For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీలో భారీ ప్రాజెక్ట్ కొన్న అదానీ! జగన్ నుంచి ఆ పారిశ్రామికవేత్తను కాపాడేందుకేనా?

|

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న క్రిష్ణపట్నం పోర్టులో మెజార్టీవాటా అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోబోతోంది. ఇరు సంస్థలూ సైలెంట్‌గా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ.5500 కోట్ల వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాల పక్కా సమాచారం.

<strong>ఏపీ పాలిటిక్స్ దెబ్బ, నెలలో 25% మార్కెట్ వ్యాల్యూ కోల్పోయిన కంపెనీ!!</strong>ఏపీ పాలిటిక్స్ దెబ్బ, నెలలో 25% మార్కెట్ వ్యాల్యూ కోల్పోయిన కంపెనీ!!

జగన్ ఎఫెక్టా ?

జగన్ ఎఫెక్టా ?

నెల్లూరు జిల్లా సమీపంలో ఉన్న క్రిష్ణపట్నం పోర్ట్ డీప్ వాటర్ సీ పోర్ట్. అత్యాధునికంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ పోర్టు ఆ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తోంది. నిలకడైన వృద్ధిని సాధిస్తూ వచ్చిన ఈ కంపెనీని ఉన్నట్టుండి అదానీ గ్రూపునకు అమ్మేసేందుకు సిద్ధమైంది నవయుగ. క్రిష్ణపట్నం పోర్టులు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నవయుగ సంస్థ నిర్వహిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని పదేళ్ల క్రితం గ్రీన్ ఫీల్డ్‌ పోర్టును నిర్మించిన నవయుగ. 2008లో ప్రారంభమైన ఈ ప ోర్ట్ ఏటా 5.4 కోట్ల టన్నుల సరుకును హ్యాండిల్ చేస్తోంది.

ఈ డీల్‌లో భాగంగా అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 3i గ్రూపు కూడా వైదొలగబోతోంది. పోర్టు నిర్మాణ సమయంలో ఉన్నప్పుడే 160 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది త్రీ ఐ సంస్థ. అదానీ గ్రూపుతో కుదుర్చుకున్న ఒప్పందం నేపధ్యంలో 78 శాతం వాటా చేతులు మారబోతోంది. కేవలం మైనార్టీ వాటా అయిన 28 శఆతం షేర్‌ మాత్రమే నవయుగ చేతుల్లో ఉండనుంది. అయితే ఛైర్మన్, ఎండి పదవుల్లో నవయుగ టీమ్ కొనసాగుతుందో.. లేదా అనేదే స్పష్టత లేదు.

 పోలవరం దెబ్బా ?

పోలవరం దెబ్బా ?

ఎన్నికల తర్వాత ఏపీలో ప్రభుత్వ పగ్గాలు మారాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేశారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు కూడా పుల్ స్టాప్ పెట్టారు. దీన్ని నిర్వహిస్తున్న నవయుగ సంస్థకు మొదటి షాక్ తగిలింది. ఇదే సమయంలో మచిలీపట్నం పోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఇబ్బందుల్లోకి వెళ్లిన గ్రూపు.. వీటి నుంచి ప్రస్తుతానికి బయటపడాలని చూస్తోంది. అందుకే సేఫ్ సైడ్‌గా అదానీ గ్రూపునకు పగ్గాలు అప్పగించింది.

 అదానీ కదిపే ధైర్యం ఉందా ?

అదానీ కదిపే ధైర్యం ఉందా ?

గౌతమ్ అదానీకి.. ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న దోస్తీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ నేపధ్యంలో అదానీ నవయుగకు చెందిన క్రిష్ణపట్నంను చేజిక్కించుకోవడంతో జగన్ అండ్ టీం కూడా ధైర్యం చేయకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే సేఫ్ సైడ్‌గా అదానీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

 ఎవరీ

ఎవరీ "చింత" ?

నవయుగ సంస్థను చింతా విశ్వేశ్వర రావు ప్రారంభించారు. దేశంలో అనేక ప్రాజెక్టులను నిర్వహించిన ఈ సంస్థకు వివిధ కాంట్రాక్టులను నిర్వహించిన అనుభవం ఉంది. చింతా విశ్వేశ్వర రావు కంపెనీలకు చెందిన టర్నోవర్ సుమారు రూ.7000 కోట్ల వరకూ ఉంటుంది. అదే సమయంలో సుమారు రూ.70 వేల కోట్ల వరకూ ఆర్డర్ బుక్ ఉంటుందని తెలుస్తోంది. వీళ్లకు పవర్, స్టీల్ ఐటీ వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి.

English summary

ఏపీలో భారీ ప్రాజెక్ట్ కొన్న అదానీ! జగన్ నుంచి ఆ పారిశ్రామికవేత్తను కాపాడేందుకేనా? | Adani to buy 70% stake in Krishnapatnam Port for over ₹5,500 crore

Adani group is acquiring majority stake in CVR founded Krishnapatnam port company limited. As Polavaram project facing struggles in Andhra Pradesh, CVR Chairman Visweswar Rao sold majority stake in his port business to Adani. Both of the companies stuck deal silently. According to sources deal may be valued at Rs.5500 crores.
Story first published: Monday, August 19, 2019, 18:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X