For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోల్ ఇండియాలో 88,585 ఉద్యోగాలు, అదో ఫేక్ నోటిఫికేషన్

|

న్యూఢిల్లీ: కోల్ ఇండియాలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై కోల్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ రిక్రూట్మెంట్స్ నోటీసుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SCCLCIL)లో 88,585 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కోల్ మినిస్ట్రీ పరిధిలోని కోల్ ఇండియా అనుబంధ సంస్థగా పేర్కొన్న సంస్థలో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నట్లు SCCLCIL నోటిఫికేషన్ పేర్కొంది. దీనిపై కోల్ ఇండియా స్పష్టత ఇచ్చింది.

<strong>బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?</strong>బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలా: ఎలా చేయాలి, ఎంత ఛార్జ్?

అనుబంధ సంస్థ కాదు..

అనుబంధ సంస్థ కాదు..

సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (SCCLCIL) పేరుతో కోల్ ఇండియాకు ఎలాంటి అనుబంధ సంస్థ లేదని, అది ఫేక్ నోటిఫికేషన్ అని కోల్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలోను స్పష్టత ఇచ్చింది. ఇలాంటి అసత్య ప్రకటనలు నమ్మవద్దని సూచించింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటు అన్ని రకాల ఉద్యోగాలకు కోల్ ఇండియానే నియామకాలు చేపడుతుందని, ఉద్యోగ ప్రకటనలు కూడా కోల్ ఇండియా వెబ్ సైట్‌లో ఉంటాయని తెలిపింది.

ఇవి మాత్రమే అనుబంధ సంస్థలు..

ఇవి మాత్రమే అనుబంధ సంస్థలు..

భారత్ కుకింగ్ కోల్ ఇండియా, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్, ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, మహనంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ మాత్రమే కోల్ ఇండియా అనుబంధ సంస్థలుగా ఉన్నాయని తెలిపింది. కానీ సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నకిలీది అని స్పష్టం చేసింది.

డిపాజిట్స్ కూడా అడుగుతున్నారు..

డిపాజిట్స్ కూడా అడుగుతున్నారు..

ఈ మధ్య కొన్ని ఫేక్ ఏజెన్సీలు లేదా వ్యక్తులు.. కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) పేరుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని కోల్ ఇండియా పేర్కొంది. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇలాంటి ఫేక్ ఏజెన్సీలు రీఫండబుల్, నాన్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్స్ కూడా అడుగుతున్నారని పేర్కొంది.

English summary

కోల్ ఇండియాలో 88,585 ఉద్యోగాలు, అదో ఫేక్ నోటిఫికేషన్ | Coal India warns against fake recruitment notice for 88,585 jobs at SCCLCIL

Coal India has cautioned government jobs seekers against a fake recruitment notice for 88,585 vacancies at South Central Coalfields Limited (SCCLCIL).
Story first published: Monday, August 19, 2019, 9:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X