ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ (RIL) గత ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించి రికార్డ్ సృష్టించిందని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ సోమవారం (ఆగస్ట్ 12) చెప్పారు. రిలయన్స్ రిటైల్ లక్షా 30వేల కోట్ల బిజినెస్ చేసిందని, భారత ఆర్థిక వ్యవస్థలో రిలయన్స్ భాగస్వామ్యం అన్నారు. 42వ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM)సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం, సౌదీ ఆరామ్‌కో కంపెనీ పెట్టుబడుల వివరాలను వెల్లడించారు.

62,320 కోట్ల జీఎస్టీ
దేశంలో అత్యధిక పన్నులు చెల్లించింది తమ కంపెనీయే అని ముఖేష్ అంబానీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 67,320 కోట్ల జీఎస్టీ కట్టినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డిజిటల్ ప్లాట్ ఫాంగా రిలయన్స్ జియో ఎదిగిందన్నారు. ఇప్పటికే జియో కస్టమర్ల సంఖ్య 340 మిలియన్లు దాటిందన్నారు. 2030 నాటికి భారత్ 10 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు.

20 శాతం వాటాల కోసం ఆరామ్‌కో పెట్టుబడి
సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కోతో ఒప్పందం అనంతరం రిలయన్స్ రిఫైనరీకి ఆ కంపెనీ రోజుకు 5,00,000 బ్యారెల్స్ క్రూడాయిల్ సరఫరా చేస్తుందని తెలిపారు. తమ కంపెనీలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదిరిందన్నారు. రిలయన్స్ ఆయిల్ టు డివిజన్‌లో సౌదీ ఆరామ్‌కో ఇరవై శాతం వాటాల కోసం పెట్టుబడులు పెడుతుందన్నారు. విదేశీ ప్రత్యక్, పెట్టుబడుల్లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యమని తెలిపారు.

18 నెలల్లో రుణరహిత కంపెనీగా...
రానున్న 18 నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత కంపెనీగా చేసేందుకు రోడ్ మ్యాప్ తయారు చేశామని ముఖేష్ అంబానీ వెల్లడించారు. సౌదీ ఆరామ్‌కో, BPలతో ఒప్పందాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాల వల్ల రూ.1.15 లక్షల కోట్లు కంపెనీలోకు వస్తాయన్నారు. రిలయన్స్ తన ఫ్యూయల్ రిటైల్ వ్యాపారంలోని 49 శాతం వాటాలను BPకి విక్రయించడం ద్వారా రూ.7,000 కోట్లు సేకరిస్తుందన్నారు. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం ద్వారా డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి స్టార్టప్స్‌కు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు ఉచితంగా అందిస్తామన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications