For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ తర్వాత తొలిసారి రికార్డ్ స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధరలు

|

ఢిల్లీ: సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై గత వారం డ్రోన్ దాడుల నేపథ్యంలో భారత్‌కు చేసుకుంటున్న చమురు దిగుమతుల్లో ఆటంకం ఏర్పడే అవకాశముందని కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులు తెలిపారు. కానీ ఇంధన ధరల విషయంలో భారత్‌లో పెరుగుదల ఉండే అవకాశముందని చెబుతున్నారు. సౌదీలో చమురు ఉత్పత్తి తగ్గడంతో దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుందని, దీంతో అంతర్జాతీయంగా ధరలు పెరుగుతాయని అంటున్నారు.

ఇప్పటికి అయితే సౌదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆరామ్‌కో కేంద్రాలతో భారత్‌కు ఉన్న ఒప్పందం ప్రకారం దిగుమతుల్లో ఎలాంటి కోతలు ఉండవు. ఇప్పటికే చమురు ట్యాంకర్లు బయలుదేరాయి. అయితే దాడుల ప్రభావం వల్ల భారత్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందా అనే విషయం తెలియాలంటే పదిపదిహేను రోజులు వేచి చూడాలని చెబుతున్నారు.

చలాన్ షాకింగ్: ఎడ్లబండికి రూ.1,000 జరిమానా, ఏం జరిగిందంటే?చలాన్ షాకింగ్: ఎడ్లబండికి రూ.1,000 జరిమానా, ఏం జరిగిందంటే?

 Petrol, diesel prices record sharpest rise on Wednesday since Budget

ఇప్పుడు చమురు బ్యారెల్ ధర రూ.67గా ఉంది. ఈ ధర 70 నుంచి 75 డాలర్ల పరిమితిని చేరే వరకు భారత్ ఒప్పందం చేసుకుంది. గతంలో 140 డాలర్లకు కూడా బ్యారెల్ చమురును భారత్ కొనుగోలు చేసింది.

కాగా, బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 25 పైసలు, డీజిల్ పైన 24 పైసలు పెరిగింది. బడ్జెట్ తర్వాత ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి.

ఈ పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.42, లీటర్ డీజిల్ రూ.65.82గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.78.10, డీజిల్ రూ.69.04, చెన్నైలో పెట్రోల్ రూ.75.26, డీజిల్ రూ.69.57, కోల్‌కతాలో పెట్రోల్ రూ.75.14, డీజిల్ రూ.68.23గా ఉంది.

English summary

బడ్జెట్ తర్వాత తొలిసారి రికార్డ్ స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధరలు | Petrol, diesel prices record sharpest rise on Wednesday since Budget

Petrol Diesel Price Rate Today: A litre of petrol now costs Rs 75.14 in Kolkata as compared with Rs 74.89 a litre on Tuesday. Diesel is retailing at Rs 68.23, 24 paise more than Tuesday's rate.
Story first published: Wednesday, September 18, 2019, 15:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X