For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్ల నిబంధనలు మరింత సరళతరం

|

న్యూఢిల్లీ: విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్ల నిబంధల్ని మరింత సరళతరం చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం త్వరలో పరిశీలించే అవకాశముందని తెలుస్తోంది. ఇందులో సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు తమ బ్రిక్ అండ్ మోర్టార్ దుకాణాలను ఏర్పాటు చేయడానికి ముందే ఆన్‌లైన్ స్టోర్స్ ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సింగిల్ బ్రాండ్ రిటైల్ కంపెనీలు తమ ఫిజికల్ స్టోర్‌ను ఏర్పాటు చేశాకనే ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు ప్రారంభించాలి. విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్స్ స్థానికంగా ముప్పై శాతం వనరుల్ని సమకూర్చుకోవాలన్న నిబంధన ఉంది.

ఇప్పుడు దీనిని సరళతరం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ చేసిన సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐకి సంబంధించి లోకల్ సోర్సింగ్ నిబంధనలను సరళతరం చేస్తామన్న ప్రకటనకు అనుగుణంగా ఈ మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ రంగంలో వంద శాతం వరకు ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. దీంతో విదేశీ కంపెనీలు తమ సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారానికి సంబంధించిన షాప్స్ ఏర్పాటు చేయవచ్చు.

<strong>గోల్డ్ ఈటీఎఫ్‌లకు భలే గిరాకీ.. జోరుగా పెరుగుతున్న పెట్టుబడులు</strong>గోల్డ్ ఈటీఎఫ్‌లకు భలే గిరాకీ.. జోరుగా పెరుగుతున్న పెట్టుబడులు

Govt to soon consider proposal to relax local sourcing norms for FDI in single brand retail

ఈ సెక్టార్‌లోకి వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ జనవరి 2018లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్ వాణిజ్యంలో ఫారన్ ప్లేయర్స్ ప్రభుత్వ అనుమతి లేకుండానే సొంత దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. 2006లో తొలిసారి 51 శాతం ఎఫ్‌డీఐలకు కేంద్రం ఆమోదం తెలిపింది.

2012 జనవరి నెలలో దానిని 100% పెంచుతూ పెంచుతూ, అందులో 49% పెట్టుబడులు ఆటోమేటిక్ మార్గంలో, మిగిలిన మొత్తం ప్రభుత్వ ఆమోదంతో రావాల్సి ఉంటుందని పేర్కొంది. గత ఏడాది శాతం అనుమతిస్తూనే, ప్రభుత్వ అనుమతులు లేకుండానే సొంతంగా షాప్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు మరింత వెసులుబాటు కల్పించనుందని తెలుస్తోంది.

English summary

విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్ల నిబంధనలు మరింత సరళతరం | Govt to soon consider proposal to relax local sourcing norms for FDI in single brand retail

The government will soon consider a proposal of relaxing rules for complying with the mandatory 30% local sourcing norms by foreign single brand retailers, official sources said.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X