For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కస్టమర్లపై దిగ్గజ టెలీకాం కంపెనీ కన్ను

|

దేశీయ టెలీకాం రంగంలో మరోమారు కంపెనీల మధ్య పోరు సాగే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. కొత్త కస్టమర్లను సంపాదించుకోవడానికి ఈ కంపెనీల మధ్య ధరల యుద్ధం జరిగిన చరిత్ర వుంది. కాల్ చార్జీలు, డేటా చార్జీలను పోటీ పడి కంపెనీలు తగ్గించిన ఉదంతాలున్నాయి. రిలయన్స్ జియో ప్రవేశం తర్వాత మొత్తం దేశీయ టెలికామ్ రంగం మారిపోయింది. అన్ని కంపెనీలు కూడా జియో బాటలో సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని కంపెనీలు ఆర్థికంగా నిలదొక్కుకోలేక మరో కంపెనీతో కలిసిపోవాల్సి వచ్చింది. ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిస్తూ జియో ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఇప్పటికే అగ్రస్థానంలోకి చేరిపోయింది. రానున్న కాలంలో ఇంకా తన కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న జియో ఇప్పుడు పకడ్బందీ వ్యూహంతో సిద్ధమవుతున్నట్టు సమాచారం.

అలర్ట్‌గా ఉన్నారా: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవి మారిపోయాయ్!అలర్ట్‌గా ఉన్నారా: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవి మారిపోయాయ్!

పోస్ట్ పెయిడ్ లో పోరు..

పోస్ట్ పెయిడ్ లో పోరు..

* ప్రీపెయిడ్ టెలికాం విభాగంలో జియో సృష్టించిన సంచలనాలు తెలిసినవే. టారిఫ్ లను భారీగా తగ్గించడం వల్ల కంపెనీ కస్టమర్లను తన వైపునకు తిప్పుకోగలిగింది. అయితే పోస్ట్ పెయిడ్ విభాగంలోని కస్టమర్లు మాత్రం ఇంకా పాత టెలీకాం కంపెనీల వద్దనే ఎక్కువగా ఉన్నారు.

జియో కస్టమర్లపై దృష్టి

జియో కస్టమర్లపై దృష్టి

* ఇప్పుడు జియో ఈ కస్టమర్లపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

* ప్రస్తుతం భారతీ ఎయిర్ టెల్, వొడా ఫోన్ ఐడియా కంపెనీల వద్ద ఎక్కువగా పోస్ట్ పెయిడ్ కస్టమర్లున్నారు. ఈ కస్టమర్ల ద్వారా కంపెనీలకు మంచి రాబడి వస్తుంది.

* అయితే జియో తన హోమ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ద్వారా హై ఎండ్ మొబైల్ యూజర్లకు తన వైపునకు తిప్పుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను రూపొందించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

* వచ్చే ఐదో తేదీనే జియో తన బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

* ఈ కంపెనీ ప్రకటించే ప్లాన్లను బట్టి ఇతర కంపెనీలు తమ వ్యుహల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఎయిర్ టెల్ ఇప్పటికే తన ఎయిర్ టెల్ థాంక్స్ ద్వారా కస్టమర్లకు మంచి ఆఫర్లను ఇస్తోంది.

మైక్రోసాఫ్ట్ అండ..

మైక్రోసాఫ్ట్ అండ..

* రిలయన్స్ జియో మైక్రోసాఫ్ట్ తో జట్టు కట్టిన విషయం తెలిసిందే. దీని కారణంగా రిలయన్స్ జియో అందుబాటు ధరల్లోని చిన్న వ్యాపార సంస్థలకు, బ్యాంకులకు, కార్పొరేట్లకు క్లౌడ్ ఆధారిత ఎంటర్ ప్రైజ్ సర్వీసులను అందించే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా బల్కుగా పోస్ట్ పెయిడ్ కనెక్షన్లను ఇవ్వడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను.

* ప్రీపెయిడ్ మాదిరిగానే పోస్ట్ పెయిడ్ విభాగంలోనూ జియో వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల పాత కంపెనీలు కొంత మంది కస్టమర్లకు కోల్పోయే అవకాశం ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

English summary

ఆ కస్టమర్లపై దిగ్గజ టెలీకాం కంపెనీ కన్ను | Postpaid, the new battleground for India's top telcos

The postpaid mobile turf, currently dominated by the country’s older incumbent carriers, is set to emerge as the new battleground for the next wave of savage price wars with new telecom market leader Reliance Jio Infocomm likely to set its sights on luring away these high-spending, revenue-generating customers from Bharti Airtel and Vodafone Idea, analysts said.
Story first published: Tuesday, September 3, 2019, 9:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X