For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేద ప్రజలకు లబ్ది చేకూరే దిశగా విరించి హాస్పిటల్.. ప్రముఖ సంస్థతో ఒప్పందం

|

హైదరాబాద్: అంతర్జాతీయ వైద్య చికిత్సలతో కిడ్నీ వ్యాధులను రూపుమాపడానికి, ఈ వ్యాధులతో బాధపడేవాళ్లకు ఆధునిక చికిత్సల ద్వారా ఉపశమనం కలిగించడానికి హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్ ముందడుగు వేసింది. ఇందుకోసం సమన్వయంతో పనిచేయటానికి ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన న్యూయార్క్ లోని రీనల్ రీసెర్చ్ఇన్స్టిట్యుట్ తో చేతులు కలిపింది. ఇందులో భాగంగా మొట్టమొదటి ప్రాజెక్టుగా అలో - హీమోడయాలిసిస్ (allo - HD) పరికరాన్ని అభివృద్ధి చేసేపని చేపట్టింది. ఇది టర్మినల్ కిడ్నీ ఫెయిల్యూర్కి చవకైన చికిత్స. ఈ చికిత్స కిడ్నీ వ్యాధుల ట్రీట్మెంట్స్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుంది. ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద ప్రాంతాల్లోనీ ప్రజలకు ఎక్కువ లబ్ది చేకూరుస్తుంది ఖరీదైన చికిత్సను అందుకోలేక చనిపోయే వాళ్ళు ఎవరు ఉండొద్దనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

రీనల్ రీసెర్చ్ఇన్స్టిట్యుట్, న్యూయార్క్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ పీటర్ కొటాంకోతో కలిసి విరించి హాస్పిటల్స్ నుంచి కిడ్నీ వ్యాధుల చికిత్సలో అగ్రగణ్యుడైన డాక్టర్ కె ఎస్ నాయక్, విరించి హాస్పిటల్స్ చైర్మన్ విశ్వనాద్ కొంపెల్ల ఈ ప్రాజెక్టులకు సారథ్యం వహిస్తున్నారు. ఈ విధంగా ఈ రెండు అతి పెద్ద సంస్థల కలయిక కిడ్నీ ఫెయిల్యూర్ చికిత్సలో ఆధునిక మరియు అందుబాటు ఖర్చుతో కూడిన కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకగలదని ఆశించవచ్చు.

Virinchi Hospitals Partners with Renal Research Institute

అలో - హీమోడయాలిసిస్ (allo - HD) వివరణ

రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ (ఆర్ ఆర్ టి) ఖరీదైనది కావడం ఎన్నో పరిమితులు ఉండడం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు చనిపోవడానికి కారణమవుతోంది. 2019లో గ్లోబల్ కిడ్నీ హెల్త్ అట్లాస్ ప్రకారం 2030 నాటికి (14.5 మిలియన్ల) మంది ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ బారినపడి, ఆర్ ఆర్ టి అవసరం లో ఉంటారు. వీరిలో 60శాతం (9.1 మిలియన్ల పేషెంట్లు) ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల చికిత్స అందుకోలేరు.

అలో - హీమోడయాలిసిస్ (allo - HD) ని డయాలసిస్ లాంటి ఆర్ ఆర్ టి పద్ధతిగా చెప్పవచ్చు. దీనిలో రక్తం డయలైజర్ లో ప్రయాణిస్తుంది. డయలైజర్ నుంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి(బడ్డీ) ఈ రక్తం వెళ్తుంది. ఈ వ్యక్తిని బడ్డీ అంటారు. ద్రవాలు మరియు విషపదార్థాలు పేషెంటు నుంచి బడ్డీకి బదిలీ అయి వారి

ఆరోగ్యకరమైన కిడ్నీల ద్వారా విసర్జించబడతాయి. ఉదాహరణకి ఒక పిల్లవాడికి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటే అతని బంధువులు బడ్డీలుగా ఉండవచ్చు. ఈ డయాలసిస్ డెలివర్ చేసే మోడల్స్ ప్రస్తుతం ఇంకా చర్చల్లో ఉంది. దీనికి స్థానిక మరియు మెడికల్ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలో హెచ్ డి (allo HD) ని ఇంట్లో కూడా డెలివర్ చేయవచ్చు సoప్రదాయిక డయాలసిస్ కేంద్రాలలో అయ్యే ఖర్చును నివారించవచ్చు తగినంత ఆర్ ఆర్ టిని డెలివర్ చేయడానికి అలో హెచ్ డి వల్ల ఏ మేరకు సాధ్యపడుతుందనే అంశాన్ని యూరెమిక్ సెల్యూట్ గతిశీలత యొక్క విస్తృతమైన గణిత అనుకరణలు మరియు అలో హెచ్ డి ప్రొటోటైప్ బెంచ్ పరీక్షలు బలపరుస్తాయి.

ఈ ఆర్ ఆర్ టి కాన్సెప్ట్ ను లోతుగా పరిశీలించడానికి జంతువుల్లో అధ్యయనాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఉన్న రీనల్ రిప్లేస్మెంట్ టెక్నాలజీలతో పోలిస్తే దీనికి టెక్నికల్ మరియు లాజిస్టిక్ సంక్లిష్టతలు చాలా తక్కువ ప్రాణాలను కాపాడే ఆర్ఆర్ టి ప్రత్యేకించి పేద జనాభాకు అందుబాటులో ఉండేలా అలో హెచ్ డి తక్కువ ఖర్చుతో ఉంటుందని ఆశించవచ్పు.

English summary

పేద ప్రజలకు లబ్ది చేకూరే దిశగా విరించి హాస్పిటల్.. ప్రముఖ సంస్థతో ఒప్పందం | Virinchi Hospitals Partners with Renal Research Institute

Virinchi Hospital, Hyderabad is at the forefront of providing world class treatment for kidney ailments and is leading a crusade to develop new path-breaking treatments to alleviate the suffering of patients suffering with this dreadful disease.
Story first published: Saturday, September 21, 2019, 9:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X