For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు, ఐనా బోనస్‌పై అసంతృప్తి

|

ఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు పెద్ద శుభవార్త వచ్చింది. ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల 11.52 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగులకు దసరా, దీపావళి సందర్భంగా ముందస్తు తీపి కబురును అందించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.2,000 కోట్లకు పైగా వ్యయం కానుంది. ఉద్యోగులకు ఇలా వరుసగా బోనస్ అందించడం ఇది ఆరో సంవత్సరమని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.

ఈ-సిగరేట్లపై నిషేధం: కేంద్రం కీలక ప్రకటన, జరిమానా ఏమంటేఈ-సిగరేట్లపై నిషేధం: కేంద్రం కీలక ప్రకటన, జరిమానా ఏమంటే

78 రోజుల పాటు ప్రాడక్టివిటీ బోనస్

78 రోజుల పాటు ప్రాడక్టివిటీ బోనస్

సమర్థవంతమైన కార్యకలాపాలలో ఉద్యోగుల సహకారాన్ని గుర్తించి, రైల్వే సిబ్బందిని మరింత ప్రోత్సహించేందుకు బోనస్‌ను అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కోంది. 11.5 లక్షల నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు (ఆర్పీఎఫ్/ఆర్బీఎస్ఎఫ్ మినహాయించి) 78 రోజుల ప్రాడక్టివిటీ బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

రైల్వే యూనియన్ల అసంతృప్తి

రైల్వే యూనియన్ల అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పినప్పటికీ రైల్వే యూనియన్లు కొన్ని సంతృప్తిగా లేవని తెలుస్తోంది. ఎందుకంటే వారు మరింత మెరుగైన బోనస్ ఆశించారు. రైల్వే బోర్డుతో ఈ అంశంపై తాము చర్చించామని, బోనస్ రోజులను పెంచాలని కోరామని ఆలిండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ తెలిపింది. ఎలాంటి కఠిన వాతావరణంలో అయినా పని చేసే రైల్వే ఉద్యోగులు ఈసారి మరింత ఎక్కువ బోనస్ వస్తుందని ఆశించారని, కానీ అది జరగలేదన్నారు.

అభినందిస్తున్నప్పటికీ...

అభినందిస్తున్నప్పటికీ...

రైల్వే ఉద్యోగులకు మెరుగైన PLB కోసం రైల్వే మంత్రిత్వ శాఖ చేసిన కృషిని అభినందిస్తున్నప్పటికీ, ఉత్పాదకత ఆధారంగా మెరుగైన పరిహారాన్ని పరిగణించవలసి ఉండెనని ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ శివగోపాల్ మిశ్రా చెప్పారు.

రైల్వే, ఈ-సిగరేట్లపై కీలక నిర్ణయాలు

రైల్వే, ఈ-సిగరేట్లపై కీలక నిర్ణయాలు

కాగా, కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది.

- రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పాటు ప్రాడక్టివిటీ బోనస్. వరుసగా ఆరో ఏడాది ఇస్తున్నారు. దీని వల్ల 11.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

- ఈ-సిగరేట్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

- ఈ-సిగరేట్ల ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతి, పంపిణీని నిషేధించింది.

- ఈ-సిగరేట్ నిషేధం వల్ల ముఖ్యమంగా యువత, చిన్నారులను దీని నుంచి కాపాడుకోవచ్చు. ఈ-సిగరేట్ అడిక్షన్ నుంచి వారిని కాపాడేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది.

English summary

రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు, ఐనా బోనస్‌పై అసంతృప్తి | Good news for railway employees: Cabinet announces 78 day bonus ahead of festive season

Union ministers Nirmala Sitharaman and Prakash Javadekar today briefed the media on key Cabinet decisions. The Union Cabinet today approved 78 days' of wages as bonus for Railway employees. This will benefit 11.52 lakh Railway employees and will lead to outgo of over ₹2,000 crore.
Story first published: Thursday, September 19, 2019, 8:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X