For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌదీ ఎఫెక్ట్: రూ.6 వరకు పెరగనున్న పెట్రోల్, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా?

|

న్యూఢిల్లీ:భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ క్షేత్రాలపై దాడి ప్రభావం వివిధ దేశాలపై పడనుంది. సౌదీ నుంచి భారత్‌కు కూడా పెద్ద మొత్తంలో చమురు దిగుమతి అవుతుంది. ఈ ప్రభావం మనపై కూడా పడనుంది. సెప్టెంబర్ 14వ తేదీన 10 డ్రోన్లు సౌదీలోని అబ్కాక్ రిఫైనరీ, ఖురాయిస్ ఆయిల్ ఫీల్డ్‌పై దాడి చేశారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే 5 శాతం చమురుపై ప్రభావం పడింది. భారత్‌కు చమురుతో పాటు కుకింగ్ గ్యాస్ సరఫరా చేసే దేశాల్లో సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉంది.

సౌదీలో సగానికి పైగా నిలిచిన చమురు ఉత్పత్తి, ధరలపై ప్రభావంసౌదీలో సగానికి పైగా నిలిచిన చమురు ఉత్పత్తి, ధరలపై ప్రభావం

క్రూడాయిల్ ధర ఎంత పెరిగిందంటే..

క్రూడాయిల్ ధర ఎంత పెరిగిందంటే..

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ధరలు 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరుగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాడుల తర్వాత తక్షణ అంతరాయాలు నివారించినప్పటికీ ధరలు పెరగవచ్చునని భావిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్‌లోను ధరలు పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 60 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడాయిల్ 54.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ దాడి అనంతరం ఇవి వరుసగా 65 నుంచి 70 డాలర్లు, 60 నుంచి 63 డాలర్లకు పెరిగాయి.

భారత్‌లో ఎంత పెరగవచ్చునంటే?

భారత్‌లో ఎంత పెరగవచ్చునంటే?

ఈ ధరల నేపథ్యంలో భారత్‌లోను పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త పెరగవచ్చు. ధరలు రూ.1 నుంచి రూ.3 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రూ.5 నుంచి రూ.6 కూడా పెరగవచ్చునని చెబుతున్నారు. సెప్టెంబర్ 16వ తేదీన ప్రారంభ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 12 డాలర్లు పెరిగి ఏకంగా 72 డాలర్లు అయింది. 1988 బ్రెంట్ క్రూడాయిల్ లాంచ్ తర్వాత ఏకాఏకీన 18 శాతం పెరగడం గమనార్హం. భారత్‌లో ముడి చమురు ధరలు అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం....

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం....

కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాదు ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకునే భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే రూపాయి బలహీన ప్రభావం కనిపిస్తోంది. ఇప్పుడు క్రూడాయిల్ ప్రభావం మరింత ఇబ్బందికరమని చెబుతున్నారు. అధిక దిగుమతి బిల్లులు భారత ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి ఇటీవలి మందగమనాన్ని తీవ్రతరం చేస్తాయని చెబుతున్నారు.

అసాధారణ పరిస్థితి...

అసాధారణ పరిస్థితి...

ఇది అసాధారణమైన పరిస్థితి అని, దీనిని నిశితంగా గమనిస్తున్నామని భారత ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం భారత వాణిజ్య లోటుపై భారీగా ఉంటుందని చెబుతున్నారు.

ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్...

ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్...

డాలర్‌తో రూపాయి మారకం తగ్గడంతో ఆయిల్ ఇంపోర్ట్స్ పైన ప్రభావం పడుతాయని, దీని వల్ల సంవత్సరానికి ఇంపోర్ట్ బిల్ రూ.10,700కు పెరుగుతుందని, 2018-19లో ఆయిల్ ఇంపోర్ట్స్ పైన భారత్ 111.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.

ఏడాదిలో ఎంత క్రూడాయిల్ దిగుమతి తగ్గిందంటే..

ఏడాదిలో ఎంత క్రూడాయిల్ దిగుమతి తగ్గిందంటే..

2020 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ - జూలై మధ్యన భారత్ రోజుకు 4.5 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుందని, అంతకుముందు ఏడాది ఇదే సంవత్సరంతో పోలిస్తే 0.1 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ దిగుమతి తగ్గిందని చెబుతున్నారు. ప్రధానంగా ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు దీనికి కారణమని క్రెడిట్ ఏజెన్సీ కేర్ రేటింగ్ తన రీసెర్చ్ నోట్‌లో తెలిపింది.

భారత్‌లో ఎన్ని రోజులకు సరఫరా ఉంది, ఎక్కడ ఎంత?

భారత్‌లో ఎన్ని రోజులకు సరఫరా ఉంది, ఎక్కడ ఎంత?

ధరలపై ప్రభావం ఉన్నప్పటికీ భారత్‌లో ఇంధన సరఫరా దెబ్బతినే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో 12 రోజులకు సరఫరా క్రూడాయిల్‌ను కలిగి ఉంది. విశాఖపట్నంలో 1.33 MT, మంగళూరులో 1.5 MT, పదూర్‌లో 2.5 MT మేర స్టోరేజ్ ఉందని ముంబైకి చెందిన స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్ ఏంజిల్ బ్రోకరింగ్‌కు చెందిన అనుజ్ గుప్తా చెప్పారు.

మొత్తంగా 87 రోజుల అవసరాలు తీరేలా..

మొత్తంగా 87 రోజుల అవసరాలు తీరేలా..

భారత రిఫైనరీలు 65 రోజుల క్రూడాయిల్ స్టోరేజ్ కలిగి ఉంటాయని, అలాగే ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్ చేత ప్రణాళిక చేయబడిన, సాధించిన నిల్వలు జోడిస్తే ఇది 87 రోజుల అవసరాలు తీరుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సౌదీ అధికారులతో పాటు ఇతర క్రూడాయిల్ ఉత్పత్తిదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్యారిస్ ఆధారిత ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాతో డీల్ భారత్‌కు సహకారమవుతుందని చెబుతున్నారు. భారత్ ఇప్పుడు అమెరికాపై ఆధారపడుతోందని, అమెరికా నుంచి ముడి చమురు ధరలు మూడు రెట్లు పెరిగాయని కేర్ రేటింగ్ విశ్లేషకులు ఉర్విషా జగశేత్ అన్నారు.

100 డాలర్లకు చేరుకుంటుందా?

100 డాలర్లకు చేరుకుంటుందా?

ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరలు 100 డాలర్లకు చేరువయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశ చమురు అవసరాల్లో 80 శాతం, సహజవాయువుల్లో 10 శాతం దిగుమతులు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ధరలు పెరిగితే భారత దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ఓ వైపు ఆర్థిక మందగమనం, మరోవైపు అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరమే.

భారత్ కరెంట్ అకౌంట్ లోటు ఎలా పెరుగుతుందంటే...

భారత్ కరెంట్ అకౌంట్ లోటు ఎలా పెరుగుతుందంటే...

సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడుల కారణంగా మన దిగుమతి బిల్లు మరింతగా పెరుగుతుంది. తొలుత రూపాయిపై దెబ్బ పడుతుందని సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ తెలిపింది. ముడి చమురు ధరలు 10% పెరిగితే, ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని, భారత కరెంట్ అకౌంట్ లోటు 0.4-05 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. ఒక్కో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్‌ ధర ఒక్కో డాలర్ పెరిగితే భారత చమురు దిగుమతుల బిల్లు 200 కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని చెప్పింది.

సౌదీ అరేబియా నుంచి భారత్‌కు హామీ

సౌదీ అరేబియా నుంచి భారత్‌కు హామీ

సౌదీ చమురు క్షేత్రాలపై దాడుల నేపథ్యంలో భారత్‌కు ముడి చమురు సరఫరాలో వచ్చే ఇబ్బందులు ఉండవని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ మేరకు సౌదీ అరేబియా నుంచి భారత్‌కు హామీ లభించిందన్నారు. ఈ నెలకుగాను ముడి చమురు సరఫరాపై తమ చమురు మార్కెటింగ్‌ సంస్థ (ఓఎంసీ)లతో సమీక్ష నిర్వహించామని, భారత్‌కు సరఫరా తగ్గదని తాము నమ్మకంగా ఉన్నామని, అయినా మొత్తం పరిస్థితులను చాలా దగ్గరగా గమనిస్తున్నామని దాడులకు గురైన రిఫైనరీల సంస్థ ఆరామ్‌కో ఉన్నత వర్గాలు చెప్పినట్లు ప్రధాన్‌ వెల్లడించారు.

మార్కెట్లు డల్, రూపాయి పతనం...

మార్కెట్లు డల్, రూపాయి పతనం...

మరోవైపు, చమురు భయాల నేపథ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు సోమ వారం కుదేలయ్యాయి. స్టాక్‌ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. దీంతో వారం ప్రారంభంలో మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. రూపాయి బలహీనపడింది. వరుసగా ఎనిమిది రోజులుగా పెరుగుతూ వచ్చిన రూపాయి సోమవారం తగ్గింది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68 పైసలు పతనమై 71.60 వద్ద ముగిసింది.

ఆరామ్‌కో ఐపీవో ఆలస్యం

ఆరామ్‌కో ఐపీవో ఆలస్యం

ఇదిలా ఉండగా సౌదీ ఆరామ్‌కో భారీ ఐపీఓ మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. దాడుల నష్టాన్ని మదింపు చేస్తున్నామని, ఐపీఓ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లో లిస్టయ్యే ముందు సౌదీ అరేబియా స్టాక్‌ మార్కెట్లో ఈ ఏడాది నవంబర్‌లో లిస్టింగ్‌ కావాలని సౌదీ ఆరామ్‌కో ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంకర్లను కూడా నియమించింది.

English summary

సౌదీ ఎఫెక్ట్: రూ.6 వరకు పెరగనున్న పెట్రోల్, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా? | Attack on Saudi refinery threatens India’s already slowing economy

India, the world's third-largest oil importer, has a reason to worry as escalating geopolitical tensions in West Asia have raised the spectre of higher oil prices.
Story first published: Tuesday, September 17, 2019, 8:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X