For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన...

|

న్యూఢిల్లీ: చంద్రయాన్ 2 ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఇస్రో అద్భుత ప్రయోగం. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ గల్లంతైనప్పుడు పాకిస్తాన్ మంత్రి సహా భారత వ్యతిరేకులు భారీ మొత్తంలో డబ్బును వృథా చేశారని విమర్శించారు. చంద్రయాన్‌కు బదులు ఇతర అవసరాలకు ఉపయోగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డ వారు కూడా లేకపోలేదు. అయితే చంద్రయాన్ 2కు అయిన ఖర్చు ఎంతో తెలుసా.. రూ.978 కోట్లు.

తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండితగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి

చంద్రయాన్ ఖర్చు రూ.978 కోట్లు

చంద్రయాన్ ఖర్చు రూ.978 కోట్లు

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించారు. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ గల్లంతైనప్పటికీ, దాని జాడ తెలిసింది. కనెక్టివిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రయాన్ 2కు అయిన ఖర్చు దాదాపు 141 మిలియన్ డాలర్లు. అంటే రూ.978 కోట్లు. స్పెస్ సెగ్మెంట్ ఖర్చు రూ.603 కోట్లు, GSLV Mk III లాంచ్ కాస్ట్ రూ.375 కోట్లు.

రోడ్డు ఖర్చు రూ.972 కోట్లు

రోడ్డు ఖర్చు రూ.972 కోట్లు

ఈ ఖర్చు బెంగళూరులోని 94 కిలో మీటర్ల రోడ్డుకు చేసిన మొత్తానికి దాదాపు సమానం. అంటే చంద్రయాన్‌కు చేసిన ఖర్చు చాలా తక్కువ. 2016లో బృహత్ బెంగళూరు మహానగర పాలిక రెండు కంపెనీలకు 96 కిలో మీటర్ల రోడ్డు కాంట్రాక్ట్స్ అప్పగించింది. ఎన్‌సీసీ, మధుకాన్ ప్రాజెక్టులకు వీటిని అప్పగించింది. ఈ రోడ్డు ఖర్చు రూ.972 కోట్లు.

హాలీవుడ్ సినిమా కంటే తక్కువ ఖర్చు

హాలీవుడ్ సినిమా కంటే తక్కువ ఖర్చు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ ఏజెన్సీలతో పోలిస్తే మన ఇస్రో ప్రయోగాలకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. కేటాయించిన బడ్జెట్‌ను అత్యంత పొదుపుగా వినియోగిస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తోంది ఇస్రో. చంద్రయాన్ 2 కోసం చేసిన 141 మిలియన్ డాలర్ల ఖర్చు అంటే హాలీవుడ్‌లో ఓ భారీ యాక్షన్ సినిమా కోసం పెట్టిన ఖర్చు కంటే తక్కువ. నాసా వంటి స్పేస్ ఏజెన్సీలు ఇదే ప్రయోగం నిర్వహించేందుకు బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేయాలి.

చంద్రయాన్ 1 ఖర్చు చాలా తక్కువ..

చంద్రయాన్ 1 ఖర్చు చాలా తక్కువ..

చంద్రయాన్ 1లో కూడా నాసా తన పరిశోధన పరికరాన్ని పంపించింది. భారత్ మంగళయాన్‌కు 74 మిలియన్ డాలర్ల ఖర్చు అయితే, అమెరికా మవెన్‌కు 672 మిలియన్ డాలర్లు ఖర్చు కావడం గమనార్హం.

ఆ 12 దేశాల్లో భారత్ ఒకటి...

ఆ 12 దేశాల్లో భారత్ ఒకటి...

ఇంటర్నెట్, DTH, రేడియో, డిఫెన్స్, నావిగేషన్, కమ్యూనికేషన్, ఖనిజాన్వేషణ.. ఇలా ఏ రంగంలో చూసినా శాటిలైట్స్ అవసరం పెరిగింది. ప్రస్తుత స్పేస్ మార్కెట్ వ్యాల్యూ 350 బిలియన్ డాలర్లు ఉండగా, రానున్న ఆరేళ్లలో 550 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇలాంటి మార్కెట్లో ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం ఉన్న 12 దేశాల్లో భారత్ ఒకటి. ఈ 12 దేశాల్లోను సామర్థ్యం నిరూపించుకున్న వాటిల్లో భారత్.

ఇస్రోకు పెరుగుతున్న బడ్జెట్

ఇస్రోకు పెరుగుతున్న బడ్జెట్

అంతరిక్ష మార్కెట్లో వాటాను దక్కించుకునే దిశగా ఇస్రో దూసుకెళ్తోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్రోకు బడ్జెట్‌ను ప్రతి ఏటా పెంచుతోంది. గత అయిదేళ్లలో ఇస్రో బడ్జెట్ పెరిగింది. రూ.6వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు చేరుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు సంస్థల్ని, స్టార్టప్స్‌ను భాగస్వామ్యం చేస్తున్నారు.

ఇస్రోకు పెరుగుతున్న డిమాండ్..

ఇస్రోకు పెరుగుతున్న డిమాండ్..

ఇస్రో రాకెట్లకు డిమాండ్ పెరుగుతోంది. 2014లో 5 విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి చేర్చింది. 2015లో 17 విదేశీ ఉపగ్రహాలను, 2016లో 22 విదేశీ ఉపగ్రహాలను లక్ష్యానికి చేర్చింది. యాంత్రిక్స్... ఇస్రో వాణిజ్య విభాగం. గత అయిదేళ్లుగా ఆదాయం పెరుగుతోంది. 2017-18లో ఇస్రో ఆదాయం రూ.1932 కోట్లు కాగా, ఖర్చు రూ.2388 కోట్లు. ఇలాగే ముందుకెళ్తే ఇస్రో ఖర్చు కంటే ఆదాయం పెరగనుంది. పీఎల్ఎల్వీ సీ37 ప్రయోగం ద్వారా 104 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో కక్షలో చేర్చింది. దీనికి అయిన ఖర్చులో సగం ఇస్రోకు వచ్చింది.

చిన్న ఉపగ్రహాల కోసం...

చిన్న ఉపగ్రహాల కోసం...

చిన్న ఉపగ్రహాల విప్లవం రానున్న నేపథ్యంలో ఇస్రో ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది 2019 చివరి నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇస్రోకు యాంత్రిక్స్ అనే వాణిజ్య విభాగం ఉండగా, కొత్తగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌ను ప్రారంభించింది.. వాణిజ్య, అభివృద్ధికి అవసరమైన పరిశోధలను ప్రోత్సహిస్తోంది.

English summary

రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన... | Roads costs more than chandrayaan mission, How isro earning money

As of June 2019, the mission has an allocated cost of ₹978 crore (approximately US$141 million) which includes ₹603 crore for space segment and ₹375 crore as launch costs on GSLV Mk III. Chandrayaan 2 stack was initially put in an Earth parking orbit of 170 km perigee and 40,400 km apogee by the launch vehicle.
Story first published: Tuesday, September 10, 2019, 16:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X