For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వావ్! ట్రాన్సాక్షన్ ఫెయిలైతే బ్యాంకులే మీకు రూ.100 చెల్లిస్తాయి!!

|

బ్యాంకు ట్రాన్సాక్షన్స్ సమయంలో చాలాసార్లు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అవుతుంది. కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అయితే ఈ డబ్బును బ్యాంకులు నిర్ణీత కాలంలో కస్టమర్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. ఫెయిల్ అయితే కనుక బ్యాంకులు రోజుకు కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కస్టమర్ ఫిర్యాదుల పరిష్కార కాలపరిమితిని, అధీకృత చెల్లింపు వ్యవస్థలకు పరిహార మార్గదర్శకాలను ప్రకటించింది. సాధారణంగా కస్టమర్ల అకౌంటులో మినిమం బ్యాలెన్స్ లేని సమయాల్లో, క్రెడిట్ కార్డు కట్టని సందర్భాల్లో బ్యాంకులు జరిమానాల రూపంలో వసూలు చేస్తాయి. అయితే ఇది బ్యాంకులకు షాకిచ్చే అంశం.

LIC pension plan: రూ.10 లక్షలతో వచ్చే నెల నుంచే ఆదాయం!LIC pension plan: రూ.10 లక్షలతో వచ్చే నెల నుంచే ఆదాయం!

బ్యాంకులకే జరిమానా

బ్యాంకులకే జరిమానా

UPI, ఈ-వ్యాలెట్ సహా వివిధ చెల్లింపు వ్యవస్థల వినియోగదారులు ఈ కొత్త ఆర్బీఐ మార్గదర్శకాల నుంచి లబ్ధి పొందుతారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంలో విఫలమైతే బ్యాంకులు జరిమానాలు చెల్లించవలసి ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది. ఈ మేరకు కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త నిబంధనలు జారీ చేయడం గమనార్హం.

ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే...

ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే...

ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిన సందర్భాల్లో కస్టమర్లకు బ్యాంకులు వెంటనే సమాచారం అందించాలి. బ్యాంకులు గడువులోగా మీ కస్టమర్ సమస్యను పరిష్కరించాలి. లేదంటే జరిమానాగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు కస్టమర్లలో విశ్వాసాన్ని నింపడం కోసం ఆర్బీఐ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. ఏటీఎ లావాదేవీలు, ఐఎంపీఎస్ ట్రాన్సుఫర్స్ కూడా ఈ రూల్స్ పరిధిలోకి వస్తాయి.

ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైతే రూ.100 ఫైన్

ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిలైతే రూ.100 ఫైన్

కస్టమర్ తప్పులేకుండా ట్రాన్సాక్షన్ విఫలమైతే బ్యాంకులు ఇందుకు బాధ్యత వహించాలి. ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే బ్యాంకులు ఐదు రోజుల్లోగా ఆ డబ్బులను బ్యాంకు ఖాతాదారుడి అకౌంట్‌లో జమ చేయాలి. ఒకవేళ బ్యాంకు డబ్బులు తిరిగి చెల్లించకపోతే అప్పుడు బ్యాంకు కస్టమర్‌కు రోజుకు రూ.100 చొప్పున చెల్లించాలి.

ఐఎంపీఎస్ ఫెయిలైతే ఒక్క రోజులో రూ.100

ఐఎంపీఎస్ ఫెయిలైతే ఒక్క రోజులో రూ.100

ఐఎంపీఎస్ ట్రాన్సుఫర్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే ట్రాన్సాక్షన్ ఫెయిలైతే డబ్బులు కట్ అయితే అప్పుడు బ్యాంకులు ఆ నగదును మరుసటి రోజుకల్లా కస్టమర్ అకౌంట్లో వేయాలి. లేదంటే బ్యాంకు సదరు కస్టమర్‌కు రూ.100 చెల్లించాలి.

UPI పేమెంట్స్ ఫెయిలైతే..

UPI పేమెంట్స్ ఫెయిలైతే..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)కు కూడా ఇదే వర్తిస్తుంది. ఐదు రోజుల్లోగా యూపీఐ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన సమస్యలను బ్యాంకులు పరిష్కరించాలి. లేదంటే ఖాతాదారులకు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్గదర్శకాల అమలు వలన ట్రాన్సాక్షన్ ఫెయిల్స్ పెండింగులో ఉండకుండా బ్యాంకు వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది.

English summary

వావ్! ట్రాన్సాక్షన్ ఫెయిలైతే బ్యాంకులే మీకు రూ.100 చెల్లిస్తాయి!! | you will get Rs.100 for every failed online bank, ATM transactions

Several times while doing a bank transaction, users find that the amount is debited from their account, but is not credited to the receiver's account.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X