For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విలీనం తర్వాత మిగిలిన బ్యాంకులివే: ర్యాంకులు, బిజినెస్ సైజ్...

|

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు బ్యాంకుల విలీనంపై ప్రకటన చేశారు. ఈ విలీనంతో 2017 వరకు 27 ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇప్పుడు 12కు కుదించబడ్డాయి. విలీనం తర్వాత మిగిలిన బ్యాంకులు ఇవే....

రూ.70,000 కోట్లలో విలీనం తర్వాత ఏ బ్యాంకుకు ఎంత అంటే?రూ.70,000 కోట్లలో విలీనం తర్వాత ఏ బ్యాంకుకు ఎంత అంటే?

ప్రస్తుతం విలీనమైన బ్యాంకులు...

1 .పంజాబ్ నేషనల్ బ్యాంక్ (ఓరియెంటల్ బ్యాంక్ ఆప్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అనంతరం), 2. కెనరా బ్యాంకు (సిండికేట్ బ్యాంకు విలీనం), 3. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు విలీనం), 4. ఇండియన్ బ్యాంకు (అలహాబాద్ బ్యాంకు). ఈ కొత్త బ్యాంకుల విలీనం అనంతరం పేర్లు మారే అవకాశాలున్నాయి.

12 బ్యాంకుల్లో మిగతావి...

12 బ్యాంకుల్లో మిగతావి...

మిగతా బ్యాంకులు... 5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), 6.బ్యాంక్ ఆఫ్ బరోడా, 7. బ్యాంక్ ఆఫ్ ఇండియా, 8. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 9. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, 10. యూకో బ్యాంకు, 11. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, 12. పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు.

బ్యాంకుల బిజినెస్ సైజ్

బ్యాంకుల బిజినెస్ సైజ్

- ప్రస్తుతం దేశంలో అతిపెద్ద బ్యాంకు SBI.

- ఎస్బీఐ వ్యాపార పరిమాణం రూ.52.05 లక్షల కోట్లు.

- రెండో స్థానంలో విలీనమవుతున్న PNB + OBC + United Bank బ్యాంకులు రూ.17.94 లక్షల కోట్లతో ఉన్నాయి.

- బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యాపార పరిమాణం రూ.16.13 లక్షల కోట్లు. ఇది మూడో స్థానంలో ఉంది.

- Canara Bank + Syndicate వ్యాపార పరిమాణం రూ.15.20 లక్షల కోట్లు. నాలుగో స్థానంలో ఉంది.

- Union Bank + Andhra Bank + Corporation Bank వ్యాపార పరిమాణం రూ.14.59 లక్షల కోట్లు. ఐదో స్థానంలో ఉంది.

- బ్యాంక్ ఆఫ్ ఇండియాది రూ.90.3 లక్షల కోట్లు. ఇది ఆరో స్థానంలో ఉంది.

- Indian Bank + Allahabad Bank వ్యాపార పరిమాణం రూ.8.08 లక్షల కోట్లు. ఇది ఏడో స్థానంలో ఉంది.

- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4.68 లక్షల కోట్లతో 8వ స్థానంలో ఉంది.

- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రూ.3.75 లక్షలతో 9వ స్థానంలో ఉంది.

- యూకో బ్యాంకు రూ.3.17 లక్షల కోట్లతో 10వ స్థానంలో ఉంది.

- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.2.34 లక్షల కోట్లతో 11వ స్థానంలో ఉంది.

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు రూ.1.71 లక్షల కోట్లతో 12వ స్థానంలో ఉంది.

English summary

విలీనం తర్వాత మిగిలిన బ్యాంకులివే: ర్యాంకులు, బిజినెస్ సైజ్... | Consolidation of 27 Govt Banks Into 12: Banks and Business size

Finance Minister Nirmala Sitharaman on Friday announced a series of mergers involving 10 state-owned banks on Friday, as the government moves to strengthen a sector struggling under a mountain of debt and ensure stronger balance sheets to boost lending and revive economic growth.
Story first published: Friday, August 30, 2019, 19:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X