For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సగానికి తగ్గిన మారుతీ సుజుకీ, దూసుకెళ్లిన హ్యుండాయ్

|

పాసింజర్ వెహికిల్ మార్కెట్లో హ్యుండాయ్ దూసుకెళ్తుండగా, మారుతీ సుజుకీ సేల్స్ పడిపోయాయి. ఇటీవలి వరకు మారుతీ కార్లు ఎక్కువగా సేల్ అయ్యాయి. ఇప్పుడు కార్ల మార్కెట్‌లో హ్యుండాయ్ స్థిరంగా మార్కెట్ షేర్ పెంచుకుంటుండగా, మారుతీ సుజుకీ మార్కెట్ షేర్‌ను కోల్పోతోంది. ఇటీవల కార్ల విక్రయాలలో తగ్గుదల కనిపించినా హ్యుండాయ్ కార్ల విక్రయాలు మాత్రం పెరగడం గమనార్హం. అయినప్పటికీ మారుతీనే ముందు ఉంది. కానీ తగ్గుదల కనిపించింది.

భారీగా తగ్గిన బంగారం, ఈ కారణాలతో మళ్ళీ పెరుగుతుందా?భారీగా తగ్గిన బంగారం, ఈ కారణాలతో మళ్ళీ పెరుగుతుందా?

ఈ కంపెనీల వాటా 68 శాతం

ఈ కంపెనీల వాటా 68 శాతం

మార్కెట్లో ఎంజీ మోటార్, కియా మోటార్స్ ఇండియా వంటి ఇరవై వరకు కంపెనీలు ఉన్నాయి. కానీ మారుతీ సుజుకీ, హ్యుండాయ్ కార్ల సేల్స్ మార్కెట్లో 68 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గత కొన్ని నెలలుగా కార్ల సేల్స్ భారీగా తగ్గుతున్నాయి. కానీ ఈ మాంద్యంలోను ఈ ఆర్థిక సంవత్సరంలోని గత ఐదు నెలల కాలంలో హ్యుండాయ్ కార్ల మార్కెట్ 18.36 శాతానికి పెరిగింది. అంతకుముందు ఇదే సమయంలో హ్యుండాయ్ వాటా 15.6 శాతానికి పరిమితమైంది. గత అయిదేళ్లలో ఈ కంపెనీకి అత్యధిక మార్కెట్ వాటా ఇదే.

మారుతీ కార్ల సేల్స్‌లో తగ్గుదల

మారుతీ కార్ల సేల్స్‌లో తగ్గుదల

కార్ల సేల్స్‌లో మారుతీ ముందున్నప్పటికీ గతంతో పోలిస్తే ఈ కార్ల విక్రయాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఏప్రిల్ - ఆగస్ట్ మధ్య మారుతీ సుజుకీ మార్కెట్ వాటా తగ్గి 49.83 శాతానికి పడింది. గత మూడేళ్లలో ఇది అత్యల్పం. మారుతీ విటార బ్రెజా తన షేరును హ్యుండాయ్ వెన్యూకు కోల్పోతోంది. వెన్యూ విక్రయాలు భారీగా ఉన్నాయని హ్యుండాయ్ ప్రతినిధి చెప్పారు. జూన్ నెల నుంచి SUV విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉంది.

హ్యుండాయ్‌కి డిమాండ్

హ్యుండాయ్‌కి డిమాండ్

ఇప్పటి వరకు 30వేల వెన్యూలను డెలివరీ చేయగా మరో 90వేల వెన్యూలకు ఆర్డర్స్ ఉన్నట్లు చెప్పారు. దీంతో వెయిటింగ్ లిస్ట్ తగ్గించుకునేందుకు ఉత్పత్తిని వేగవంతం చేసారు. ధర విషయంలో కూడా వెన్యూ గట్టి పోటీని ఇస్తోంది. మిగతా సిరీస్ కార్లకు కూడా హ్యుండాయ్ పోటీనిస్తోంది.

న్యూ గ్రాండ్ ఐ10 నియోస్ భారీ బుకింగ్స్

న్యూ గ్రాండ్ ఐ10 నియోస్ భారీ బుకింగ్స్

ఇటీవల విడుదల చేసిన న్యూ గ్రాండ్ ఐ10 నియోస్ కూడా 9వేలకు పైగా బుకింగ్స్ సాధించింది. దీంతో ముందు ముందు హ్యుండాయ్ మార్కెట్ షేర్ మరింత వేగంగా మెరుగుపడే అవకాశముందని భావిస్తున్నారు.

చిన్న SUVలో సమస్యలు

చిన్న SUVలో సమస్యలు

చిన్న SUV విభాగంలో సమస్యలు ఉన్నాయని, పోటీదారుల నుంచి కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి రావడంతో ఆ ప్రభావం మార్కెట్లపై ఉందని, ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ఎక్ఎల్ 6తో పుంజుకునే అవకాశముందని మారుతీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. ప్రస్తుతం ఈ కారుకు రోజుకు 300 వరకు బుకింగ్స్ వస్తున్నట్లు తెలిపారు.

50 శాతం దిగువకు మార్కెట్ వాటా

50 శాతం దిగువకు మార్కెట్ వాటా

ఏప్రిల్ - ఆగస్ట్ మధ్య మారుతీ సుజుకీ కార్ల వాటాను రెండు శాతం మేర కోల్పోయింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ వాటా 50 శాతం దిగువకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు నెలల కాలలో మారుతీ సుజుకీ 5,55,064 వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో 7,57,289 విక్రయించింది. దీంతో గత ఏడాది మార్కెట్ షేర్ 52.16 శాతంగా ఉండగా, ఈసారి 49.83కు పడిపోయింది.

విక్రయాలు ఎలా ఉన్నాయంటే...

విక్రయాలు ఎలా ఉన్నాయంటే...

ఈ ఐదు నెలల కాలంలో మొత్తంగా 11,09,930 యూనిట్లు విక్రయించారు. గత ఏడాది ఇదే సమయంలో 14,51,647 విక్రయించారు. హ్యుండాయ్ ఈ కాలంలో తన మార్కెట్‌ను పెంచుకుంది. గత ఏడాది ఇదే సమయంలో 2,26,396 యూనిట్లు విక్రయించగా, ఈసారి కాస్త తగ్గి 2,03,729 విక్రయించింది. సేల్స్ తగ్గినప్పటికీ కంపెనీ మార్కెట్ వాటా 15.59 శాతం నుంచి 18.36 శాతానికి పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా సైతే ఇదే కాలంలో 89,733 యూనిట్లు విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో 1,00,015 వాహనాలను విక్రయించింది. కానీ తన మార్కెట్ వాటాను 6.89 శాతం నుంచి 8.08 శాతానికి పెంచుకుంది.

Read more about: hyundai ev maruti మారుతీ
English summary

సగానికి తగ్గిన మారుతీ సుజుకీ, దూసుకెళ్లిన హ్యుండాయ్ | Hyundai's share in passenger vehicles at 5 yr high as Maruti loses ground

The two horse race between Maruti Suzuki and Hyundai in the passenger vehicle market has seen Maruti ceding some ground to its Korean rival. Till recently, Maruti sold a little more than one in every two cars.
Story first published: Monday, September 16, 2019, 17:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X