For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం ధర, మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా?

|

బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లు, అమెరికా - చైనా ట్రేడ్ వార్ భయంతో ఇప్పటి వరకు పెరిగిన పసిడి ధర తగ్గుముఖం పట్టింది. మార్కెట్లు రూ.1,000 వరకు తగ్గింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.39,885కు చేరుకుంది. తద్వారా వారం రోజుల కనిష్టానికి తగ్గింది. గత సెషన్‌లో బంగారం 0.95 శాతం లేదా రూ.368 తగ్గి రూ.38,526కు చేరుకుంది. సిల్వర్ ధర రూ.1271 లేదా 2.57 శాతం తగ్గి రూ.48,187 వద్ద ఉంది. సెప్టెంబర్ 4వ తేదీన వెండి ఏకంగా రూ.2500 వరకు పెరిగి కిలో రూ.51,489తో జీవనకాల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే.

ఈ-కామర్స్ 'ఢీ': భారత్‌కు దూసుకొస్తున్న 'అలీబాబా'ఈ-కామర్స్ 'ఢీ': భారత్‌కు దూసుకొస్తున్న 'అలీబాబా'

హైదరాబాద్, విజయవాడల్లో ధరలు...

హైదరాబాద్, విజయవాడల్లో ధరలు...

24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.39,640 పలికింది. ముంబైలో రూ.39,536 పలికింది. చెన్నైలో రూ.39,537, విజయవాడలో రూ.39,544, విశాఖపట్నంలో రూ.39,546గా నమోదైంది. బంగారం రూ.1000కి పైగా తగ్గింది. స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరలు ఢిల్లీలో రూ.372 తగ్గి రూ.39,278గా ఉంది.

తగ్గిన ధరలు

తగ్గిన ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో నిన్న పడిపోయిన బంగారం ధరలు ఈ రోజు కూడా పడిపోయాయి. శుక్రవారం 0.2 శాతం పడిపోయి ఔన్స్ బంగారం 1,516.02 డాలర్లుగా ఉంది. గురువారం ఒక్క రోజే బంగారం ధరలు 2 శాతం, వెండి ధరలు 4 శాతం పడిపోయాయి.

మళ్లీ పెరగొచ్చు...

మళ్లీ పెరగొచ్చు...

ఇదిలా ఉంటే ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వచ్చిన ధరల తగ్గుదల స్వల్పకాలికమేనని అంటున్నారు. దసరా, దీపావళి.. పండుగలకు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో వర్తకుల నుంచి డిమాండ్ ఉంటుంది. దీంతో మళ్లీ ధరలు పెరగవచ్చునని భావిస్తున్నారు.

ఇన్వెస్ట్ మెంట్.. రిస్క్ సెంటిమెంట్..

ఇన్వెస్ట్ మెంట్.. రిస్క్ సెంటిమెంట్..

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం అమాంతం పెరిగింది. రిస్క్ సెంటిమెంట్ మరీ ఎక్కువైందని, అందుకే బంగారం, వెండి వంటి లోహాలపై ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. అలాగే, ధరలు గరిష్టస్థాయిలకు చేరుకున్న తర్వాత కొంతమంది ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకున్నారని ఇది కూడా ప్రభావం చూపిందని చెబుతున్నారు.

ఇంకా ఆ భయాలు తొలగిపోలేదా...

ఇంకా ఆ భయాలు తొలగిపోలేదా...

ఔన్స్ బంగారం ధర రికార్డ్ $1555కు చేరుకున్న తర్వాత ఒత్తిడికి గురైందని, అయితే ప్రపంచ మాద్యం భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, అలాగే అమెరికా - చైనా ట్రేడ్ వార్ తుది దశకు రాలేదని, కాబట్టి సానుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

English summary

భారీగా తగ్గిన బంగారం ధర, మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా? | Gold tumbles Rs.1000 from its all time high: silver seclines too on global trend

In line with the global price scenario, gold in the domestic markets have rolled back the previous gains and is down Rs. 1000 from its previous highs scaled on MCX of Rs. 39,885 per 10gm, reached earlier during the week.
Story first published: Friday, September 6, 2019, 17:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X