For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వగలం అన్న ఎస్బీఐ చైర్మన్ ... మందగమనానికి కారణం బ్యాంకులు కాదట !!

|

దేశంలో పెద్ద ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఊహించని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్టుబడిదారులకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. అయితే ఇదే సమయంలో గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశ నగదు కొరత ఎదుర్కొంటుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వ్యవస్థల నమ్మకం లోపించడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని పేర్కొనడం జరిగింది.

అయితే బ్యాంకులకు నగదు కొరత లేదని ఎస్బిఐ బ్యాంక్ చైర్మన్ రజనీష్ పేర్కొన్నారు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎస్బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ పరిస్థితి పై మాట్లాడుతూ నెలకు లక్ష కోట్ల వరకు అప్పు ఇచ్చే స్థాయిలో ఎస్బిఐ ఉందని పేర్కొన్నారు. ఒక ఎస్బిఐ మాత్రమే కాదు చాలా బ్యాంకులలో ఇబ్బంది లేదని ఆయన వ్యాఖ్యానించారు .బ్యాంకులు అప్పు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల ఆర్థిక మందగమనం అన్నదానిపై ఆయన పై విధంగా స్పందించారు. బ్యాంకులు ఎప్పుడు రుణాలు ఇవ్వడానికి వెనక్కి పోవడం లేదని పేర్కొన్నారు. ఇక నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ నే ప్రశ్నించడంటూ సమాధానం చెప్పారు.

SBI Chairman stated they can lend Rs. 1 lakh crore for investments

అంతేకాదు ప్రస్తుతం అప్పులు ఇచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతుందని, అయితే పెద్ద ప్రాజెక్టు మాత్రం కాస్త తక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఉన్నాయని ఆయన తెలిపారు బ్యాంకింగ్ విధానంలో కొన్ని మార్పులు వచ్చాయని, కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు. అలాగే కంపెనీలు కూడా అప్పులు తగ్గించుకొని జాగ్రత్తగా కంపెనీల నిర్వహణ చేయాలని సూచించారు .ఒకవేళ కంపెనీలు అప్పులు తగ్గించుకుంటే కార్పొరేట్ రంగానికి వెళ్లే క్రెడిట్ తాము ఊహించనంత ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.

English summary

నెలలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వగలం అన్న ఎస్బీఐ చైర్మన్ ... మందగమనానికి కారణం బ్యాంకులు కాదట !! | SBI Chairman stated they can lend Rs. 1 lakh crore for investments

As concerns mount over a cash crunch in the economy, State Bank of India Chairman Rajnish Kumar said he has at least Rs. 1 lakh crore to lend for investments. The Chairman of the country's biggest lender was responding to questions on whether banks' reluctance to lend was contributing to the slowdown.
Story first published: Saturday, August 31, 2019, 17:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X