For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైక్ లేదు... ప్రైవేటు ఉద్యోగులకు.. ఇది అత్యంత చెత్త ఏడాది!

|

మీరు ప్రైవేటు రంగ ఉద్యోగా? ఈ ఏడాది మీరు ఆశించిన మేర హైక్ ఇవ్వలేదా? మంచి హైక్ లేదని బాధపడవద్దు. ఎందుకంటే దాదాపు అన్ని కంపెనీల్లోను ఇదే పరిస్థితి. ఆటోమొబైల్ రంగం దెబ్బతినడంతో వేలాది ఉద్యోగాలు పోతున్నాయి. ఎఫ్ఎంసీజీ సంక్షోభంలో ఉంది. ప్రపంచంలోని పరిణామాల నేపథ్యంలో ఆర్థికమాంద్యం భయం పట్టుకుంది. జీతాలు పెరుగుతాయని ప్రైవేటు రంగ సంస్థ ఉద్యోగులు ఆశలు పెట్టుకుంటారు. కానీ ఆర్థికమాంద్యం కారణంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు అన్ని కంపెనీలు జీతాల పెంపును పక్కన పెట్టేశాయి.

<strong>ప్రతినెల ఆదాయం: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం గురించి తెలుసుకోండి</strong>ప్రతినెల ఆదాయం: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం గురించి తెలుసుకోండి

వేతనాల పెంపును పక్కన పెట్టిన కంపెనీలు

వేతనాల పెంపును పక్కన పెట్టిన కంపెనీలు

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) ఆధ్వర్యంలోని సమాచారం ద్వారా ఈ అసంతృప్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. ఈసారి అప్రైజల్స్ చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దాదాపు అన్ని కంపెనీలు.. ముఖ్యంగా ప్రైవేటు రంగ కంపెనీలు వేతనాల పెంపును పక్కన పెట్టేశాయి. గత పదేళ్ల కాలంలో ఉద్యోగులకు అత్యంత గడ్డుకాలం 2018-19 అని వెల్లడైంది. 2009-10 తర్వాత గత ఏడాది వేతనాల్లో వృద్ధి దారుణంగా నమోదైనట్లు ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక తెలిపింది.

ఆల్ టైమ్ హైకి నిరుద్యోగం

ఆల్ టైమ్ హైకి నిరుద్యోగం

ఓ వైపు నిరుద్యోగం పెరుగుతోంది. మరోవైపు ఉద్యోగులకు వేతనాల్లో వృద్ధి లేదు. ఈ రెండు అంశాలు దేశానికి ఆందోళన కలిగించేవిగా చెబుతున్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం 2017-18లో ఆల్ ఇండియా నిరుద్యోగత రేటు 6.1 శాతంగా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. జెండర్ ప్రకారం చూస్తే.. మేల్ వర్కర్స్ నిరుద్యోగిత 1977-78 తర్వాత, మహిళల నిరుద్యోగిత 1983 తర్వాత ఆల్ టైమ్ హైకి చేరుకుంది.

మూడో దెబ్బ...

మూడో దెబ్బ...

ఓ వైపు నిరుద్యోగం, మరోవైపు ఉద్యోగుల వేతనాల్లో వృద్ధికి తోడు మూడో బాధాకరమైన విషయం కూడా ఉందని అంటున్నారు. ఉద్యోగ కల్పన క్రమంగా తగ్గుతోందని ఇటీవల కేర్ రేటింగ్ సర్వే వెల్లడించింది. బ్యాంకులు, ఇన్సురెన్స్ కంపెనీలు, కార్ మేకర్స్, లాజిస్టిక్ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్స్ ఉద్యోగులను చాలా చాలా తక్కువగా తీసుకుంటున్నారు. కొన్ని రంగాలు ఉద్యోగాలను తీసుకోవడం లేదు. అత్యవసరమైతే ఔట్ సోర్సింగ్ సేవలు పొందుతున్నాయి. పలు రంగాలలో ఉద్యోగ కల్పన రేటు తగ్గింది.

నిరుద్యోగులు 2.85 కోట్లు

నిరుద్యోగులు 2.85 కోట్లు

PLFS ప్రకారం 2017-18లో నిరుద్యోగుల సంఖ్య 28.5 మిలియన్లు (2.85 కోట్లు). 2011-12తో పోల్చితే (10.8 మిలియన్లు) ఇది రెండింతల కంటే ఎక్కువ కావడం ఆందోళనకరం. 1999-2000 మరియు 2011-2012 మధ్యకాలంలో 10 మిలియన్లు పెరిగారు. 2011-12 నుంచి 2017-18 మధ్య... ఆరేళ్లలో 18 మిలియన్ల నిరుద్యోగులు పెరిగారు. కొత్త ఉద్యోగాలు కేవలం 0.5 శాతం మాత్రమే క్రియేట్ అయ్యాయి. ఓ వైపు ఉద్యోగాలు తగ్గుతుంటే, మరోవైపు ఉద్యోగం చేసేవారు పెరుగుతున్నారు.

సేల్స్ మందగమనం

సేల్స్ మందగమనం

బిజినెస్ తగ్గిపోవడం, ఆర్థికమందగమనం ఈ నిరుద్యోగతకు కారణంగా చెబుతున్నారు. కార్పోరేట్ కంపెనీల గ్రోత్ కూడా ఆశించిన మేర లేదు. ఈ ప్రభావం హైక్స్ మీద పడుతున్నాయి. 2018-19 నుంచి అంతకుముందు పదేళ్ల పాటు 4,953 కంపెనీల సేల్స్, వేతనాలు పరిశీలిస్తే 2012-13 నుంచి సేల్స్ మందగమనంలో ఉన్నాయి. 2016-17లో మాత్రమే కాస్త కోలుకున్నప్పటికీ తాత్కాలికమేనని తేలింది.

కాస్ట్ కట్టింగ్

కాస్ట్ కట్టింగ్

సేల్స్ తగ్గిన నేపథ్యంలో కంపెనీలు కాస్ట్ కట్టింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ కంపెనీ స్థిరత్వం కోసం ఖర్చులు తగ్గించుకున్నాయి. ఇందులో భాగంగా వేతనాల పెంపు ఆశించిన మేర లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో గత ఏడేళ్లతో పోలిస్తే తొలిసారి వేతన ఆదాయ శాతం తగ్గింది. సేల్స్ కూడా తగ్గాయి. వేతన ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు మొగ్గు చూపడం కూడా నిరుద్యోగత పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

ఈ కంపెనీల వేతన వాటా 13 శాతం

ఈ కంపెనీల వేతన వాటా 13 శాతం

CMIE డేటా బేస్ ప్రకారం 4,953 కంపెనీల్లో 2018-19 సేల్స్ రెవెన్యూ, నామినల్ వేజ్ గ్రోత్ వరుసగా 9 శాతం, 6 శాతంగా ఉన్నాయి. ఈ 4,953 కంపెనీల్లోని ఉద్యోగుల వేతనం 2018లో రూ.10.26 లక్షల కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోని ప్రైవేటు రంగంలోని మొత్తంతో పోలిస్తే 13 శాతం.

English summary

హైక్ లేదు... ప్రైవేటు ఉద్యోగులకు.. ఇది అత్యంత చెత్త ఏడాది! | For private sector salaries, this was the worst year in a decade

If your salary hike this year was nowhere close to what you were hoping for, don't let it leave you feeling left out: You are hardly the only one to be left high and dry.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X