For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా కంపెనీతో కాఫీడే డీల్!: రూ.3,000కు గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ అమ్మకం

|

బెంగళూరు: కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న దాదాపు 15రోజుల తర్వాత కంపెనీకి చెందిన ఆస్తులను విక్రయించాలని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (CDEL) నిర్ణయించింది. కాఫీ డే అనుబంధ సంస్థ టాంగ్‌లింగ్ డెవలప్‌మెంట్స్ లిమిటెడ్‌కు చెందిన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను అమెరికా బైఔట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు రూ.2,600 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల మధ్య విక్రయించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

CDELకు రుణ భారం

CDELకు రుణ భారం

ఈ మేరకు ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. CDELకు రుణ భారం ఉంది. దీనిని తగ్గించుకునేందుకు బెంగళూరు సమీపంలోని 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్లోబల్ విలేజ్ టెక్ పార్కును విక్రయించాలని భావిస్తోంది. ఈ పార్క్‌ను కొనుగోలు చేసేందుకు బ్లాక్‌స్టోన్ గ్రూప్ ఆసక్తి కనబరుస్తోందట. ఈ మేరకు టాంగ్‌లింగ్ డెవలప్‌మెంట్స్‌తో బ్లాక్‌స్టోన్ గత వారం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి. రానున్న కొద్ది రోజుల్లో ఈ డీల్ పూర్తి కావొచ్చునని అంటున్నారు.

రూ.28 కోట్ల మేర ఆదాయం

రూ.28 కోట్ల మేర ఆదాయం

అదే సమయంలో అల్పా గ్రెప్ సెక్యూరిటీస్ ప్రైవేటు లిమిటెడ్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కూడా CDEL సిద్ధమైందట. దీని ద్వారా రూ.28 కోట్ల మేర ఆదాయం రానుందని తెలుస్తోంది. గ్లోబల్ విలేజ్ టెక్ పార్కు, అల్పా గ్రెప్ సెక్యూరిటీస్ ప్రైవేటు లిమిటెడ్.. ఈ 2 కంపెనీల అమ్మకం కేఫ్ కాఫీ డే గ్రూప్ నిర్వహణకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. పెట్టుబడిదారులు, రుణదాతలు, ఉద్యోగులు, కస్టమర్లతో సహా అందరి ప్రయోజనాలను పరిరక్షించేలా ముందుకు సాగాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.

రూ.7,653 కోట్ల రుణాలు

రూ.7,653 కోట్ల రుణాలు

రుణ భారం తగ్గించుకునేందుకు CDEL సిద్ధార్థ స్థాపించిన సెలెక్టివ్ కంపెనీలను విక్రయించేందుకు సిద్ధమవుతోందని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి అనుబంధ సంస్థలైన కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ (కాఫీ బిజినెస్), సికాల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఇంటెగ్రేటెడ్ లాజిస్టిక్స్), టాంగ్‌లిన్ డెవలప్‌మెంట్స్ లిమిటెడ్ (రియాల్టీ), వే2వెల్త్ (ఫైనాన్షియల్ సర్వీసెస్), కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ (హాస్పిటాలిటీ) రుణాలు దాదాపు రూ.7,653 కోట్లుగా ఉన్నాయి.

రూ.11,259 కోట్ల ఆస్తులు

రూ.11,259 కోట్ల ఆస్తులు

బ్యాంకులు, ఎన్సీడీల నుంచి CDEL అనుబంధ సంస్థలు తీసుకున్న ఏకీకృత రుణాలు మార్చి 31వ తేదీ నాటికి రూ.6,547.38 కోట్లుగా ఉంది. వీటిలో షార్ట్ టర్మ్ డెబిట్స్ రూ.1,106 కోట్లు. స్టాండలోన్ బేసిస్ ప్రకారం మార్చి 31వ తేదీ నాటికి CDEL రుణాల రూ.350 కోట్లు కాగా, ఒక్క కాఫీ డే గ్లోబల్ రుణ బాధ్యతలే రూ.879.67కోట్లు. CDEL మొత్తం ఆస్తుల విలువ రూ.11,259 కోట్లు.

Read more about: coffee day కాఫీ డే
English summary

అమెరికా కంపెనీతో కాఫీడే డీల్!: రూ.3,000కు గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ అమ్మకం | Coffee Day to sell Global Village Tech Park to Blackstone for up to Rs.3,000 crore

Coffee Day to sell Global Village Tech Park to Blackstone for up to Rs.3,000 crore
Story first published: Wednesday, August 14, 2019, 18:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X