For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోలుకోని ఆటోమొబైల్స్, 30 శాతం తగ్గిన సేల్స్

|

న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా ఆటోమొబైల్ సేల్స్ తగ్గిపోతున్నాయి. జీఎస్టీ, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం ప్రోత్సాహ ప్రకటన, ప్రపంచవ్యాప్తంగా మందగమన పరిస్థితులు, ఇటీవలి వరకు FPIలు తరలి వెళ్లడం వంటి వివిధ కారణాల వల్ల వాహనాల సేల్స్ పడిపోతున్నాయి. పది రోజుల క్రితం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కాస్త తేరుకునే ప్రకటన చేశారు. కొన్ని నెలలుగా మందగించిన సేల్స్, ఆగస్ట్ నెలలోను తగ్గిపోయాయి.

అలర్ట్‌గా ఉన్నారా: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవి మారిపోయాయ్!అలర్ట్‌గా ఉన్నారా: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇవి మారిపోయాయ్!

29 శాతం పడిపోయిన బజాజ్..

29 శాతం పడిపోయిన బజాజ్..

ఆటో సేల్స్ వరుసగా పదో నెల.. ఆగస్టులోను పడిపోయాయి. అంతకుముందు ఏడాది ఆగస్ట్ నెలలో కంటే 29 శాతం పడిపోయాయి. భారత అతిపెద్ద కార్ మేకర్ మారుతీ సుజుకీ 2018 ఆగస్ట్‌లో 145,895 యూనిట్లు విక్రయిస్తే ఈ ఆగస్టులో 93,173 మాత్రమే విక్రయించాయి. 36 శాతం సేల్స్ పడపోయాయి. మారుతీ సుజుకీ లక్ష యూనిట్ల కంటే తక్కువ సేల్ చేయడం ఇది వరుసగా రెండో నెల.

ఇవీ తగ్గాయి...

ఇవీ తగ్గాయి...

హ్యుండాయ్ మోటార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహింద్రా సేల్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. గత ఏడాది కాలంగా ఈ కంపెనీలు వివిధ రకాల కొత్త వాహనాలతో వచ్చాయి. కానీ ఫలితం లేదు. గత ఏడాది అక్టోబర్‌లో హ్యుండాయ్ సాంట్రోను కొత్తగా తీసుకు వచ్చింది. ఈ ఏడాది మే నెలలో తన తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకు వచ్చింది. హ్యాచ్ బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్‌ మూడో తరం వర్షన్‌ను గత నెలలో విడుదల చేసింది. వీటి రిజిస్ట్రేషన్‌లో గత నెల 16.6 శాతం శాతం తగ్గింది. మహీంద్రా తీసుకు వచ్చిన మరాజో ఎంపీవీ, ఆల్ట్రాస్ ప్రీమియం, ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా 31.6 శాతం సేల్స్ తగ్గాయి.

2018 ఆగస్ట్, 2019 ఆగస్ట్ సేల్స్ ఇలా...

2018 ఆగస్ట్, 2019 ఆగస్ట్ సేల్స్ ఇలా...

ఆగస్ట్ 2018లో... మారుతీ సుజుకీ సేల్స్ 1,45,895 ఉండగా 2019 ఆగస్ట్‌లో 93,173 (36.14 శాతం క్షీణత)కు పడిపోయాయి. హ్యుండాయ్ మోటరోలా ఇండియా 45,801 నుంచి 38,205 (16.58 శాతం), మహీంద్ర అండ్ మహీంద్రా 19,758 నుంచి 13,507 (31.64 శాతం), టాటా మోటార్స్ 17,351 నుంచి 7,316 (57.84 శాతం), హోండా కార్స్ ఇండియా 17,020 నుంచి 8,291 (51.29), టయోటా కిర్లోస్కర్ మోటోర్ లిమిటెడ్ 14,100 నుంచి 10,701 (24.11 శాతం), ఫోర్డ్, 8,042 నుంచి 5,517 (31.40 శాతం), రెనాల్ట్ 6,557 నుంచి 5,700 (13.07 శాతం), నిస్సాన్ 3,108 నుంచి 1,413 (54.54 శాతం), వీడబ్ల్యూ 3,34 నుంచి 2,306 (30.83 శాతం), ఫియట్ 1,400 నుంచి 609 (56.50 శాతం), స్కోడా 1330 నుంచి 1164 (12.48 శాతం)కి తగ్గాయి. కొత్తగా వచ్చిన ఎంజీ, కియాలు వరుసగా 2018, 6200 సేల్ అయ్యాయి. మొత్తంగా ఆగస్ట్ 2018లో 2,83,696 కార్లు సేల్ అయితే 2019లో 1,96,120 మాత్రమే సేల్ అయ్యాయి. మొత్తంగా 30.87 శాతం సేల్స్ తగ్గాయి.

English summary

కోలుకోని ఆటోమొబైల్స్, 30 శాతం తగ్గిన సేల్స్ | Slowdown Blues: Car sales crash 29% in August, all eyes on Sep 20 GST meet

Automobile sales in the country crashed again by nearly a third in August 2019 over last year marking the 10th straight month that sales have declined.
Story first published: Monday, September 2, 2019, 13:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X