For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక ఆవులకూ ఆధార్ నెంబర్ ! జోక్ కాదు నిజమే

|

దేశ పౌరులకు ఉన్నట్టు త్వరలో ఆవులు, గేదెలకు కూడా ఆధార్ నెంబర్ రాబోతోంది. పశు ఆధార్ పేరుతో నూతనంగా పన్నెండు అంకెలు గల సంఖ్యను ఇచ్చేందుకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ (INAPH) సిద్ధమవుతోంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ త్వరలో రూపుదిద్దుకుంటోంది.

ఈ వినూత్న ఐడెంటిఫికేషన్ వల్ల దేశంలో ఎన్ని ఆవులు, గేదెలు ఉన్నాయి అనే సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోవడంతో పాటు వాటి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్‌కు సులువవుతుందని అధికారులు చెబ్తున్నారు.

<strong>గుడ్‌న్యూస్: సులభ ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఈ-ఫైలింగ్ లైట్</strong>గుడ్‌న్యూస్: సులభ ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఈ-ఫైలింగ్ లైట్

ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్

ఆధార్ కార్డ్ మాదిరే ప్రతీ జంతువుకూ ఓ ప్రత్యేక సంఖ్య ఇవ్వబోతున్నారు. వాటితో పాటు సదరు జంతువుకు సంబంధించిన ఇతర వివరాలను కూడా అందులో నిక్షిప్తం చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంబంధ డేటా బేస్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ చెబ్తోంది.

మొదటి దశలో పాలు ఇస్తున్న 9.4 కోట్ల ఆవులు, గేదెల సమచారాన్ని తీసుకోబోతున్నారు. ఆ తర్వాత ఎద్దులు, బర్రెలు, ఇతర జంతువుల వివరాలను కూడా తీసుకుంటామని .. అన్నింటితోనే ఓ డేటా వ్యవస్థను రూపొందిస్తామని నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థ విశ్లేషిస్తోంది.

Soon, unique ID to cows and buffaloes in India

ఏం చేయబోతున్నారు

డేటా సేకరణలో భాగంగా ప్రతీ జంతువు చెవికీ ఓ ట్యాగ్‌ను అతికించబోతున్నారు. ఇందులో పన్నెండు అంకెల యునిక్ ఐడీతో ఉండబోతోంది. వీటితో పాటు ఇందులో ఇది ఏ జాతికి చెందింది, బ్రీడ్, పెడిగ్రీ, ఎన్ని సార్లు కాన్పు అయింది, ఎన్ని పాలు ఇస్తోంది, ఏమేం టీకాలు వేశారు వంటి వివరాలన్నింటినీ నిక్షిప్తం చేయబోతున్నారు.

ఏంటి ఉపయోగం

ఈ పశు ఆధార్ వల్ల పశువుల సమాచారామంతా ఒక్క చోట ఉంటుంది. అప్పుడు గణన సులువుగా ఉంటుంది. పాల ఉత్పత్తి, మాంసం వంటి వివరాలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలుస్తాయి. వ్యాధుల బారిన పడిన వాటి వివరాలు, వాటికి అందించిన చికిత్స కూడా తెలుస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యా లేని జంతువు నుంచి పాలు, మాంసం అందుతోందో లేదా అనేది కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. దీని వల్ల ప్రపంచ మార్కెట్‌కు మన ఎగుమతులను సులువుగా పంపుకునే వీలు కలుగుతుంది అని డైరీ బోర్డ్ చెబ్తోంది.

సర్వే మొదలైందా

ఇప్పటి వరకూ దేశంలో 2.23 కోట్ల ఆవులు, గెదేలకు యునిక్ ఐడీలు ఇచ్చారు.వాటి సమాచారం INAPH దగ్గర అందుబాటులో ఉంది. ఇప్పుడు వాటిని క్రోడీకరించే పనిలో ఉంది అధికారుల బృందం.

Read more about: india aadhaar ఇండియా
English summary

ఇక ఆవులకూ ఆధార్ నెంబర్ ! జోక్ కాదు నిజమే | Soon, unique ID to cows and buffaloes in India

National dairy development board is allocating unique ID to cows and buffaloes in India with the help of INAPH. It will help in better live stock management.
Story first published: Sunday, August 11, 2019, 12:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X