For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లోని 8 లర్నింగ్ క్రియేటర్లలో యూట్యూబ్ పెట్టుబడి

|

న్యూఢిల్లీ: యూట్యూబ్ ఎనిమిది భారతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సోమవారం నాడు ప్రకటించింది. వీటిలో ఎగ్జామ్ ఫియర్ (హిందీ) లెర్న్ ఇంజినీరింగ్, డోంట్ మెమొరైస్, స్టడీ ఐక్యూ ఎడ్యుకేషన్, డార్ట్ ఆఫ్ సైన్స్, లెర్నెక్స్, గెట్ సెట్ ఫ్లై సైన్స్, లెట్స్ మేక్ ఇంజినీరింగ్ సింపుల్ ఛానళ్లలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. వీటికి యూట్యూబ్ లెర్నింగ్ ఫండ్ నుంచి కంటెంట్‌ను అభివృద్ధి చేయడానికి వివిధ అంశాలను విశ్లేషించేందుకు ఫండ్స్ సమకూర్చింది.

నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్-అన్‌లాక్ ఎలాగో తెలుసుకోండి?నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్-అన్‌లాక్ ఎలాగో తెలుసుకోండి?

వీటికి డిమాండ్....

వీటికి డిమాండ్....

ఈ ఛానల్స్ పొలిటికల్ సైన్స్, జెనెటిక్స్, కెమిస్ట్రీ, కాలిక్యూలెస్‍‌లను ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో అబివృద్ధి చేసేందుకు ఫండ్స్ ఇచ్చారు. వీరు ఇప్పటికే ఆయా రంగాలకు సంబంధించిన కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దేశంలోని కంటెంట్ తయారీదారులు నిర్వహించిన ఎడ్యుకాన్‌లో ఈ విషయాన్ని యూట్యూబ్ ప్రకటించింది. ఈ కంపెనీలకు యూట్యూబ్ ఫండ్స్ అందించడంతో పాటు మార్గదర్శనం చేస్తుంది.

లర్నింగ్ వీడియోలకు వందల మిలియన్ల వ్యూస్

లర్నింగ్ వీడియోలకు వందల మిలియన్ల వ్యూస్

యూట్యూబ్ ప్రస్తుతం భారత్‌లో నెలకు 265 మిలియన్ల యాక్టివ్ యూజర్స్‌ను చేరుకుంటోంది. ప్రపంచ మార్కెట్లో ఇది అతి పెద్దది. నడ తమ వీడియో లైబ్రరీ భారత్‌లో అతిపెద్ద సప్లిమెంటరీ లర్నింగ్ ప్లాట్ ఫామ్‌గా నిలుస్తోందని యూట్యూబ్ వెల్లడించింది. లర్నింగ్ వీడియోలకు ప్రతి రోజు వందల మిలియన్ల వ్యూస్ వస్తాయని వెల్లడించింది. ఈ వీడియోలు కేవలం పట్టణ ప్రాంత యూజర్లనే కాకుండా టయర్ II, టయర్ III నగరాలను కూడా ఆకట్టుకుంటున్నట్లు తెలిపింది.

80 శాతం మందికి రీచ్ అయింది

80 శాతం మందికి రీచ్ అయింది

ఇంటర్నెట్ ఉపయోగించే 80 శాతం మందికి యూట్యూబ్ రీచ్ అయింది. దేశవ్యాప్తంగా కంటెంట్ కోసం మంచి డిమాండ్ ఉందని, వివిధ భారతీయ భాషలలోని వివిధ టాపిక్స్‌కు డిమాండ్ ఉందని తెలిపింది. ఉదాహరణకు ప్రభుత్వ, పబ్లిక్ సర్వీస్ ఎంట్రన్స్ పరీక్షలు, ఇంగ్లీష్ లాంగ్వెజ్ ట్యూటోరియల్స్, సైన్స్, మాథ్స్ వంటి వాటికి డిమాండ్ ఉందని యూట్యూబ్ ఇండియా డైరెక్టర్ కంటెంట్ పార్ట్‌నర్‌షిప్ సత్య రాఘవన్ అన్నారు. వీటితో పాటు ఫార్మింగ్, ఫోటోగ్రఫీ, క్రికెట్, ఫైనాన్షియల్ లిటరసీకికూడా డిమాండ్ ఉందని తెలిపారు.

English summary

భారత్‌లోని 8 లర్నింగ్ క్రియేటర్లలో యూట్యూబ్ పెట్టుబడి | YouTube to invest in growing learning content across Indian languages

YouTube India today announced that it has invested in a bunch of homegrown learning creators in a bid to expand the learning community on its platform.
Story first published: Tuesday, September 3, 2019, 16:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X