For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడో రోజూ పెరిగిన పెట్రోల్ ధర, ఢిల్లీలో రూ.73.91 పైసలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ 0.29 పైసలు పెరిగి రూ.73.91గా ఉంది. అంతకుముందు రోజు ఇది రూ.73.62 పైసలుగా ఉంది. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై దాడి అనంతరం ఆయిల్ ధరలు 15 శాతం వరకు పెరిగాయి. నాలుగు నెలల గరిష్టానికి పెరిగింది. చమురు క్షేత్రాలపై దాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అవసరమైన 5 శాతం ఉత్పత్తిపై ప్రభావం పడిన విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు పెరగడం నేటితో ఏడో రోజు.

గడిచిన ఆరు రోజుల్లో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.1.59, డీజిల్ ధర రూ.1.31 చొప్పున పెరిగింది. 2017లో రోజువారి ఇంధన ధరల సవరణ మొదలైన దగ్గర నుంచి ఆరు రోజుల్లో ఈ స్థాయిలో ధరలు పెరుగడం ఇది తొలిసారి. ఆదివారం సైతం 27 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ రేటు రూ.73.62కు చేరుకోగా, డీజిల్‌పై 18 పైసలు అందుకుని రూ.66.74కు చేరుకుంది. సౌదీ చమురు రిఫైనరీలపై జరిగిన దాడులు గ్లోబల్ క్రూడ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

Petrol price: 6వ రోజు పెరిగిన పెట్రోల్ ధర, భారీ షాక్ తప్పదా?Petrol price: 6వ రోజు పెరిగిన పెట్రోల్ ధర, భారీ షాక్ తప్పదా?

Petrol prices spike to Rs 73.91 in Delhi

చమురు దిగుమతిదారుల్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంది. చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియానే వరల్డ్ టాప్. ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో గ్లోబల్ క్రూడ్ మార్కెట్‌కు సౌదీ అరేబియానే పెద్ద దిక్కు అయింది. ఇప్పుడు ఆ దేశ రిఫైనరీలపై జరిగిన దాడులు అటు గ్లోబల్ మార్కెట్‌ను, ఇటు భారతీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాక్ తర్వాత సౌదీ అరేబియా నుంచే అత్యధికంగా ముడి చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. 2018-19లో భారత్‌కు 207.3 మిలియన్ టన్నుల చమురు దిగుమతులు చేసుకోగా, సౌదీ వాటా 40.33 మిలియన్ టన్నులు. ఈ క్రమంలో తగ్గిన సౌదీ చమురు ఉత్పత్తి దేశీయ మార్కెట్‌లో పెట్రో ధరలకు మరింతగా రెక్కలు తొడిగే వీలుందని అంచనా.

English summary

ఏడో రోజూ పెరిగిన పెట్రోల్ ధర, ఢిల్లీలో రూ.73.91 పైసలు | Petrol prices spike to Rs 73.91 in Delhi

Reasons Why the Price Of Petrol And Diesel Change daily. With Rs 0.29 hike, the price of petrol on Monday jumped to Rs 73.91 in the Delhi.
Story first published: Monday, September 23, 2019, 9:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X