For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆటో పతనానికి ఉబెర్-ఓలా కారణమా, స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి?

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆటో సేల్స్, మిలీనియల్స్, ఓలా-ఉబెర్ క్యాబ్‌లపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆటో సేల్స్ తగ్గడానికి మిలీనియల్స్ ఆలోచనా ధోరణి మారడం, క్యాబ్స్ ఉపయోగించడం కూడా ఓ కారణమని ఆమె చెప్పారు. అయితే ఈ సేల్స్ తగ్గడానికి ఇదొక్కటే కారణం కాదని ఇండస్ట్రీ వర్గాలు, నిపుణులు అంటున్నారు. లెక్కలు కూడా అందుకు భిన్నంగానే ఉన్నాయని చెబుతున్నారు.

తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి

అగ్రిగేటర్స్‌కూ విక్రయాలు తగ్గాయి

అగ్రిగేటర్స్‌కూ విక్రయాలు తగ్గాయి

అన్ని క్యాబ్ అగ్రిగేటర్లకు పాసింజర్ వెహికిల్ సేల్స్ 8-10 శాతం మధ్య ఉన్నాయి. భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ కంపెనీ ట్యాక్సీ విభాగానికి చెందిన అమ్మకాలు 5-6 శాతం మధ్య ఉన్నాయి. గత ఏడాది కూడా ఇందులో మార్పు లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆటో సేల్స్ తగ్గుదలకు అనుగుణంగా క్యాబ్ అగ్రిగేటర్స్‌కు కూడా అదే స్థాయిలో విక్రయాలు తగ్గాయి. హ్యుండాయ్ క్యాబ్ అగ్రిగేటర్ సేల్ 3 శాతంగా ఉంది.

పాసింజర్ వెహికిల్ సేల్స్

పాసింజర్ వెహికిల్ సేల్స్

ఈ ఆర్థిక సంవత్సరంలో పాసింజర్ వెహికిల్ సేల్స్ దాదాపు పావు శాతం తగ్గాయి. ఆటో సేల్స్ వరుసగా పదో నెల కూడా తగ్గాయి. గత 14 నెలల్లో మొత్తంగా 13 నెలలు సేల్స్ తగ్గాయి. ఆటో పరిశ్రమ భారీ మందగమనంలో ఉండటంతో పది శాతం జీఎస్టీని తగ్గించాలని ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది.

క్యాబ్స్, రేడియో ట్యాక్సీలు పెరగాలి...

క్యాబ్స్, రేడియో ట్యాక్సీలు పెరగాలి...

నిర్మల సీతారామన్ చెప్పిన దాని ప్రకారం క్యాబ్స్, రేడియో ట్యాక్సీలు ఎక్కువగా పెరిగాలి. ఉదాహరణకు ఓలాను తీసుకుంటే 8,50,000 కార్లు, మరో 50,000 లీజ్ మోడల్‌లో ఉన్నాయి. ఈ సంఖ్య వరుసగా 15,00,000, లక్షకు పెరిగాయి. అంటే రోడ్డు పైకి వచ్చిన కొత్త క్యాబ్స్ మరో లక్షలకొద్ది ఉన్నట్లు. అయితే ఇవన్నీ కొత్తవి అని చెప్పలేం. ఎందుకంటే ఇందులో చాలామొత్తం ప్రీ-ఓన్డ్ కార్లు మాత్రమే కాకుండా రెండు ప్లాట్ ఫామ్స్‍‌లలో రిజిస్టర్ అయి ఉండే అవకాశముంది.

ఓలా, ఉబెర్ కారణమని చెప్పలేం

ఓలా, ఉబెర్ కారణమని చెప్పలేం

ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసుల వల్లే ఆటో సేల్స్ చెప్పలేమని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్ శ్రీవాత్సవ చెప్పారు. వీటి ప్రభావ అంతగా లేదని, అయితే భవిష్యత్తులో ఈ ప్రమాదం ఉండవచ్చునని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు.

ఓలా, ఉబెర్ వ్యాపారంపై ప్రభావితం..

ఓలా, ఉబెర్ వ్యాపారంపై ప్రభావితం..

మరో ఆసక్తికర విషయం ఏమంటే ఈ మందగమనం ఈ సంవత్సరం ఓలా, ఉబెర్ వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసింది. రోజువారీ రైడర్‌షిప్స్‌లో అగ్రిగేటర్స్ వృద్ధి 2016లో 80 శాతానికి పైగా ఉంటే, 2019లో ఇది 4.5 శాతం తగ్గింది. ఓలా, ఉబెర్ సంస్థలు 2018లో ప్రతి రోజు 3.5 మిలియన్ ట్రిప్పులు నిర్వహించగా, ఇప్పుడు 3.65 మిలియన్ ట్రిప్పులు మాత్రమే ఉంది.

సొంత కారు వర్సెస్ క్యాబ్

సొంత కారు వర్సెస్ క్యాబ్

ఇక, కారుపై చేసే ఖర్చును లెక్కలోకి తీసుకున్నప్పటికీ కేంద్ర ఆర్థికమంత్రి లెక్కలు సరికావని అంటున్నారు. నిర్వహణ ఖర్చు, ఓనర్‌షిప్, మైలేజ్, డ్రైవర్ వేతనం తీసుకుంటే ప్రతి రోజు 20 కిలోమీటర్ల ప్రయాణానికి పర్సనల్ కారుకు రూ.740 ఖర్చు అవుతుంది.

నెరవారీగా చూస్తే క్యాబ్స్‌కు రూ.13,500 ఖర్చు కాగా, పర్సనల్ కారుకు రూ.18,160 అవుతుంది. పీక్ హవర్స్‌లో క్యాబ్ ట్రిప్ 25 శాతం పెరిగితే అప్పుడు ఈ మొత్తం రూ.16,875 అవుతుంది. ఈ లెక్కన క్యాబ్ కంటే కారును సొంతం చేసుకోవడానికే ఆసక్తి చూపించే అవకాశాలు ఉంటాయి.

అదే సమయంలో ఎవరైనా రోజుకు 100 కిలో మీటర్లు లేదా నెలకు 2500 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే క్యాబ్ బిల్ రూ.44,000 అవుతుంది. పీక్ హవర్స్ అయితే రూ.55,000 వరకు కూడా అవుతుంది. అదే సమయంలో సొంత వెహికిల్ అయితే కేవలం రూ.26,802 అవుతుంది.

English summary

Is Ola Uber pushing auto sale slump?

Facts, numbers and economics they all belie finance Minister Nirmala Sitharaman's unique if not bizarre explanation to the slowdown in the country's automobile sector.
Story first published: Thursday, September 12, 2019, 16:47 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more