For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 నెలల గరిష్టానికి ద్రవ్యోల్భణం, మీ బడ్జెట్ పైనా ప్రభావం!

|

గృహోపకరణాలు, ఇంధనం, ఆహారం మొదలగు వివిధ వస్తువుల రిటైల్ ధరలు ఆగస్టులో పది నెలల గరిష్టాన్ని తాకినట్లుగా కనిపిస్తోంది. కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ ప్రకారం సీపీఐ ద్రవ్యోల్భణం రేటు జూలై నెలలో 3.15 శాతంగా ఉండగా, ఆగస్టు నెలలో ఇది 3.23 శాతంగా ఉంది. మార్కెట్ ఏకాభిప్రాయం ప్రకారం ఆగస్టులో ద్రవ్యోల్భణ అంచనా 3.35 శాతం. రెపో రేటు తగ్గినప్పటికీ ద్రవ్యోల్భణం వరుసగా పదమూడో నెలలో ఆర్బీఐ లక్ష్యం 4 శాతం కంటే తక్కువగా ఉంది.

జూలైలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 2.3 శాతం పెరిగిందని కొటక్ నివేదిక పేర్కొంది. అంటే అంతకుముందు నెల కంటే దాదాపు 2 సాతం పెరుగుదల. అంతకుముందు జూన్ నెలలో ఐఐపీ వృద్ధి 2 శాతానికి పడిపోయింది. అధే సమయంలో ఏడాది క్రితం ఇదే నెలలో 7 శాతంగా ఉంది. మైనింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లోని బలహీనత మందగమనానికి కారణం. ప్రాథమిక వస్తువుల తయారీ జూన్ నెలలో 0.05 శాతం మాత్రమే పెరిగింది. ఇది ఏడాది క్రితం 9.2 శాతంగా ఉంది.

అదే సమయంలో మౌలిక సదుపాయాలు, నిర్మాణ వస్తువుల తయారీ 1.8 శాతం తగ్గింది. ఈ నెలలో కాపిడల్ గూడ్స్ తయారీలో కూడా తగ్గుదల ఉంది. జూలైలో ఐఐపీ 2.6 శాతం వృద్ధి చెందుతుందని మార్కెట్ ఆశించినట్లు కొటక్ నివేదిక తెలిపింది.

SBI ఖాతాదారులకు షాక్, RDపై తగ్గిన వడ్డీ రేట్లు ఇలా...SBI ఖాతాదారులకు షాక్, RDపై తగ్గిన వడ్డీ రేట్లు ఇలా...

Inflation may bite your household budget, may have risen to 10-month high in August

భారత్ జీడీపీ 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఆరేళ్ల కనిష్టానికి చేరుకుంది. తొలి క్వార్టర్‌లో జీడీపీ 5 శాతంగా మాత్రమే ఉంది. ప్రధానంగా నిర్మాణ, వ్యవసాయం, తయారీ రంగానికి బలహీనమైన డిమాండ్ కారణంగా ఈ ప్రభావం జీడీపీ పైన పడింది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోందని, అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విషయాన్ని పక్కన పెడితే భారతదేశంలో తగ్గుతున్న డిమాండ్ ప్రభావమే ఎక్కువగా ఉందని, ఇది ఆర్థిక వ్యవస్థను లాగుతోందని ఐసీఈఎక్స్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ (ప్రోడక్ట్ డెవలప్‌మెంట్) రమేష్ అయ్యర్ అన్నారు. తయారీరంగంలో బలహీనత కమొడిటీస్‌ను దెబ్బతీస్తోందని చెప్పారు.

English summary

10 నెలల గరిష్టానికి ద్రవ్యోల్భణం, మీ బడ్జెట్ పైనా ప్రభావం! | Inflation may bite your household budget, may have risen to 10-month high in August

Retail prices of different items such as household goods, fuel, food, etc, are likely to have touched a 10-month high in August.
Story first published: Wednesday, September 11, 2019, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X