For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎం నష్టాలు మూడు రెట్లు, పెరిగిన ఖర్చుతో రూ.4,217 కోట్ల లాస్

|

పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి గతంలో కంటే మూడు రెట్ల నష్టాన్ని చవి చూసింది. పేటీఎం బ్రాండ్ నిర్మాణం కోసం, వ్యాపార విస్తరణ కోసం భారీ ఎత్తున ఖర్చు చేసింది. ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నష్టం మార్చి 31వ తేదీ నాటికి రూ.4,217.20 కోట్లకు పెరిగింది. అంటే రోజుకు సగటున రూ.11 కోట్ల వరకు నష్టపోయింది. అంతకుముందు ఏడాది ఇది ఈ నష్టం రూ.1,604.34 కోట్లుగా ఉండేది. ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది.

భారీ ట్రాఫిక్ చలాన్లు: డాక్యుమెంట్స్ లేకున్నా ఇలా తప్పించుకోవచ్చు!భారీ ట్రాఫిక్ చలాన్లు: డాక్యుమెంట్స్ లేకున్నా ఇలా తప్పించుకోవచ్చు!

ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ కార్పోరేట్ ప్రొఫెషనల్స్ కాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంటూ ఇంగ్లీష్ మీడియాలో ఇందుకు సంబంధించిన వివరాలు వచ్చాయి.

Paytm’s losses almost triple to Rs.4,217 cr in FY19 as expenses rise

దీని ప్రకారం వన్97 మొదటి లాభాన్ని 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.207.61 కోట్లుగా అంచనా వేస్తోంది. వన్ 97 కమ్యూనికేషన్స్ 2026 ఆర్థిక సంవత్సరానికి రూ.8,512.69 కోట్ల మేర లాభాన్ని నమోదు చేయవచ్చునని గత ఫిబ్రవరి నెలలో అంచనా వేశారు.

2019 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రెవెన్యూ రూ.8.2 శాతం పెరిగి రూ.3,579.67 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది రూ.3,309.61 కోట్లుగా ఉంది. అదే సమయంలో ఖర్చులు మాత్రం రెండింతలు పెరిగి రూ.7,730.14గా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఖర్చులు రూ.4,864.53గా ఉన్నాయి.

ఈ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు, బ్రాండ్‌ను డెవలప్ చేసుకునేందుకు భారీ మూలధనం ఇన్వెస్ట్ చేసిందని, వివిధ మూలధన, కార్యాచరణ వ్యయాల్లో గణనీయమైన మొత్తాలను తాము కలిగి ఉన్నామని, దీని ఫలితంగా ఆర్థిక సంవత్సరంలో నష్టాలు సంభవించాయని కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ... పేటీఎం వ్యాల్యుయేషన్ 25 శాతం పెరిగి 15 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ పైన దృష్టి సారించడంతో ఎక్కువమంది పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. ఈ యాప్స్ కూడా తమ తమ యాప్స్‌లలో కొత్త కొత్త వాటిని పరిచయం చేస్తున్నారు. చెల్లింపులు చేయడం నుంచి మొదలు బంగారం కొనుగోలు చేసే ఆప్షన్స్ వరకు ఈ యాప్స్‌లలో ఉన్నాయి.

Read more about: paytm పేటీఎం
English summary

పేటీఎం నష్టాలు మూడు రెట్లు, పెరిగిన ఖర్చుతో రూ.4,217 కోట్ల లాస్ | Paytm’s losses almost triple to Rs.4,217 cr in FY19 as expenses rise

One97 Communications Ltd, the parent of Paytm, nearly tripled its losses in the year ended 31 March as it spent more on building its brand and expanding its business.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X