For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ 3 కలిసినా దిగదుడిపే: ప్రపంచంలో అత్యంత లాభదాయక సంస్థతో అంబానీ జట్టు

|

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కోతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. దేశంలో ఓ కంపెనీకి రానున్న అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇదే. ఈ నేపథ్యంలో ఆరామ్‌కో అంశం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ సౌదీ ఆరామ్‌కో మాత్రం తన నికర ఆదాయంతో డివిడెండ్‌ను చెల్లిస్తోంది. ఆరామ్‌కోలో 5%వాటాల్ని విక్రయించడం ద్వారా 100 బిలియన్ డాలర్లను సమీకరించాలని సౌదీ ఆరేబియా భావిస్తోంది.

<strong>టీవీ ఉచితం, ఈ ట్యాక్స్ అదనం: జియో గిగాఫైబర్ గురించి పూర్తిగా తెలుసుకోండి</strong>టీవీ ఉచితం, ఈ ట్యాక్స్ అదనం: జియో గిగాఫైబర్ గురించి పూర్తిగా తెలుసుకోండి

తొలి ఆరు నెలల్లో 46.9 బిలియన్ డాలర్లు

తొలి ఆరు నెలల్లో 46.9 బిలియన్ డాలర్లు

చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయక సంస్థ ఆరామ్‌కో. 2019 మొదటి ఆరు నెలల్లో లాభాల్లో 12 శాతం క్షీణించి 46.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అతిపెద్ద కార్పోరేట్ కంపెనీలైన యాపిల్ ఇంక్, అమెజాన్.కామ్ ఇంక్‌తో పాటు ఇతర అతిపెద్ద ఆయిల్ కంపెనీలు దీని కంటే వెనుకబడి ఉన్నాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం, లాభాలు తగ్గడం వల్ల లాభాలు క్షీణించాయి.

ఆర్థిక ఫలితాలు బాగున్నాయి..

ఆర్థిక ఫలితాలు బాగున్నాయి..

తమ కంపెనీకి భూమిపైనే అతిపెద్ద, అత్యంత ఉత్పాదక రిజర్వాయర్లు ఉన్నాయని ఈ కంపెనీకి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్, స్ట్రాటెజీ డెవలప్‌మెంట్) ఖలీద్ అల్ దబ్బగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చమురు ధరలు తగ్గినప్పటికీ ఆర్థిక ఫలితాలు బాగున్నాయని, ఇది తమ కంపెనీ నిలకడకు నిదర్శనమని చెబుతున్నారు.

పబ్లిక్ ఆఫర్‌కు ముందు ఇలా...

పబ్లిక్ ఆఫర్‌కు ముందు ఇలా...

ఆరామ్‌కో మొదటి అర్ధ సంవత్సరంలో 46.4 బిలియన్ల డివిడెండ్లు చెల్లించింది. ఇందులో కంపెనీ ఓనర్ అయిన సౌదీ ప్రభుత్వానికి 20 బిలియన్ డాలర్ల ప్రత్యేక పేఅవుట్ ఉంది. గత ఏడాదితో పోలిస్తే 6 బిలియన్లు ఎక్కువ. 2020 లేదా 2021 పబ్లిక్ ఆఫర్ ప్లాన్‌కు ముందు పెట్టుబడిదారులకు ఇది ఆసక్తిని కలిగిస్తోంది.

రికార్డ్ ఐపీవో కావొచ్చు...

రికార్డ్ ఐపీవో కావొచ్చు...

అధికారికంగా సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీగా పిలువబడే ఆరామ్‌కో గత ఏప్రిల్ నెలలో తొలిసారి పన్నెండు నెలల ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్‌ను వెల్లడించింది. ఇది రికార్డ్ ఐపీవోగా ఉండవచ్చు. డమ్మన్ బేస్డ్ కంపెనీ ఇన్వెస్టింగ్ స్క్రూటినీలో ముందుంది. ఇతర చమురు మేజర్ కంపెనీలను కూడా ఆహ్వానిస్తోంది.

బిగ్గెస్ట్ ఆయిల్ ఎక్స్‌పోర్టర్

బిగ్గెస్ట్ ఆయిల్ ఎక్స్‌పోర్టర్

ఆరామ్‌కో క్రూడాయిల్ సరాసరి ధర బ్యారెల్‌కు 66 డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇది 69 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రూడాయిల్ ప్రొడక్షన్ రోజుకు 10 మిలియన్ బ్యారెల్స్ వద్ద స్థిరంగా ఉంది. ఇతర ఆయిల్ కంపెనీల వలె కాకుండా ఇది ప్రభుత్వరంగ కంపెనీ. అతిపెద్ద ఆయిల్ ఎక్స్‌పోర్టర్. దీని ట్యాక్స్‌లు, రాయాల్టీలు సౌదీ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నాయి.

100 బిలియన్ డాలర్ల సమీకరణ

100 బిలియన్ డాలర్ల సమీకరణ

ఆరామ్‌కోలో 5 శాతం వాటాలను విక్రయించడం ద్వారా 100 బిలియన్ డాలర్లు సమీకరించాలని సౌదీ అరేబియా యోచిస్తోంది. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోగా ఉండే అవకాశముంది. ఈ కంపెనీ వ్యాల్యూ 2 ట్రిలియన్ డాలర్లుగా చెబుతోంది. 2018 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఈ కంపెనీ వ్యాల్యూ 1.2 ట్రిలియన్ డాలర్లకు సమీపంలో ఉంది. ఆపిల్, ఎక్సాన్ మొబిల్, రాయల్ డచ్ షెల్ వంటి దిగ్గజ కంపెనీల మొత్తం లాభాలను ఆరామ్‌కో అధిగమించింది.

మూడేళ్ల క్రితం ఐపీవో ప్రకటన

మూడేళ్ల క్రితం ఐపీవో ప్రకటన

ఆరామ్‌కో ఐపీవోను సౌదీ అరేబియా మూడేళ్ల క్రితం ప్రకటించింది. కెమికల్ దిగ్గజం సౌదీ బేసిక్ ఇండస్ట్రీస్ కంపెనీని కూడా సొంతం చేసుకునే అంశం నేపథ్యంలో ఇది ఆలస్యమవుతోంది. 70 శాతం వాటా కోసం బాండ్స్ విక్రయిస్తుంది. అదే ఆరామ్‌కో ఇప్పుడు భారత్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో వాటాలు కొనుగోలు చేయనుంది. రిలయన్స్‌లో 20 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.

English summary

ఆ 3 కలిసినా దిగదుడిపే: ప్రపంచంలో అత్యంత లాభదాయక సంస్థతో అంబానీ జట్టు | Saudi Aramco remains world’s most profitable company

Saudi Aramco showed Monday it’s still the world’s most profitable company and paid out almost all its net income in dividends despite the dwindling price of oil.
Story first published: Tuesday, August 13, 2019, 18:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X