For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుక్ మై ఫారెక్స్, యెస్ బ్యాంక్ భాగస్వామ్యం: మల్టీ కరెన్సీ ఫారెక్స్ ట్రావెల్ కార్డు

|

విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మరో మల్టీ కరెన్సీ ఫారెక్స్ ట్రావెల్ కార్డు అందుబాటులోకి వచ్చింది. రేట్లలో పారదర్శకత, భద్రత, సులభంగా చెల్లింపులు చేసే టెక్నాలజీ వంటివి ఇందులోని ముఖ్యమైన అంశాలు. ఫారిన్ ఎక్స్చేంజ్, రెమిటెన్సుకు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ప్లేస్ గా ఉన్న బుక్ మై ఫారెక్స్ డాట్ కామ్.. కో బ్రాండెడ్ మల్టీ కరెన్సీ ఫారెక్స్ ట్రావెల్ కార్డు ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం యెస్ బ్యాంక్, వీసా తో జట్టు కట్టింది. విదేశాలకు వెళ్లే భారతీయ కస్టమర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతుంది.

* బుక్ మై ఫారెక్స్ ప్లాట్ ఫారం ద్వారా కస్టమర్లు ఈ ఫారెక్స్ ట్రావెల్ కార్డును కొనుగోలు చేయవచ్చు.
* దీన్ని దేశంలోని ప్రధాన నగరాల్లో నేరుగా కస్టమర్ల ఇంటికే డెలివరీ చేస్తారు.
* ఇందులో భాగంగా జీరో మార్జిన్ లేదా ఇంటర్ బ్యాంకు రేట్లకే ఫారెక్స్ కార్డులను విక్రయిస్తోంది.
* కాంటాక్ట్ లెస్ వీసా కార్డు వల్ల పీవోఎస్ టెర్మినల్స్ వద్ద టాప్ చేయడం వల్ల చెల్లింపులు చేయవచ్చు.
* యుకె వంటి దేశాల్లో కొంత మంది వ్యాపారులు కేవలం కాంటాక్ట్ లెస్ చెల్లింపులనే అనుమతిస్తున్నారు. కాబట్టి ఇలాంటి దేశాలకు వెళ్లే వాళ్లు కాంటాక్ట్ లెస్ కార్డులను తీసుకోవడం మంచిది.

BookMyForex ties up with YES Bank, Visa to launch forex card

ఇవీ ఫీచర్లు ...

* ప్రయాణికులు ఈ కార్డును పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ కార్డులో మరిన్ని భద్రత ఫీచర్లను జోడించారు. రానున్న కాలంలో ఇందులో మరిన్ని వేరియంట్లను తీసుకు రానున్నారు.
* ఈ కార్డులో 10 రకాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల విభిన్న దేశాలకు వెళ్లే వాళ్లు ఒక్క కార్డుతో లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
* బుక్ మై ఫారెక్స్ అందుబాటులోకి తెచ్చే మొబైల్ యాప్ ద్వారా కార్డు దారులు చెల్లింపులు చేసే మొత్తం రూపాయల్లో ఎంత ఉంటుందో వెంటనే తెలుసుకోవచ్చు.
* కరెన్సీ వారీగా కూడా బ్యాలెన్స్ చూసుకోవచ్చు. అంతేకాకుండా సర్చార్జీ లేని ఏటీఎం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా తమ ట్రావెల్ కార్డుల్లో రీలోడ్ చేసుకోవచ్చు.
* ఎప్పుడైనా మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నట్టు అనుమానం వస్తే లాక్ చేసుకోవచ్చు. లేదా బ్లాక్ చేయవచ్చు. కస్టమర్ సర్వీస్ అవసరం లేకుండానే ఈపని పూర్తి చేయవచ్చు.

Read more about: yes bank visa వీసా
English summary

బుక్ మై ఫారెక్స్, యెస్ బ్యాంక్ భాగస్వామ్యం: మల్టీ కరెన్సీ ఫారెక్స్ ట్రావెల్ కార్డు | BookMyForex ties up with YES Bank, Visa to launch forex card

Marketplace for foreign exchange BookMyForex has partnered with YES Bank and card payment company Visa to launch a co branded multi currency foreign exchange card that aims to offer a smooth payments experience to Indians travelling abroad.
Story first published: Thursday, August 22, 2019, 13:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X