For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాడ్ న్యూస్: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గుతాయా?

|

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)తో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది జూలై - సెప్టెంబర్ త్రైమాసికానికి ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు తగ్గించిన అనంతరం బ్యాంకులు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును ప్రభుత్వం మరింత తగ్గించే అవకాశముంది. ఈ పథకాలపై చెల్లించే వడ్డీని ప్రభుత్వం మూడు నెలలకు ఓసారి సవరిస్తుంది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై చెల్లించే వడ్డీ రేటును ప్రభుత్వం సెప్టెంబర్ చివరలో ప్రకటించనుంది.

రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే...రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే...

పీపీఎఫ్‌పై తగ్గనున్న వడ్డీ

పీపీఎఫ్‌పై తగ్గనున్న వడ్డీ

స్మాల్ సేవింగ్స్ స్కీం, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ వంటి వివిధ స్కీంలకు ప్రతి క్వార్టర్‌లో వడ్డీ రేటును ప్రభుత్వం సవరిస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలోను వడ్డీ రేటు తగ్గుతుందని భావిస్తున్నారు.

డిపాజిట్, రుణ రేట్లలో తగ్గుదల

డిపాజిట్, రుణ రేట్లలో తగ్గుదల

ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారతదేశంలోను మనీ కాస్ట్ పడిపోతుండటాన్ని గమనిస్తున్నామని, దేశంలో డిపాజిట్ రేట్లు, రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నామని ఐఐఎఫ్ఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాషిన్ అన్నారు.

ఈ క్వార్టర్‌లో వడ్డీ రేటు ఇలా...

ఈ క్వార్టర్‌లో వడ్డీ రేటు ఇలా...

జూలై - సెప్టెంబర్ క్వార్టర్‌లో పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి వడ్డీ రేట్లు 7.9 శాతంగా ఉన్నాయి. కేవీపీ వడ్డీ రేటు 7.6 శాతంగా, గర్ల్ చైల్డ్ సేవింగ్ స్కీం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ వడ్డీ 8.4 శాతం, సీనియర్ సిటిజిన్ సేవింగ్ స్కీం వడ్డీ రేటు 8.6 శాతంగా ఉంది.

రేట్ కట్ ఎక్కువగా ఉండకపోవచ్చు..

రేట్ కట్ ఎక్కువగా ఉండకపోవచ్చు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరంలో నాలుగు పర్యాయాలు వరుసగా 110 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. ఈ నేపథ్యంలో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. డిపాజిట్లపై కూడా కోత విధిస్తున్నారు. ఈ ఏడాది రెపో రేటు మరింత తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పీపీఎఫ్, చిన్న సేవింగ్స్ స్కీంలపై వడ్డీ రేటు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చిన్న పొదుపు పథకాలు కాబట్టి వీటిల్లో పెద్దగా రేట్ కట్ మాత్రం ఉండకపోవచ్చునని అంటున్నారు. బ్యాంకు FDలపై వడ్డీ రేటు తగ్గుతుందని భావిస్తున్నారు.

English summary

బ్యాడ్ న్యూస్: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గుతాయా? | PPF, other small savings schemes set for interest rate cut

The interest rate on popular Public Provident Fund (PPF) and other small savings schemes are set for a downward revision.
Story first published: Thursday, September 12, 2019, 8:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X