For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ నిర్ణయం తీసుకుంటే... రూ.30,000 కోట్ల ఆదాయానికి గండి

|

గత కొద్ది కొన్నాళ్లుగా ఆటో సేల్స్ భారీగా పడిపోయాయి. కొన్ని వేరియెంట్ సేల్స్ రెండు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. ఇటీవలి కాలంలో అన్ని ఆటో సేల్స్ పడిపోవడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఆటో సేల్స్ తగ్గడంతో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ మందగమనాన్ని తట్టుకొని నిలిచేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కొన్ని ఊరట ప్రకటనలు కూడా చేశారు. అలాగే అన్ని వాహనాలు, వాహన విడిభాగాలపై జీఎస్టీ కేవలం 18 శాతంగా ఉండాలని ఇండస్ట్రీ కోరుకుంటోంది. అయితే హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంపై భారీగా భారం పడనుంది.

రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే...రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే...

రూ.30,000 కోట్ల రెవెన్యూ తగ్గే అవకాశం

రూ.30,000 కోట్ల రెవెన్యూ తగ్గే అవకాశం

జీఎస్టీ రేటు తగ్గింపు వల్ల ప్రభుత్వ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ కారణమే ప్రభుత్వం ఆటో ఇండస్ట్రీ జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ తక్షణమే నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వివరాల ప్రకారం... ట్యాక్స్ డిపార్టుమెంట్ అంతర్గత అంచనాల ప్రకారం జీఎస్టీని తగ్గిస్తే ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా వచ్చే రెవెన్యూ రూ.30,000 కోట్లు తగ్గుతుంది.

పది శాతం తగ్గిస్తే...

పది శాతం తగ్గిస్తే...

కొటక్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం... జీఎస్టీ రేటును బోర్డు అంతటికీ 10 శాతం మేర తగ్గిస్తే సంవత్సరంలో ఆదాయంపై ప్రభావం రూ.45,000 కోట్ల మేర పడుతుంది. మొత్తంగా జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయంపై గణనీయంగా ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.

ఆటో సెక్టార్ ద్వారా రూ.3 లక్షల రెవెన్యూ

ఆటో సెక్టార్ ద్వారా రూ.3 లక్షల రెవెన్యూ

ఆటో సెక్టార్ యాన్యువల్ రెవెన్యూ ఏడాదికి రూ.3 లక్షల కోట్లు. ప్రస్తుతం ఆటోమొబైల్స్ పైన జీఎస్టీ 28 శాతంగా ఉంది. విభాగాన్ని బట్టి కార్లు, బైకులపై గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. దీనిపై 1 శాతం నుంచి 22 శాతం వరకు సెస్ ఉంటుంది.. కాగా, జీఎస్టీని ఎంత మేర తగ్గించాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. కానీ జీఎస్టీని తగ్గిస్తే ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల భారం మాత్రం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

సెస్ లేకుండా పోతుంది...

సెస్ లేకుండా పోతుంది...

గత కొన్నాళ్లుగా ఆటో సెక్టార్ భారీగా పడిపోయింది. సేల్స్ 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీని తగ్గించాలని ఇండస్ట్రీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల వచ్చే ఇబ్బందులను జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ పరిశీలిస్తోంది. అదే సమయంలోరాష్ట్రాలు జీఎస్టీ తగ్గింపును వ్యతిరేకించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గిస్తే పది శాతం తగ్గించినట్లవుతుంది. దీని వల్ల సెస్ లేకుండా పోతుందని చెబుతున్నారు.

అందుకే రాష్ట్రాలు నో చెప్పవచ్చు..

అందుకే రాష్ట్రాలు నో చెప్పవచ్చు..

అధిక పన్ను రేటుపై విధించే సెస్‌ను మాత్రమే జీఎస్టీ పరిహార చట్టం అనుమతిస్తుంది. ఒకవేళ పన్నును తగ్గిస్తే రాష్ట్రాలు పరిహారం పొందడానికి అవకాశం ఉండదు. జీఎస్టీ మూలంగా రాష్ట్రాలు కోల్పోయే రాబడిని కేంద్రం పరిహారం కింద అందిస్తోంది. ఇక జీఎస్టీని తగ్గించినంత మాత్రాన సేల్స్ పెరుగుతాయా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

English summary

ఆ నిర్ణయం తీసుకుంటే... రూ.30,000 కోట్ల ఆదాయానికి గండి | GST rate cut on auto could mean Rs.30,000 cr revenue loss for govt

The auto industry has been hoping for a GST rate cut from 28 percent to 18 percent to bring it out of a demand slump. But, the adverse revenue impact of a rate cut might keep the government from taking any immediate decision.
Story first published: Tuesday, September 10, 2019, 12:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X