For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 నెలల కనిష్టానికి చేరిన పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి

|

న్యూఢిల్లీ : పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లో కేవలం 2 శాతం మాత్రమే వృద్ధి సాధించిందనే అంశం కలరవానికి గురిచేస్తోంది. ఇది నాలుగునెలల కనిష్టానికి చేరుకుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీంతో తయారీ, మైనింగ్ రంగాల వృద్ధి నిపుణులను భయాందోళనకు గురిచేస్తోంది.

పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు జూన్‌లో 2 శాతం నమోదైంది. గతేడాదితో పోల్చిన ఇది తక్కువే. గత నాలుగు నెలల్లో ఇంత తక్కువ వృద్ధి నమోదవడం ఇదే తొలిసారని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేవలం 0.2 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. ఇది మార్చిలో 2.7 శాతంగా ఉండగా .. ఏప్రిల్‌లో 4.3గా ఉంది. మేలో 4.6 శాతంతో మెరుగుపడిందని అనిపించింది. కానీ జూన్‌లో మళ్లీ తగ్గి ఊసురుమనిపించింది.

industrial production growth is low

గతేడాది జూన్‌లో తయారీ రంగంలో వృద్ధి 6.9గా ఉంగా .. ఈ ఏడాది అది తగ్గిపోయింది. తయారీ రంగంలో మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 8 మాత్రమే సానుకూల వృద్ధిరేటు నమోదైంది. భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌లను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి 9.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింది. మరోవైపు మైనింగ్ వృద్ధి కూడా 6.5 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి 8.5 శాతం నుంచి 8.2 శాతానికి పడిపోయింది. కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వృద్ధి నమోదు కాలేదు. మైనస్ 5.5 శాతం క్షీణించి .. ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కాస్మొటిక్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, దుస్తుల వృద్ధి 7.8శాతంగా ఉంది. దీంతోపాటు జూన్ త్రైమాసికం కూడా మందకొడిగా సామిగింది. ఎలా చూసిన పారిశ్రామిక వృద్ధి మందగమనంలోనే ఉంది. జూన్‌లో 3.6 వృద్ధి నమోదు కాగా .. గతేడాది 5.1 శాతంగా ఉంది.

Read more about: industrial production growth
English summary

4 నెలల కనిష్టానికి చేరిన పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి | industrial production growth is low

The decline in industrial production growth is of concern. The fact that only 2 per cent growth in June is disturbing. Economists say it has reached a four-month low. This threatens the growth of manufacturing and mining sectors.
Story first published: Saturday, August 10, 2019, 18:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X