For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

540 ఉద్యోగులను తొలగించిన జొమాటో, కారణాలివే...

|

ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో 541 మంది ఉద్యోగులను తొలగించినట్లు శనివారం ప్రకటించింది. సంస్థ ఉద్యోగుల్లో ఇది 10% కావడం గమనార్హం. ఆగస్ట్ నెలలో 60 మందిని తొలగించిన అనంతరం ఇలా ఫుడ్ డెలివరీ, రెస్టారెండ్ డిస్కవరీ యాప్ ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. కస్టమర్, మర్చంట్, డెలివరీ భాగస్వామ్య మద్దతు బృందాలు తదితర విభాగాల్లో ఈ కోతలు జరిగాయి.

కాగా, కృత్రిమ మేధస్సు (AI)తో జొమాటొను ఆధునికీకరించారు. ఈ ఆటోమేషనద వల్ల వీరు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నిర్ణయం బాధాకరం అయినప్పటికీ తప్పలేదని, ఉద్యోగాలు కోల్పోయినవారికి సీనియారిటీ ప్రకారం రెండు నెలల జీతం, వచ్చే ఏడాది జనవరి చివరి వరకు పలు ప్రయోజనాలను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఉద్యోగం నుంచి తొలగించిన వారి కోసం జాబ్ ఫెయిర్ నిర్వహిస్తామని తెలిపింది.

SBI ఖాతాదారులకు షాక్, RDపై తగ్గిన వడ్డీ రేట్లు ఇలా...SBI ఖాతాదారులకు షాక్, RDపై తగ్గిన వడ్డీ రేట్లు ఇలా...

Zomato lays off 540 employees from its customer support team

కొద్ది రోజులుగా తమ సాంకేతిక ఉత్పత్తులు, ప్లాట్ ఫామ్స్ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నవని చెబుతున్నారు. ప్రస్తుతం తమ ఆర్డర్స్‌కు 7.5 శాతం సపోర్ట్ మాత్రమే అవసరమని కంపెనీ తెలిపింది. ఇది మార్చిలో 15 శాతంగా ఉంది. ఉద్యోగాల కట్ ఖర్చులు తగ్గించుకునేందుకు కాదని స్పష్టం చేసింది.

ఈ సంవత్సరం తాము 1200 మందిని కొత్తగా నియమించుకున్నామని, మరో 400 మంది ఆఫ్ రోల్ పొజిషన్లో ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం తాము టెక్నాలజీ, ప్రోడక్ట్, డేటా సైన్స్ టీమ్స్‌ను నియమించుకుంటున్నామని తెలిపింది. కస్టమర్ సపోర్ట్ టీమ్‌లో 400 మంది మాత్రమే మిగిలినట్లు తెలిపింది. ఇటీవల జొమాటో గోల్డ్ స్కీంపై రెస్టారెంట్ ఓనర్లు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.

English summary

540 ఉద్యోగులను తొలగించిన జొమాటో, కారణాలివే... | Zomato lays off 540 employees from its customer support team

Zomato has laid off 540 employees from its customer support team, comprising 10% of its overall workforce, the company said in a statement Saturday.
Story first published: Sunday, September 8, 2019, 9:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X