For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన మారుతీ సుజుకీ సేల్స్, కంపెనీ అనూహ్య నిర్ణయం

|

ముంబై: మారుతీ సుజుకీ తన చిన్న కార్ల పోర్ట్‌పోలియోలో సీఎన్‌జీ మోడల్స్ పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం డీజీల్ కార్లు ఆక్రమించిన వ్యాపార స్థలాన్ని పూరించేందుకు సీఎన్జీ ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. డీజిల్ కార్ల విక్రయాలను ఏప్రిల్ 2020 నాటికి నిలిపివేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహిస్తోంది. దీంతో డీజిల్ కార్లపై ఆంక్షలు పెరగనున్నాయి. దీంతో సీఎన్జీ మోడల్స్‍‌ను తీసుకు రావాలనుకుంటోంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై SBI వడ్డీ రేటు తగ్గింపు: FD రేట్లుఫిక్స్‌డ్ డిపాజిట్స్‌పై SBI వడ్డీ రేటు తగ్గింపు: FD రేట్లు

ఎక్కువ కార్లు సీఎన్జీలోకి..

ఎక్కువ కార్లు సీఎన్జీలోకి..

తమ చిన్న కార్ల పోర్ట్‌పోలియోలోని వాహనాలు ఎక్కువగా సీఎన్జీలోకి మారనున్నాయని, ప్రభుత్వం సీఎన్జీని ఇప్పటికే పర్యావరణ అనుకూల ఇంధనంగా గుర్తించిందని, దీనిని విస్తరించేందుకు 10,000 సీఎన్జీ విక్రయ కేంద్రాలను దేశవ్యాప్తంగా ఎర్పాటు చేస్తామని కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు.

చాలా మంచి ఆప్షన్

చాలా మంచి ఆప్షన్

చిన్న కార్ల అంశంలో సీఎన్జీ చాలా మంచి ఆప్షన్ అని కంపెనీ భావిస్తోంది. ఆయిల్ వాహనాలకు ఇది ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. తాము పర్యావరణ హిత కార్ల వాడకాన్ని ప్రోత్సహిస్తామని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) సీవీ రామన్ అన్నారు. ప్రస్తుతం మారుతీ సుజుకీ 16 మోడల్స్‌లలో సగం సీఎన్జీ వేరియంట్స్ ఉన్నాయి. ఆల్టో, ఆల్టో K10, సెలారియో, వాగన్ఆర్, డిజైర్, ఎర్టిగా, ఈకో కార్లు సీఎన్జీ వేరియంట్స్‌లలో ఉన్నాయి.

5 లక్షల కార్ల విక్రయం

5 లక్షల కార్ల విక్రయం

ప్రస్తుతం మారుతీ సుజుకీ 5 లక్షల సీఎన్జీ కార్లను విక్రయించింది. దాదాపు దేశంలో 30 లక్షల వరకు సీఎన్జీ వెహికిల్సు ఉంటాయని అంచనా. ఇందులో మారుతీ సుజుకీ వాటా 17 శాతంగా ఉంటుంది. సీఎన్జీ కార్లను పెంచడం ద్వారా కంపెనీ ఆయిల్ దిగుమతి తగ్గి భారం తగ్గనుంది. అదే విధంగా కాలుష్య కారకం కాదు.

తగ్గిన వాహనాల విక్రయం

తగ్గిన వాహనాల విక్రయం

ఇదిలా ఉండగా, మారుతీ సుజుకీ వాహన విక్రయాలు ఆగస్ట్ నెలలో భారీగా తగ్గాయి. గత నెలలో ఈ సెల్స్ 35 శాతానికి పైగా తగ్గాయి. దీంతో వాహన విక్రయాలను పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ విక్రయించే మొత్తం వాహనాల్లో సీఎన్జీ మోడల్స్ 7 శాతం వరకు ఉన్నాయి. తొలి నాలుగు నెలల్లో 31వేల సీఎన్జీ వాహనాలను విక్రయించింది.

English summary

తగ్గిన మారుతీ సుజుకీ సేల్స్, కంపెనీ అనూహ్య నిర్ణయం | Maruti to expand range of CNG cars amid declining sales

Maruti Suzuki plans to make its entire small car portfolio available in compressed natural gas (CNG) variants. It is looking at the CNG option to fill the space currently occupied by diesel cars, which it intends to stop selling by April 2020.
Story first published: Tuesday, September 3, 2019, 13:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X