For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC సీఈవో జీతం నెలకు రూ.89 లక్షలు, ఎవరి వేతనం ఎంత?

|

న్యూఢిల్లీ: భారత్‌లోని బ్యాంకర్లలో అత్యధిక వేతనం అందుకుంటున్న వారిలో HDFC బ్యాంకు సీఈవో ఆదిత్య పూరి ముందున్నారు. యాక్సిస్ బ్యాంకు సీఈవో చౌదరీ రెండో స్థానంలో, కొటక్ మహీంద్రా బ్యాంకు ఉదయ్ కొటక్ మూడో స్థానంలో ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు మాచీ చీఫ్ చందాకొచ్చార్ నాలుగో స్థానంలో ఉండేవారు.

<strong>అత్యధిక శాలరీ హైదరాబాదీదే.. రూ.59 కోట్లు! సన్ ఫార్మా ఎండీ వేతనం ఒక్కరూపాయే</strong>అత్యధిక శాలరీ హైదరాబాదీదే.. రూ.59 కోట్లు! సన్ ఫార్మా ఎండీ వేతనం ఒక్కరూపాయే

ఆదిత్య పూరి వేతనం రూ.89 లక్షలు

ఆదిత్య పూరి వేతనం రూ.89 లక్షలు

2019 ఆర్థిక సంవత్సరంలో HDFC బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి నెలకు రూ.89 లక్షల వేతనం తీసుకుంటున్నారు. అన్ని బ్యాంకుల సీఈవోల్లోకెల్లా ఇది అత్యధికం. గత 25 ఏళ్లుగా ఆదిత్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాప్ ప్రయివేటు బ్యాంకులకు చెందిన నివేదికల ప్రకారం సీఈవోల వేతన స్ట్రక్చర్ ఫిక్స్‌డ్ పే కంపోనెంట్, వేరియబుల్ పే కంపోనెంట్, స్టాక్స్ ఆఫ్షన్స్‌తో ఉంటాయి. షేర్ హోల్డర్స్ వ్యాల్యూ, పనితీరు మెరుగుపై వేతనాలు ఆధారపడి ఉంటాయి.

యాక్సిస్ బ్యాంకు అమితాబ్ చౌదరి

యాక్సిస్ బ్యాంకు అమితాబ్ చౌదరి

బ్యాంకు సీఈవోల వేతనాల అంశంలో యాక్సిస్ బ్యాంకు సీఈవో అమితాబ్ చౌదరి రూ.30 లక్షలతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బ్యాంకు సీఈవో బాధ్యతలు చేపట్టారు. యాక్సిస్ బ్యాంకు మాజీ సీఈవో శిఖా శర్మ నెలకు రూ.24 లక్షలు అందుకున్నారు. అసెట్స్ విషయంలో ప్రయివేటు సెక్టార్ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంకు రెండో స్థానంలో ఉంది.

మూడో స్థానంలో ఉదయ్, నాలుగో స్థానంలో చందాకొచ్చార్

మూడో స్థానంలో ఉదయ్, నాలుగో స్థానంలో చందాకొచ్చార్

ఇండియా రిచ్చెస్ట్ బ్యాంకర్ కొటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో ఉదయ్ కొటక్ రూ.27 లక్షల వేతనంతో మూడో స్థానంలో ఉన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చార్ రాజీనామా చేయడానికి ముందు నెలకు రూ.26 లక్షలు అందుకున్నారు. ఆమె నాలుగో స్థానంలో ఉన్నారు. చందా కొచ్చార్ స్థానంలో వచ్చిన సందీప్ భక్షి రూ.22 లక్షలు తీసుకుంటున్నారు. ఈయన అయిదో స్థానంలో ఉన్నారు. ఈయన గత ఏడాది అక్టోబర్‌లో ఐసీఐసీఐ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.

యస్ బ్యాంకు..

యస్ బ్యాంకు..

ఇండస్ బ్యాంక్ చీఫ్ రోమేష్ సోబ్ది యావరేజ్‌గా నెలకు రూ.16 లక్షల వేతనం అందుకుంటూ ఆరో స్థానంలో నిలిచారు. యస్ బ్యాంకు సీఈవో రణ్‌వీత్ గిల్, మాజీ సీఈవో రానా కపూర్ బేసిక్ శాలరీస్ కూడా ఎక్కువే ఉన్నాయి. అన్నీ కలికి ఏకీకృత సంఖ్యను ఇస్తున్నందువల్ల వేతనం కాలిక్యులేట్ చేయలేని స్థితి. మార్చిలో గిల్ రూ.59 లక్షలు అందుకుంటే, రానా కపూర్ జనవరి చివరి వరకు అంతకుముందు పది నెలల కాలానికి రూ.6.48 కోట్లు తీసుకున్నారు.

English summary

HDFC సీఈవో జీతం నెలకు రూ.89 లక్షలు, ఎవరి వేతనం ఎంత? | HDFC Bank CEO Aditya Puri highest paid banker in the country

HDFC Bank managing director Aditya Puri remained the highest paid bank chief executive in India with a monthly basic salary of Rs 89 lakh in FY19.
Story first published: Tuesday, August 13, 2019, 12:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X