For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడ్ ఆఫ్ ది నేషన్: పదేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే?

|

చెన్నై: ఐఐటీ మద్రాస్ అలుమ్నీ అసోసియేషన్ (IITMAA) మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో భారత ఆర్థిక పరిస్థితిపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎక్కువమంది భారత్ భవిష్యత్తుపై సానుకూల దృక్పథంతో ఉన్నారు. రానున్న పదేళ్లలో భారత్ అత్యున్నత ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వివరాలను IITMAA విడుదల చేసింది.

2030 వరకు భారతదేశం మరింత ఉన్నత స్థితిలో ఉంటుందని సర్వేలో పాల్గొన్న 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్య పరిస్థితి చాలా బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్వేలో మొత్తం 2295 మంది పాల్గొన్నారు. మహిళలు, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

నో ప్రాసిక్యూషన్: రూ.25 లక్షల వరకు డిఫాల్టర్లపై కేంద్రం ఊరటనో ప్రాసిక్యూషన్: రూ.25 లక్షల వరకు డిఫాల్టర్లపై కేంద్రం ఊరట

Most Indians highly positive about India a decade from now

ఈ సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది... శాస్త్రవేత్తలు తమకు రోల్ మోడల్స్ అని చెప్పారు. వారి తర్వాత రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఆర్థిక అభివృద్ధి, వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. టాప్ టెన్ ప్రాధాన్యతాంశాల్లో విద్య, ఎంప్లాయిమెంట్, నీళ్లు వంటివి ఉన్నాయి.

టాప్ టెన్ ప్రాధాన్యతాంశాల్లో పాపులేషన్ మేనే‌జ్‌మెంట్, పేదరిక నిర్మూలన, టెక్నాలజీ సామర్థ్య వృద్ధి, వ్యవసాయం, అవినీతి నిర్మూలన, పర్యావరణం అంశాలు కూడా ఉన్నాయి. భారత్ తిరుగులేని శక్తిగా ఎదగాలంటే పారిశ్రామిక అభివృద్ధి అవసరమని, రానున్న పదేళ్లలో ఐటీ రంగంలో భారత్ వరల్ట్ క్లాస్‌గా అవతరిస్తుందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్, అగ్రికల్చర్, ఫుడ్, సేప్స్ వంటి రంగాల్లో 2030 నాటికి భారత్ లీడర్‌గా నిలుస్తుందని ఎక్కువమంది ధీమా వ్యక్తం చేశారు.

English summary

మూడ్ ఆఫ్ ది నేషన్: పదేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే? | Most Indians highly positive about India a decade from now

A 'Mood of the Nation' survey conducted by the IIT Madras Alumni Association (IITMAA) on the state of India in 2030 has revealed that most respondents were "highly positive" about the country a decade from now.
Story first published: Sunday, September 15, 2019, 10:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X