For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

700 మిలియన్ డాలర్ల డీల్, GM నుంచి TCSకు 1,300 మంది ఉద్యోగులు

|

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్... జనరల్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ నుంచి 1300 మంది ఉద్యోగులను తీసుకుంది. ఈ అమెరికన్ కారు మేకర్ కంపెనీ నుంచి అతిపెద్ద, అయిదేళ్ల ఇంజినీరింగ్ సర్వీసుల కాంట్రాక్ట్ పొందిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఈ కాంట్రాక్ట్ వ్యాల్యూ 600 నుంచి 700 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. తన ఆటోమోటివ్ కేటగిరీలో టీసీఎస్‌కు ఇది అతిపెద్ద డీల్. అయితే కాంట్రాక్టు విలువను టీసీఎస్ వెల్లడించలేదు. దీనిపై జనరల్ మోటార్స్ ఇండియా కూడా స్పందించాల్సి ఉంది.

ఈ అగ్రిమెంట్ కింద GM టెక్నికల్ సెంటర్ - ఇండియా ఉద్యోగులను టీసీఎస్ తీసుకుంటుంది. ప్రపొల్షన్ సిస్టమ్, వెహికిల్ ఇంజినీరింగ్, కంట్రోల్స్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, క్రియేటివ్ డిజైన్స్, స్పెషల్ ప్రాజెక్టుల వంటి వాటిపై పని చేయనుంది.

మళ్లీ పెరిగిన భారీగా బంగారం ధర, రూ.1,300 పెరిగిన వెండిమళ్లీ పెరిగిన భారీగా బంగారం ధర, రూ.1,300 పెరిగిన వెండి

TCS to take over 1,300 people from General Motors

రాబోయే అయిదేళ్లలో ఇంజినీరింగ్ డిజైన్ సేవలతో పాటు తన గ్లోబల్ వెహికిల్ ప్రోగ్రామ్‌లకు మద్దతుకు ఇది GMతో కలిసి పని చేస్తుంది. గ్లోబల్ వెహికిల్ పోర్ట్‌పోలియోలో GM ఎన్నో ఏళ్లుగా ఎన్నో ఆవిష్కరణలకు దోహదపడిందని చెబుతున్నారు.

ముంబైకి చెందిన బ్రోకరేజీ కంపెనీ ఈ డీల్ పైన మాట్లాడుతూ... ఏడాదికి 130 మిలియన్ డాలర్ల విలువైన డీల్ అని, అయిదేళ్ల తర్వాత పునరుద్ధరణ కూడా ఉండవచ్చునని పేర్కొంది. ఇది చాలా పెద్ద ఒప్పందంగా కనిపిస్తోందని గ్లోబల్ టెక్నాలజీ రీసెర్చ్, అడ్వైజరీ ISG ప్రధాన అనలిస్ట్ మృణాల్ రాయ్ తెలిపారు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)లో టీసీఎస్ తన సొంత ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోందని, దీనికి గుడ్ ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు. ఈ డీల్‌తో GM, టీసీఎస్ లబ్ధి పొందుతాయన్నారు.

English summary

700 మిలియన్ డాలర్ల డీల్, GM నుంచి TCSకు 1,300 మంది ఉద్యోగులు | TCS to take over 1,300 people from General Motors

Tata Consultancy Services will take over 1,300 people from General Motors’ India engineering centre after it won a large, five year engineering services contract from the American carmaker.
Story first published: Tuesday, September 17, 2019, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X