For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉచితంగా ప్రయాణీకులకు ఉబెర్ బంపరాఫర్: ఫ్రీ ఇన్సురెన్స్

|

క్యాబ్ రైడర్ ఉబెర్ తమ ప్రయాణీకుల కోసం ఓ మంచి స్కీంను తీసుకు వచ్చింది. తమ వాహనాల్లో ప్రయాణించే వారికి ఉచిత బీమా అందించనున్నట్లు ప్రకటించింది. కార్లు, మోటార్ సైకిల్స్,ఆటో విభాగాల్లో ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే ఇన్సురెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. దీని కోసం ఉబెర్ ఎలాంటి అదనపు ఛార్జీలు తీసుకోదు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ రైడర్ సంస్థలు వివిధ రకాల ప్లాన్స్ తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఓలా బీమా సౌకర్యాన్ని తీసుకురాగా, ఇప్పుడు ఉబెర్ ఉచితంగా తీసుకు వచ్చింది.

రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడిరూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి

రూ.5 లక్షల వరకు బీమా

రూ.5 లక్షల వరకు బీమా

ఉబెర్ క్యాబ్స్ లేదా బైక్స్ లేదా ఆటోలలో ప్రయాణిస్తుంటే ప్రమాదం జరిగి మరణం లేదా వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల వరకు, ఆసుపత్రి పాలయితే రూ.2 లక్షల వరకు ప్రయాణీకులు బీమా పొందవచ్చునని తెలిపింది. ఇందులో ఔట్ పేషెంట్ కింద రూ.50,000 వరకు బీమా పొందే సౌలభ్యం ఉంది.

భారతీ యాక్సా, టాటా ఏఐజీలతో ప్పందం

భారతీ యాక్సా, టాటా ఏఐజీలతో ప్పందం

కారు ప్రయాణల బీమా కోసం భారతీ యాక్సా, ఆటో, మోటార్ ప్రయాణాల బీమా కోసం టాటా ఏఐజీలతో ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణీకులందరీ భద్రతే తమ బిజినెస్‌కు గుండెకాయ వంటిదని, వారి శ్రేయస్సు తమకు ముఖ్యమని సౌత్ ఏసియా అండ్ ఇండియా హెడ్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ (రైడ్స్) పవన్ వైష్ అన్నారు. ఇప్పటికే ఈ బీమా సౌకర్యాన్ని డ్రైవర్లకు అందిస్తున్నామని, ఇప్పుడు ప్రయాణీకులకు కూడా మరింత భద్రత లభిస్తుందన్నారు.

ప్రమాదం జరిగిన విషయాన్ని తెలియజేయాలి

ప్రమాదం జరిగిన విషయాన్ని తెలియజేయాలి

ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు ఈ రైడ్ అగ్రిగేటర్ ప్రయాణీకులు.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఉబెర్‌కు తెలియజేయాలి. కస్టమర్లు యాప్‌లో పాస్ట్ ట్రిప్స్‌కు వెళ్లి ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. మరింత నావిగేట్ చేసేందుకు Help > Trip and Fare Review > కు వెళ్లి ప్రమాదం జరిగినట్లు వెల్లడించాలి. దీంతో ఉబెర్ 24x7 సపోర్ట్ టీమ్ వెంటనే అక్కడకు చేరుకుంటుంది. క్లెయిమ్ ప్రాసెస్ ద్వారా వాటిని తీసుకోవడానికి ఇన్సురెన్స్ పార్ట్‌నర్‌తో కలిసి పని చేస్తుంది.

ఓలా ఇన్సురెన్స్...

ఓలా ఇన్సురెన్స్...

ఉబెర్ రైవల్ ఓలా ఇప్పటికే ప్రయాణీకులకు ఇన్సురెన్స్ అందిస్తోంది. కస్టమర్ ట్రిప్ ఇన్సురెన్స్ కూడా తీసుకు వచ్చింది. డ్రైవర్ క్యాన్సిలేషన్ వల్ల లేదా అనియంత్రణ ఆలస్యం వల్ల ఫ్లైట్ మిస్సయితే కవరేజ్ ఉంటుంది. మెడికల్ ఎక్స్‌పెన్సెస్, బ్యాకేజీ లాస్ (ఔట్ స్టేషన్ ట్రిప్), ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ వంటి వాటికి కూడా వర్తిస్తుంది. ఈ ఇన్సురెన్స్ కోసం డెయిలీ రైడ్స్ అయితే రూ.2, ఓలా రెంటల్స్ అయితే రూ.10, ఓలా ఔట్ స్టేషన్ అయితే రూ.15ను బీమా కాస్ట్ ఉంటుంది.

English summary

ఉచితంగా ప్రయాణీకులకు ఉబెర్ బంపరాఫర్: ఫ్రీ ఇన్సురెన్స్ | Uber launches rider insurance at no extra cost

Online cab aggregator major Uber on Wednesday announced that it will provide free accident insurance, which will cover riders hailing cars, autos and motorcycle up to a maximum of Rs 5 lakh.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X