For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైరా నరసింహా రెడ్డి రికార్డ్స్: రూ.40 కోట్లు చెల్లించిన అమెజాన్ ప్రైమ్!!

|

టాలీవుడ్ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత పదేళ్ల పాటు సినిమాలు లేకపోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు 'సైరా' నరసింహా రెడ్డి పైన అంచనాలు బాగానే ఉన్నాయి.

రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన...రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన...

అక్టోబర్ 2న విడుదల

అక్టోబర్ 2న విడుదల

ఈ సినిమా బడ్జెట్ రూ.270 కోట్ల నుంచి రూ.300 కోట్లు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పైన రామ్ చరణ్ తేజ సినిమాను నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో విడుదలవుతోంది.

డిజిటల్ రైట్స్ రూ.40 కోట్లు

డిజిటల్ రైట్స్ రూ.40 కోట్లు

'సైరా' నరసింహా రెడ్డి సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.40 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ ఈ సినిమా హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుందట. అన్ని భాషల హక్కుల కోసం నలభై కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా తెలుస్తోంది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోందని తెలుస్తోంది. 107 సెకండ్లు కలిగిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.

తెలుగులోనే రూ.110 కోట్లు

తెలుగులోనే రూ.110 కోట్లు

ఈ సినిమా హక్కులను ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.19.6 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. నైజాం హక్కులు రూ.30 కోట్లు, ఆంధ్రా-సీడెడ్ హక్కులు రూ.80 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఇక, ఇ సినిమా ప్రి-రిలీడ్ బిజినెస్ ఒక్క తెలుగులోనే రూ.110 కోట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు డిజిటల్ రైట్స్ రూ.40 కోట్లుగా వార్తలు వస్తున్నాయి.

భారీ మొత్తానికి టీవీ ఛానల్స్, డిజిటల్ స్ట్రీమింగ్...

భారీ మొత్తానికి టీవీ ఛానల్స్, డిజిటల్ స్ట్రీమింగ్...

ఇటివలి కాలంలో టీవీ ఛానల్స్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ ఇలాంటి బిజినెస్‌కు కోట్లాది రూపాయలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన సాహో తర్వాత తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా సైరా. ఇందులో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, నయనతార, సుదీప్, జగపతి బాబు, రవికిషన్ తదితరులు నటిస్తున్నారు.

సినిమా విడుదలైన 60 రోజులకు OTT ప్లాట్ ఫామ్ పైన...

సినిమా విడుదలైన 60 రోజులకు OTT ప్లాట్ ఫామ్ పైన...

'సైరా' నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదలవుతుండగా, ఆ తర్వాత 60 రోజులకు OTT ప్లాట్ ఫామ్‌లో విడుదలవుతుంది. అంటే ఈ సినిమాను OTT ప్లాట్ ఫామ్ ద్వారా జనవరి 2020 వరకు చూడవచ్చు.

English summary

సైరా నరసింహా రెడ్డి రికార్డ్స్: రూ.40 కోట్లు చెల్లించిన అమెజాన్ ప్రైమ్!! | Chiranjeevi's Sye Raa Narasimha Reddy earns Rs.40 crore even before release

It is said that Sye Raa Narasimha Reddy has earned a whopping amount of Rs 40 crore even before its release. The film’s digital rights have been sold to Amazon Prime Video at this staggering price.
Story first published: Wednesday, September 11, 2019, 13:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X