For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జమ్ము కాశ్మీర్‌లో ఆస్తులు కొనాలనుకుంటే ఇది చదవండి?

|

అధికరణ 370 రద్దుతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ రద్దుతో కాశ్మీర్‌లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ప్రధాని మోడీ చెప్పారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. జమ్ము కాశ్మీర్ అభివృద్ధిలో మరింత దూసుకెళ్తుందని భావిస్తున్నారు. భూములపై నిషేధాలను ఎత్తివేసినంత మాత్రాన ప్రైవేటు పెట్టుబడులు రావని, శాంతిభద్రతల విషయంలో పూర్తి విశ్వాసం కలిగితే వస్తాయని, అవి వచ్చేలోపు ప్రభుత్వ మౌలిక సదుపాయాల రంగంలో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని, అలాగే, పర్యాటక రంగంపై దృష్టి సారించాలంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే, 370 రద్దు నేపథ్యంలో జమ్ము కాశ్మీర్‌లో భూములు ఎవరైనా కొనవచ్చుననే ప్రచారం సాగుతోంది. అలా కొనవచ్చునా తెలుసుకుందాం...

జమ్ము కాశ్మీర్‌లో ఆస్తులు కొనాలంటే...

జమ్ము కాశ్మీర్‌లో ఆస్తులు కొనాలంటే...

గతంలో జమ్ము కాశ్మీర్‌లో ఎవరైనా భూమిని కొనాలని భావించినప్పటికీ ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హక్కుల కారణంగా కొనుగోలు చేయలేకపోయారు. ఇప్పుడు 370 రద్దు నేపథ్యంలో భూమిని కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు. అక్కడ రియాల్టీ పెరుగుతుందని చెబుతున్నారు. మరి జమ్ము కాశ్మీర్, లడక్‌లో ఈ మార్కెట్ బాహాటంగా తెరుచుకుంటుందా? ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుకు ముందు అక్కడి శాశ్వత నివాసితులకు మాత్రమే కొనుగోలు చేసేందుకు అర్హత ఉంది. ఇప్పుడు జమ్ము, కాశ్మీర్, లడక్‌లుగా విభజించి ఆర్టికల్స్ రద్దు చేసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారు ఆస్తులు కొనుగోలు చేసే పరిస్థితులు వచ్చాయి. అయితే మీరు జమ్ము కాశ్మీర్‌లో భూములు కొనుగోలు చేయాలంటే ఇవి తెలుసుకోండి..

సొంత రెరా విధానాలు ఏర్పాటు చేసుకోవాలి

సొంత రెరా విధానాలు ఏర్పాటు చేసుకోవాలి

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు లేదా ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల వలె జమ్ము కాశ్మీర్‌ను పరిగణిస్తారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని ప్రామాణిక నియమాలు, నిబంధనలు కూడా ఇక్కడా వర్తిస్తాయి. అయితే విధానాల కోసం రాష్ట్ర రెరా పాలసీ ఏర్పడాలి. అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ.. ఈ ప్రాంతం తన సొంత రెరా విధానాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. ఇది వారి సొంత చట్టాలను కలిగి ఉన్న ఇతర హిల్ రాష్ట్రాలతో సమానంగా ఉండకపోవచ్చునని చెప్పారు.

ఇన్వెస్టర్లు వెయిట్ చేయాలి

ఇన్వెస్టర్లు వెయిట్ చేయాలి

ఇది ప్రారంభమేనని, ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అంశంపై రెగ్యులేటరీ బాడీ గవర్నింగ్ ఏర్పాటయ్యే వరకు ఇన్వెస్టర్లు వెయిట్ చేయాల్సి ఉటుందని అనుజ్ పూరీ అన్నారు. ఒకవేళ ఇప్పుడే కచ్చితంగా కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ఈ లావాదేవీలపై లీగల్ ఎక్స్‌పర్ట్స్ సూచనల మేరకు ముందుకు వెళ్లడం మంచిదని చెప్పారు.

తొందరపాటు వద్దు..

తొందరపాటు వద్దు..

టైర్ 2, టైర్ 3 పట్టణాలు రియాల్టీ రంగానికి ఆకర్షణీయంగా మారుతున్నాయని, జమ్ము కాశ్మీర్‌లోను అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు ఇంకా రూపొందబడాల్సి ఉందని చెబుతున్నారు. జమ్ము కాశ్మీర్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే సరైన సమయమా అంటే కాదు అంటున్నారు. నిబంధనలపై స్పష్టత లేదని, రెరా విధానాలు కూడా లేవని చెబుతున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ఇంకా సందేహాస్పదంగానే ఉన్నందున, ఇన్వెస్టర్లు తొందరపడకుంటే మంచిదని చెబుతున్నారు.

వ్యాల్యుయేషన్ అర్థం చేసుకోవడం కష్టం..

వ్యాల్యుయేషన్ అర్థం చేసుకోవడం కష్టం..

జమ్ము కాశ్మీర్‌లో సమీప భవిష్యత్తులో అభివృద్ధి కనిపిస్తోందని, కానీ ఇక్కడ మార్కెట్ కొత్త కాబట్టి ఏమిటనేది ఇప్పుడే చెప్పలేమని నైట్ ఫ్రాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ హాస్పిటాలిటీ) గులాం జియా అన్నారు. ఇలా కొత్త మార్కెట్ ఎవరికైనా కన్ఫ్యూజన్‌గా ఉంటుందని, ఇన్వెస్టర్లకు ఇక్కడ ఆస్తుల వ్యాల్యుయేషన్ అప్పుడే అర్థం చేసుకోవడం కష్టతరమవుతుందని చెబుతున్నారు.

ఆస్తులు కొనలేం...

ఆస్తులు కొనలేం...

మరోవైపు, జమ్మూ కాశ్మీరులో ఆస్తులు కొనుగోలు చేయవచ్చునని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. జమ్ము కాశ్మీరులో రియల్‌ ఎస్టేట్‌ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే ఆసక్తి అందరిలోను ఉంది. నిజానికి జమ్మూ కాశ్మీరులో భూముల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవట. అసలక్కడ వ్యవసాయ, నివాసయోగ్య భూమి చాలా తక్కువ. కొండ ప్రాంతాలు ఎక్కువ. మధ్యలో అక్కడక్కడా ఉన్న కొద్ది మైదాన భూములకు నీటి కొరత లేదు. శీతాకాలం మూడు నెలలు మినహాయిస్తే ఏడాది మొత్తం నదులు పారుతాయి. వ్యవసాయ భూముల ఖరీదు ఎక్కువ. కుంకుమ పండే భూములు సామాన్యులు కొనలేరు. వ్యవసాయ భూముల్ని రియల్ ఎస్టేట్‌గా మార్చడం ఖరీదైన వ్యవహారం.

English summary

All you need to know about buying property in Jammu & Kashmir

Many who wanted to buy a house in Jammu & Kashmir but were unable to because of the erstwhile state's special status, are now assuming they can finally take the plunge as the realty market there is now open for non-residents.
Story first published: Saturday, August 17, 2019, 12:35 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more