For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం షాక్, రిటైర్మెంట్ వయస్సు తగ్గింపు?

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ తగలనుందా? వచ్చే ఏడాది నుంచి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సులో కొత్త నిబంధనలు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుకు రెండు ప్రమాణాలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సదరు ఉద్యోగు 33 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండటం లేదా వారి వయస్సు 60 ఏళ్లు నిండితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుందట.

భారత ఆర్థిక వ్యవస్థకు 'సౌదీ' షాక్, రూ.6 పెరగనున్న పెట్రోల్భారత ఆర్థిక వ్యవస్థకు 'సౌదీ' షాక్, రూ.6 పెరగనున్న పెట్రోల్

ఐఏఎస్, ఐపీఎస్ నుంచి అన్ని కేటగిరీల ఉద్యోగులకూ...

ఐఏఎస్, ఐపీఎస్ నుంచి అన్ని కేటగిరీల ఉద్యోగులకూ...

ఈ ప్రతిపాదనలో ఐఏఎస్, ఐపీఎస్ నుంచి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని కేటగిరీల ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలకు పదవీ విరమణ వయస్సు అరవై ఏళ్లుగా ఉంది. పదవీ విరమణ తగ్గింపు వయస్సు కొత్తదేమీ కాదని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఏడో వేతన సంఘంలో కూడా ప్రస్తావించినట్లుగా గుర్తు చేస్తోంది.

వివిధ దశల్లో ప్రతిపాదన అమలు...

వివిధ దశల్లో ప్రతిపాదన అమలు...

ఈ ప్రతిపాదనకు సంబంధించి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అధికారులు, ఉద్యోగుల జాబితాను అన్ని శాఖలు సిద్ధం చేస్తున్నాయని డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (DoPT) వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనను వివిధ దశల్లో అమలు చేయనున్నట్లు చెబుతున్నారు.

తొలి ప్రభావం సాయుద దళాలపై...

తొలి ప్రభావం సాయుద దళాలపై...

ఈ ప్రతిపాదనను అమలు చేస్తే తొలి ప్రభావం సాయుద దళాలలో చేరేవారిపై పడుతుందని చెబుతున్నారు. ఈ ఉద్యోగంలో చేరడానికి సగటు వయస్సు 22. అంటే వారు 33 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకోవాలంటే ఇప్పుడున్న అరవై ఏళ్ల పదవీ విరమణ కంటే కేవలం 5 ఏళ్లు ముందు మాత్రమే చేయాల్సి ఉంటుంది.

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి...

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి...

ఈ ప్రతిపాదన ద్వారా దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించడం ద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని యోచిస్తోంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. మోడీ ప్రభుత్వంపై విమర్శలు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

పరిష్కారం కోసం...

పరిష్కారం కోసం...

దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్లాన్ ఇదే మొదటిది కాదు. అంతకుముందు కూడా మోడీ ప్రభుత్వం.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా ప్రిమెచ్యూరి రిటైర్మెంట్ ప్లాన్ కూడా చేసింది.

ఏ రాష్ట్రంలో ఎంత ఉందంటే..

ఏ రాష్ట్రంలో ఎంత ఉందంటే..

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఇలా ఉంది.. మెడికల్ టీచర్స్ 65 ఏళ్లు, డాక్టర్స్ 62 ఏళ్లు, ఇతర ఉద్యోగులు 60 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, త్రిపుర, అసోం, బీహార్, మేఘాలయ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, నాగాలాండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో అందరి ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లు. తెలంగాణలో 58 ఏళ్లు, తమిళనాడు, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, మిజోరాం, మణిపూర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలోను 58గా ఉంది. జార్ఖండ్, కేరళలో 56 ఏళ్లుగా ఉంది.

English summary

ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం షాక్, రిటైర్మెంట్ వయస్సు తగ్గింపు? | Modi govt plans to lower retirement age of central govt employees

As per reports, the Modi government is planning to reduce the retirement age of the central government employees. The new rules of the retirement could be implemented in the next financial year.
Story first published: Wednesday, September 18, 2019, 13:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X