For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసి కస్టమర్లకు గుడ్ న్యూస్ : మరో కొత్త ప్లాన్ వచ్చింది

|

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) తన కస్టమర్ల కోసం సరికొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ప్రకటించింది. 'టెక్-టర్మ్' పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది నాన్ లింక్డ్, లాభం లేని, ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ అని సంస్థ చెబుతోంది. ఇది ఆన్ లైన్ టర్మ్ అష్యురెన్సు పాలసీ. ఈ పాలసీ తీసుకున్న వారు దురదృష్ట వశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా రక్షణ లభిస్తుంది.

'ఆంధ్రా బ్యాంకు'పై జగన్ కీలక నిర్ణయం, డ్రైవర్లకు గుడ్‌న్యూస్'ఆంధ్రా బ్యాంకు'పై జగన్ కీలక నిర్ణయం, డ్రైవర్లకు గుడ్‌న్యూస్

ఎవరు తీసుకోవచ్చు..

ఎవరు తీసుకోవచ్చు..

* ఈ పాలసీ కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు.

* దీన్ని దేశీయంగా నివసిస్తున్న వారు మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

* ఓవర్సీస్ సిటిజన్స్ అఫ్ ఇండియా, భారత సంతతికి చెందిన వారు ఈ పాలసీ తీసుకోరాదు.

* ప్రవాస భారతీయులు మాత్రం పాలసీ తీసుకోవచ్చు.ఇందుకు కొన్ని షరతులు ఉంటాయి.

పాలసీ కాలపరిమితి

పాలసీ కాలపరిమితి

* ఈ పాలసీ కనీస కాలపరిమితి 10 సంవత్సరాలు. గరిష్ట కాలపరిమితి 40 ఏళ్ళు.

* కనీస ప్రవేశ వయసు 18 సంవత్సరాలు. గరిష్ట ప్రవేశ వయసు 65 ఏళ్ళు.

* పాలసీ కవరేజ్ గరిష్ట వయసు 80 ఏళ్ళు.

* కనీస లైఫ్ కవరేజీ రూ. 50 లక్షలు. గరిష్ట పరిమితి లేదు.

* పాలసీ ప్రీమియంను ఏడాదికి, ఆరు నెలలకు లేదా సింగల్ ప్రీమియం ద్వారా చెల్లించవచ్చు.

* పొగతాగే వారికీ, పొగ తాగని వారికీ సంబంధించి ప్రీమియం రేట్లలో తేడాలుంటాయి.

* అదనంగా ప్రీమియం చెల్లించి యాక్సిడెంటల్ ప్రయోజన రైడర్న్ తీసుకోవచ్చు.

అవసరానికి అనుగుణంగా

అవసరానికి అనుగుణంగా

* ఒకవేళ పాలసీదారు మరణించిన సందర్భంలో అందే ప్రయోజనాన్నినామినీ పొందేందుకు సంబంధించి పాలసీదారు నచ్చినట్టుగా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

* ఒకేసారి లేదా వాయిదాల్లో 5 ఏళ్ళలో, 10 ఏళ్ళు, 15 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకోవచ్చు .

ఎలా కొనుగోలు చేయాలంటే..

ఎలా కొనుగోలు చేయాలంటే..

* ఎల్ ఐ సి వెబ్ సైట్ ద్వారా టెక్ టర్మ్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. అన్ని వివరాలు తెలియజేసిన తర్వాత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అడ్రసుకు డాక్యుమెంట్లు పంపిస్తారు.

English summary

ఎల్ఐసి కస్టమర్లకు గుడ్ న్యూస్ : మరో కొత్త ప్లాన్ వచ్చింది | LIC launches tech term insurance plan, offers financial protection

The new tech-term plan will be a non linked, without profit and pure protection online term assurance policy.
Story first published: Friday, September 6, 2019, 10:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X