For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంపర్ ఆఫర్: ఫిక్స్డ్ డిఫాజిట్ పై 10.35 శాతం వరకు వడ్డీ!

|

ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్న పరిణామాలను చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వడ్డీ రేటు ఎక్కడ ఎక్కువ లభిస్తుందా అని డిపాజిట్ దారులు వెతుకుతున్నారు. రిస్క్ తీసుకునే సామర్థ్యం లేని వారు బ్యాంకు డిపాజిట్లపైనే దృష్టి సారిస్తుంటారు. కానీ వడ్డీ రేటు చూస్తే తక్కువ ఉంది. ఎక్కువ వడ్డీ రేటు కావాలనుకునే వారికి ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తోంది.ఈ వడ్డీ రేటు ఎంత కాలానికి వర్తిస్తుంది.. ఎంత పెట్టుబడి పెట్టాలి తదితర విషయాలు తెలుసుకుందామా మరి...

సెల్ఫ్ డ్యామేజ్ ఇన్సూరెన్సు కవర్ విషయంలో ఇలా చేయండి...సెల్ఫ్ డ్యామేజ్ ఇన్సూరెన్సు కవర్ విషయంలో ఇలా చేయండి...

కేర్ రేటింగ్...

కేర్ రేటింగ్...

* కంపెనీ ప్రకటించిన ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లకు కేర్ రేటింగ్స్ లిమిటెడ్ కేర్ ఏఏ- (ఎఫ్ డీ ), నెగిటివ్ (డబుల్ మైనస్ (ఫిక్స్డ్ డిపాజిట్): అవుట్ లుక్ నెగిటివ్ రేటింగ్ ఇచ్చింది.

వడ్డీ రేట్లు ఇలా...

వడ్డీ రేట్లు ఇలా...

* రెండు స్కీం లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. క్యుములేటివ్, నాన్ క్యుములేటివ్ పేర్లతో ఉన్న ఈ స్కీం లలో మూడు రకాల కాలపరిమితులు ఉన్నాయి.

* క్యుములేటివ్ స్కీం లో ఏడాది కాలానికి 9.10 శాతం, రెండేళ్లకు 9.60 శాతం, మూడేళ్లకు 10.10 శాతం వడ్డీ రేటును ఇస్తున్నారు.

* నాన్ క్యుములేటివ్ స్కీం లో ఏడాది కాలానికి 9 శాతం, రెండేళ్లకు 9.50 శాతం, మూడేళ్లకు 10 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది కంపెనీ.

* కనీస డిపాజిట్ రూ.10,000. రూ. 1,000 చొప్పున పెంచుకుంటూ పోవచ్చు.

అదనపు వడ్డీ రేటు ఎవరికంటే...

అదనపు వడ్డీ రేటు ఎవరికంటే...

* కంపెనీ 10.10 శాతం తో పాటు అదనంగా 0.25 శాతం వడ్డీ రేటును కూడా ఆఫర్ చేస్తోంది.

* ఇది కంపెనీ షేర్ హోల్డర్లకు, ఫ్యూచర్ గ్రూప్ ఉద్యోగులకు, సీనియర్ సిటిజెన్లకు, ఫ్యూచర్ గ్రూప్ కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాం సభ్యులకు లభిస్తుంది.

వడ్డీ చెల్లింపు ఇలా...

వడ్డీ చెల్లింపు ఇలా...

* రెండు పథకాల్లోనూ త్రైమాసికం వారీగా వడ్డీ రేటును ఇస్తున్నారు.

* వడ్డీ రేటుతో పాటు అసలు మొత్తం డిపాజిటర్ బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు...

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు...

* దేశంలో ఉన్న వ్యక్తులు, కంపెనీ, భాగస్వామ్య సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంభం, ట్రస్ట్ , ఫౌండేషన్లు ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

* దేశంలో నివాసం ఉండని వారు, విదేశీయులు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలకు దరఖాస్తు చేసుకోరాదు.

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి...

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి...

* ఫ్యూచర్ గ్రూప్ అవుట్ లెట్లయినా బిగ్ బజార్, ఎఫ్ బీ బీ , సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ, ఈజీ డే, హెరిటేజ్ ఫ్రెష్, నీలగిరిస్, ఫుడ్ వరల్డ్ లలో ఎక్కడైన దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని సంస్థ చెబుతోంది.

* అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి అప్లికేషన్ ఇవ్వవచ్చు.

మరెందుకు ఆలస్యం.. అలోచించి నిర్ణయం తీసుకోండి మరి...

English summary

బంపర్ ఆఫర్: ఫిక్స్డ్ డిఫాజిట్ పై 10.35 శాతం వరకు వడ్డీ! | Bumper Offer: 10.35 percent offer for Fixed Deposit

Auto renewal of FD is for the same period for which it was initially placed at the interest rate prevailing on the date of auto renewal.
Story first published: Monday, September 23, 2019, 12:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X