For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియాలో ఇన్ఫోసిస్ సరికొత్త రికార్డ్, కానీ షాక్ తప్పదా

|

బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు 85 శాతం రెవెన్యూ అమెరికా, యూరోప్ మార్కెట్ నుంచి వస్తోంది. ఇప్పుడు అత్యధిక రెవెన్యూ వచ్చే జాబితాలో ఆస్ట్రేలియా కూడా చేరింది. ఇన్ఫోసిస్ ఆస్ట్రేలియా రెవెన్యూ 1 బిలియన్ డాలర్లు దాటింది. తద్వారా సాఫ్టువేర్ సర్వీసెస్ కంపెనీల్లో మూడో అతిపెద్ద ఎక్స్‌పోర్ట్‌రగా అవతరించింది. ఆస్ట్రేలియాలో బిలియన్ డాలర్లకు పైగా వ్యాపారం సాగిందని, ఇది తమకు అతి పెద్ద మార్కెట్ అని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ ఎకనమిక్ టైమ్స్‌తో చెప్పారు.

<strong>మీరు హౌస్‌పైఫ్ లేదా టీచరా?: ఇలా రూ.15,000 దాకా సంపాదించవచ్చు</strong>మీరు హౌస్‌పైఫ్ లేదా టీచరా?: ఇలా రూ.15,000 దాకా సంపాదించవచ్చు

 అమెరికా, యూరోపియన్ మార్కెట్ నుండి అధిక రెవెన్యూ

అమెరికా, యూరోపియన్ మార్కెట్ నుండి అధిక రెవెన్యూ

ప్రస్తుతం ఇన్ఫోసిస్ రెవెన్యూలో అమెరికా నుంచి 61.65 శాతం వస్తోంది. 11.8 బిలియన్ డాలర్ల రెవెన్యూ ఈ అగ్రదేశం నుంచి వస్తుండగా, యూరోపియన్ మార్కెట్ వాటా 23.6 శాతంగా ఉంది. ఈ ఐటీ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రభుత్వ ఏజెన్సీల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ పైన దృష్టి సారించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు కూడా ఈ కంపెనీ కీలక వ్యాపార విభాగాలు.

ఇలాంటి వృద్ధి ఎక్కువ కాలం కొనసాగించలేరా?

ఇలాంటి వృద్ధి ఎక్కువ కాలం కొనసాగించలేరా?

ఆస్ట్రేలియాలో 1,200 ఉద్యోగాలు సృష్టిస్తామని గత ఏడాది ప్రకటించిన ఇన్ఫోసిస్, ఆస్ట్రేలియా ఓపెన్ డిజిటల్ ఇన్నోవేషన్ కోసం టెన్నిస్ ఆస్ట్రేలియాతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా చిన్న మార్కెట్ అని, ఐటీ సేవలు వృద్ధి ఓ దశకు చేరాక స్థిరంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర ఐటీ కంపెనీల్లాగే మార్కెట్ పరిమాణం, వేగవంతమైన వృద్ధి ఇలాగే ఎక్కువ కాలం కొనసాగడం అసాధ్యం కావొచ్చునని ఐటీ అడ్వైజర్ ఫర్మ్ ఎవరెస్ట్ గ్రూప్‌కు చెందిన పీటర్ బెండోర్ సామ్యూల్ అన్నారు. మార్కెట్ చాలాకాలంగా ఔట్ సోర్సింగ్, థర్డ్ పార్టీ ఐటీ సేవల వినియోగానికి ఓపెన్ చేసి ఉందని, కంపెనీలు ఓ బిలియన్ డాలర్స్ వరకు వేగంగా ఎదుగుతాయని, ఆ తర్వాత వృద్ధి ఆగిపోతుందని పీటర్ బెండోర్ అన్నారు.

5G లివింగ్ ల్యాబ్

5G లివింగ్ ల్యాబ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలటిక్స్ వంటి డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో ఇన్ఫోసిస్ ఇన్నోవేటివ్‌గా ముందుకు సాగుతోంది. బిజినెస్ ప్రయోగాల్లో సహాయం నిమిత్తం ఐదవ తరం టెలికం నెట్ వర్క్స్ 5G లివింగ్ ల్యాబ్‌ను బెంగళూరు తర్వాత మెల్‌బోర్న్‌లోనే ఓపెన్ చేసింది ఇన్ఫోసిస్. ఆస్ట్రేలియాలో 1 బిలియన్ డాలర్ల రెవెన్యూ వరకు వేగంగా ఎదిగిన ఈ ఐటీ దిగ్గజం వృద్ధి మందగించవచ్చునని పీటర్ బెండోర్ అన్నారు. అలాగే, విస్తృత భారతీయ ఐటీ పరిశ్రమకు ఇది విజయవంతమైన వేదికగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary

ఆస్ట్రేలియాలో ఇన్ఫోసిస్ సరికొత్త రికార్డ్, కానీ షాక్ తప్పదా | Infosys Australia revenue crosses $1 billion milestone

Infosys focuses on digital transformation at government agencies in the Asia Pacific region, while banking and financial services is another important business segment.
Story first published: Wednesday, August 14, 2019, 11:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X