For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో ఫైబర్ ఎఫెక్ట్: హైద్రాబాద్‌లోనూ ఎయిర్‌టెల్ Xstream బంపరాఫర్, ఆఫర్లు ఇవే...

|

రిలయన్స్ జియో గిగా ఫైబర్‌కు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ Xstreamను తీసుకు వచ్చింది. ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ పేరుతో 1Gbps వేగంతో బ్రాడ్ బాండ్ సేవల పథకాన్ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్ నెలవారీ ఛార్జ్ రూ.3,999. ఇళ్లు, స్మాల్ ఆఫీస్ హోమ్ ఆఫీస్ (SOHO), చిన్న వాణిజ్య సంస్థలకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుందని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ ప్లాన్‌ను ప్రస్తుతం దేశంలోని 15 నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. జియో గిగా ఫైబర్ కూడా 1Gbps నెట్ వర్క్ స్పీడ్‌ను ప్లాటినమ్, టైటానియమ్ ప్లాన్స్ పేరుతో రూ.3,999, రూ.8,499కి ఆఫర్ చేస్తోంది.

వైట్ కాలర్ బానిస: ఐటీ కంపెనీలపై కోర్టుకు హైదరాబాద్ ఉద్యోగులువైట్ కాలర్ బానిస: ఐటీ కంపెనీలపై కోర్టుకు హైదరాబాద్ ఉద్యోగులు

ఈ ఆఫర్ ప్రస్తుతం ఈ నగరాల్లో...

ఈ ఆఫర్ ప్రస్తుతం ఈ నగరాల్లో...

ప్రస్తుతం ఈ సేవలను ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, చండీగఢ్ తదితర నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత మిగతా నగరాలకు విస్తరించనుంది. ఎయిర్ టెల్ ఈ సౌకర్యాన్ని వ్యక్తిగత వినియోగదారులతో పాటు వాణిజ్య వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఎయిర్‌టెల్ ప్రత్యేకతలు

ఎయిర్‌టెల్ ప్రత్యేకతలు

ఎయిర్‌టెల్ Xstream ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఎక్స్‌ట్రీమ్ యాప్ ద్వారా మూడు నెలల నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జీ5 ప్రీమియం కంటెంటును కూడా అందిస్తుంది. నెలకు 3333GB డేటా ఇస్తుంది.

జియోతో తేడా ఏమిటి..?

జియోతో తేడా ఏమిటి..?

ఎయిర్‌టెల్ Xstream, జియో ఫైబర్ ప్లాటినమ్ ఆఫర్ రెండు రూ.3,999 ధరలోనే ఉన్నాయి. పైగా జియోతో పోలిస్తే ఎయిర్ టెల్ నెలసరి ఎఫ్‌యూపీ డేటా ఎక్కువగా ఇస్తుంది. ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్ నెలకు 3333GB డేటా ఇవ్వగా జియో ఫైబర్ 2500GB డాటాను ఇస్తుంది. రెండూ 1Gbps స్పీడ్‌తో ఇస్తున్నాయి. జియో గిగా ఫైబర్‌లో ఉచిత వాయిస్ కాల్స్, హోమ్ నెట్ వర్కింగ్ కేపబులిటీస్ ఉన్నాయి. ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్‌లోను అపరిమిత కాల్స్ సౌకర్యం ఉంది. ముఖ్యంగా జియో ఫైబర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో బెనిఫిట్స్ ఉన్నాయి. జియో ద్వారా OTT యాప్స్ వార్షిక సభ్యత్వం పొందవచ్చు.

ఎక్స్‌ట్రీమ్ ఫీచర్స్

ఎక్స్‌ట్రీమ్ ఫీచర్స్

- 1 Gbps స్పీడ్

- భారత్‌లో ఏ నెట్ వర్క్‌కు అయినా అన్ లిమిటెడ్ ల్యాండ్ లైన్ కాల్స్

- నెట్ ఫ్లిక్స్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్

- ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్

- ZEE5, Airtel Xstream App నుంచి ప్రీమియం కంటెంట్ యాక్సెస్.

- 4K HD కంటెంట్, హైఎండ్ ఆన్ లైన్ గేమింగ్, IoT (ఇంటర్నెట్ ఆన్ థింగ్స్)

- ఇళ్లకు, SOHO, స్మాల్ కమర్షియల్ సంస్థలు ఇది తీసుకోవచ్చు

English summary

జియో ఫైబర్ ఎఫెక్ట్: హైద్రాబాద్‌లోనూ ఎయిర్‌టెల్ Xstream బంపరాఫర్, ఆఫర్లు ఇవే... | Jio Fiber effect: Airtel Xstream Fiber broadband plan with 1Gbps speed launched at Rs.3,999

Airtel has priced the Xstream Fiber service at Rs 3,999 per month. Notably, Reliance Jio Fiber offers 1Gbps network speed with its Platinum and Titanium plans worth Rs 3,999 and Rs 8,499 respectively.
Story first published: Thursday, September 12, 2019, 7:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X