయారు చేయనుంది. మొత్తంగా రూ 15,000 కోట్ల నుంచి రూ 20,000 పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. జేవర్ ఎయిర్ పోర్ట్ తోలి దశ నిర్మాణం పూర్తి అయి 2022-2023 లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. తోలి దశలో 2 రన్ వేలు ఉంటాయి.

చికాగో, డల్లాస్ తో పోటీ....

జేవర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానాశ్రయాలతో పోటీ పడనుంది. ప్రస్తుతం అటు పాసెంజర్ ట్రాఫిక్, ఇటు విస్తీర్ణం ప్రకారం అమెరికా లోని చికాగో ఎయిర్ పోర్ట్ ఏటా 8 కోట్ల విమాన ప్రయాణికులతో 8 రన్ వేల తో పని చేస్తోంది. చికాగో ఎయిర్ పోర్ట్ 7,200 ఎకరాల్లో నిర్మించారు. అమెరికాకే చెందిన మరో విమానాశ్రయం డల్లాస్ కూడా సాలీనా 6 కోట్ల మంది ప్రయాణికులతో 7 రన్ వే లతో కార్యకలాపాలు సాగిస్తోంది. అమెరికా కె చెందిన బోస్టన్, డెట్రాయిట్ , డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 6 రన్ వేలు ఉన్నాయి. నెథర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లోనూ 6 రన్ వేలు ఉండటం గమనార్హం.

7 కోట్ల ప్రయాణికుల సామర్థ్యం ...

జేవర్ ఎయిర్ పోర్ట్ వచ్చే 30 ఏళ్ళ లో ఏటా సుమారు 5 కోట్ల నుంచి 7 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే వేదికగా మారనుంది. ప్రస్తుతం న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 6.6 కోట్ల విమాన ప్రయాణికులతో దేశంలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం ఆసియా లో ఏడో అతి పెద్ద ఎయిర్ పోర్ట్ గా ఉంది. భవిష్యత్లో ఈ సంఖ్య భారీగా పెరగనున్న నేపథ్యంలో దేశ రాజధాని సమీపంలోనే మరో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఏర్పడింది. జేవర్ రూపం లో ఈ సరి కొత్త ఎయిర్ పోర్ట్ దేశ అవసరాలను తీర్చబోతోంది.

English summary

దేశంలో అతి పెద్ద ఎయిర్ పోర్ట్: ఎక్కడ కడుతున్నారో తెలుసా? | India biggest airport near delhi

India biggest airport near delhi. This airport is building with 6 runways in 12,500 acres.
Story first published: Sunday, September 29, 2019, 17:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X