For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలకూ హెల్మెట్.. ఇక భారీ ఫైన్: సెప్టెంబర్ 1 నుంచే కొత్త వాహన చట్టం

|

న్యూఢిల్లీ: కొత్త మోటార్ వెహికిల్స్ సవరణ చట్టం -2019 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం (ఆగస్ట్ 28) వెల్లడించింది. కొత్త MV యాక్ట్‌లోని 28 నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. మిగిలిన సెక్షన్లకు సంబంధించిన డ్రాఫ్ట్ నిబంధనల్ని రూపొందించి, అభిప్రాయ సేకరణ తర్వాత అమలు చేస్తామని కూడా చెప్పింది. మొదట రోడ్డు ప్రమాద నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఎక్కువగా అమల్లోకి తీసుకు వస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు.

<strong>అలర్ట్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, కొత్త పెనాల్టీ పూర్తి లిస్ట్</strong>అలర్ట్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, కొత్త పెనాల్టీ పూర్తి లిస్ట్

కొత్త మోటార్ చట్టం ప్రకారం భారీగా జరిమానా..

కొత్త మోటార్ చట్టం ప్రకారం భారీగా జరిమానా..

కొత్త మోటార్ చట్టం ప్రకారం జరిమానాలు భారీగానే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే రూ.500 నుంచి రూ.10,000 వరకు జరిమానా, ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ లోడుతో వెళ్లే వెహికిల్స్ పైన రూ.20వేల జరిమానా ఉంటుంది. అలాగే ప్రతి అదనపు టన్నుకు రూ.2వేల చొప్పున ఫైన్ ఉంటుంది. పైగా అదనంగా ఉన్న బరువును దించే వరకు ఆ వాహనాన్ని వెళ్లనివ్వరు.

ఎక్కువమంది ప్రయాణీకులు ఉంటే..

ఎక్కువమంది ప్రయాణీకులు ఉంటే..

వాహనాల్లో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువమంది ప్రయాణీకులను ఎక్కించుకునే వాహనాలకు ఒక్కొక్క ప్రయాణీకుడి పైన రూ.200 చొప్పున ఫైన్ విధిస్తారు. అదనపు ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించిన అనంతరం సదరు వాహనాన్ని ముందుకు కదలనిస్తారు.

నాలుగేళ్లు దాటిన పిల్లలకూ హెల్మెట్

నాలుగేళ్లు దాటిన పిల్లలకూ హెల్మెట్

కారులో సీటు బెల్టు ధరించని వారికి రూ.1,000 జరిమానా విధిస్తారు. బైక్ పైన వెళ్లే సమయంలో నాలుగేళ్లలోపు పిల్లలు కూడా హెల్మెట్ ధరించాలి. మైనర్లు బండి నడిపితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులదే బాధ్యత. ప్రమాదకర డ్రైవింగ్, రాంగ్ రూట్, స్పీడ్ డ్రైవింగ్‌కు పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తారు.

2017లో ప్రమాదాలు...

2017లో ప్రమాదాలు...

రోడ్డు ప్రమాదాల వల్ల దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వికలాంగులుగా మారుతున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఉదాహరణకు 2017లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా జరిగిన ప్రమాదమాల లెక్క ఒక్కసారి చూద్దాం.... ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ ఉపయోగం, రెడ్ సిగ్నల్ జంపింగ్, ఇతర వయోలేషన్స్ వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

ఎంతోమంది మృత్యువాత

ఎంతోమంది మృత్యువాత

2017లో ఓవర్ స్పీడింగ్ వల్ల 3,27,448, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 29,148, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల 14,071, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ 8,526, రెడ్ సిగ్నల్ జంపింగ్ వల్ల 6,324, ఇతర నిబంధనల ఉల్లంఘన వల్ల 79,394 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో వల్ల ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ ఉపయోగం, రెడ్ సిగ్నల్ జంప్, ఇతర నిబంధనల వల్ల వరుసగా... 98,613, 9,527, 4,776, 3,172, 1,826, 29,999 మంది చనిపోయారు. మొత్తం 1,47,913 మంది మృత్యువతా పడ్డారు. గాయపడ్డవారు 4,70,975 మంది.

లైసెన్స్ లేకుంటే...

లైసెన్స్ లేకుంటే...

- కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం జనరల్ (1778) జరిమానా ప్రస్తుతం రూ.100 ఉండగా, కొత్త జరిమానా రూ.500

- రోడ్డు నిబంధనల ఉల్లంఘన (177ఏ) రూ.100 నుంచి రూ.500కు పెంపు

- టిక్కెట్ లేని ప్రయాణం (178) రూ.200 నుంచి రూ.500

- అధికారుల ఆదేశాల ధిక్కరణ (179) రూ.500 నుంచి రూ.2000

- అనుమతి లేకుండా వాహనం నడపడం (180) రూ.1000 నుంచి రూ.5,000

- లైసెన్స్ లేని డ్రైవింగ్ (181) రూ.500 నుంచి రూ.5,000

- అర్హత లేని వాహన డ్రైవింగ్ (182) రూ.500 నుంచి రూ.10,000

- అనుమతి లేని భారీ పరిమాణ వాహనం నడిపితే (182బీ) రూ.5,000 ఫైన్ విధిస్తారు.

స్పీడ్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ ఫైన్

స్పీడ్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్ ఫైన్

- స్పీడ్ డ్రైవింగ్ (183) రూ.400 నుంచి రూ.1000 నుంచి రూ.2000 వరకు

- లైట్ మోటార్ వెహికిల్స్ అయితే రూ.1,000. మధ్యస్థాయి వాహనాలు అయితే రూ.2,000

- ప్రమాదకర డ్రైవింగ్ (184) రూ.1,000 నుంచి రూ.5,000 వరకు

- డ్రంకన్ డ్రైవింగ్ (185) రూ.2,000 నుంచి రూ.10,000

- లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘనకు ఇక నుంచి రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకు ఫైన్ విధిస్తారు.

సీటు బెల్ట్, బైక్ పైన ఎక్కువ మంది...

సీటు బెల్ట్, బైక్ పైన ఎక్కువ మంది...

- వాహనంపై అధిక లోడు (194) ఇదివరకు రూ.2,000 ఫైన్

- ప్రతి అదనపు టన్నుపై రూ.1,000గా ఉండేది. ఇక నుంచి రూ.20,000 జరిమానా. ప్రతి అదనపు టన్నుపై రూ.2,000.

- సీటు బెల్టు లేకుంటే (194బీ) రూ.100 నుంచి రూ.1,000కి పెంచారు.

- బైక్ పైన ఎక్కువ మంది ప్రయాణిస్తే (194సీ) రూ.100 నుంచి రూ.2,000 వరకు జరిమానా మరియు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు.

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే..

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే..

- ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే (194ఈ) రూ.10,000 జరిమానా వేస్తారు.

- ఇన్సురెన్స్ లేని వాహనాలకు ఇదివరకు రూ.1000 ఉండగా, ఇక నుంచి రూ.2000 వసూలు చేస్తారు.

- పిల్లలు వాహనం నడిపితే ఇక నుంచి వాహన యజమాని లేదా సంరక్షకుడిని అపరాధిగా భావిస్తారు. రూ.25వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం. బాల నేరస్థుల కింద వాహనం నడిపిన బాలలకు శిక్ష. వాహన రిజిస్ట్రేషన్ రద్దు.

- అధికారులు అడిగిన డాక్యుమెంట్స్ చూపించకుంటే (206) వివిధ సెక్షన్ల కింద డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

అధికారులపై ఒత్తిడి తెస్తే (210బీ) సంబంధిత సెక్షన్ కింద ఇప్పుడున్న జరిమానాకు రెట్టింపు.

Read more about: traffic vehicle
English summary

పిల్లలకూ హెల్మెట్.. ఇక భారీ ఫైన్: సెప్టెంబర్ 1 నుంచే కొత్త వాహన చట్టం | How the new MV act puts on the road to safety, Hefty fines For violations from september 1

In recent times, rarely would there have been changes in legislation touching each and every stage of life. Whether it is about making it mandatory for a child younger than four years, to wear a helmet, or making guardians responsible for a juvenile driving a vehicle, or increasing penalties manifold for offences such as drunk and dangerous driving, over-speeding, driving without permit, the Motor Vehicles (Amendment) Act, 2019 will impact everyone.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X