For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రివర్స్ మార్టుగేజ్ రుణం.. ఆర్ధిక అవసరాలకు అండ

|

వయసు పెరిగే కొద్దీ శ్రమ శక్తి తగ్గుతుంది. కానీ ఆర్ధిక అవసరాలు మాత్రం అలాగే ఉంటాయి. వయసుతో పాటు వ్యాధులు కూడా చుట్టుముడతాయి. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్ధిక పుష్టి, అయినా వారందరూ వెంట ఉంటే వారికీ ఇబ్బంది ఉండదు. కానీ పెంచిన పిల్లలు ఎక్కడో స్థిరపడి ఎవరూ తోడులేకుండా ఏకాకంగా జీవించే వారి పరిస్థితి మాత్రం కష్టంగా ఉంటుంది. ఉద్యోగం చేసివున్న వారికీ ముదిమి వయసులో పెన్షన్ అందుతుంది.

అది వారి అవసరాలకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాటికోసం మందులు వాడాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రుల అవసరాలకు తగిన స్థాయిలో డబ్బులు ఇస్తుంటారు. మరికొందరు ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు. లేదా తల్లిదండ్రులే తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. కొంతమంది తమ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళతారు. ఇంకొంత మందికి అది నచ్చదు. ఇలాంటి సందర్భంలో పెద్దమనుషులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆర్థికంగా మాత్రం ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారు తాము జీవించి ఉన్నంతకాలం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉపయోగపడేది రివర్స్ మార్ట్ గేజ్ రుణం.

<strong>గుడ్‌న్యూస్: సులభ ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఈ-ఫైలింగ్ లైట్</strong>గుడ్‌న్యూస్: సులభ ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఈ-ఫైలింగ్ లైట్

ఇది ఎలా?

ఇది ఎలా?

* సీనియర్ సిటిజన్లు తమకు క్రమంతప్పకుండా ఆదాయం కావాలనుకుంటే తాము నివసించే ఇల్లును బ్యాంకులకు రివర్స్ మార్ట్ గేజ్ చేయవచ్చు.

* ఇందులో తమ యాజమాన్య హక్కును కోల్పోవాల్సిన అవసరం ఉండదు.

* అయితే ఇందులో భాగంగా యజమాని తన యాజమాన్య హక్కులను రుణం ఇచ్చే ఆర్థిక సంస్థకు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది.

* ఇల్లుకు ప్రస్తుతం ఉండే ధర, దాని పరిస్థితిని బట్టి ఆర్ధిక సంస్థలు రుణాన్ని ఇస్తాయి. సాధనంగా ఆ ప్రాపర్టీ ధరలో 60 శాతం వరకు పొందడానికి అవకాశం ఉంటుంది.

* ఈ సొమ్మును ఒక్కసారిగా తీసుకోవచ్చు. లేదా నెలవారీగా లేదా అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు.

చెల్లింపులు..

చెల్లింపులు..

* మీకు నెలవారీగా అవసరం ఉందనుకుంటే అదే విధంగా చెల్లింపులు చేస్తారు.

* గరిష్టంగా పదిహేనేళ్ల వరకు ఇలాంటి సదుపాయాన్ని పొందవచ్చు.

* కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లింపులను నిలిపివేస్తారు.

* ఈ చెల్లింపులపై ఆదాయపన్ను లేదా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ లాంటివి ఉండవు.

* ఇంటిని తనఖా పెట్టి సొమ్మును పొందుతున్నపాటికి ఆ ఇంటిలోనే యజమాని తాను మృతి చెందేవరకు నివాసం ఉండవచ్చు.

* యజమాని జీవించి ఉన్నంత కాలం తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.

* యజమాని మృతి చెందిన సందర్భంలో అతని పిల్లలు బ్యాంకు నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించి ఇంటిని తీసుకోవచ్చు. లేకపోతే బ్యాంకు టేకోవర్ చేస్తుంది.

ఇవి పరిశీలించండి...

ఇవి పరిశీలించండి...

* భారత దేశంలో నివాసితులై ఉన్నవారు రివర్స్ మార్టుగేజ్ రుణం పొందవచ్చు.

* కనీస వయసు 60 ఏళ్ళు ఉండాలి.

* రుణ కాలపరిమితి 10-15 సంవత్సరాలు

* కనీస రుణం రూ. 3 లక్షలు.. గరిష్టంగా ఇంటి విలువను బట్టి రూ. కోటి వరకు ఉండవచ్చు.

* రుణం పై ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.

* ప్రాపర్టీకి సంభందించిన పత్రాలు, వ్యక్తిగత పత్రాలు తదితర ప్రూఫ్ లు అవసరం ఉంటాయి.

* రివర్స్ మార్ట్ గేజ్ చేయాలనుకునే సందర్భంలో ఆర్ధిక సంస్థలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచింది. ఒక్కో సంస్థ అనుసరించే రుణ నిబంధనల్లో, జారీ చేసే రుణ మొత్తంలో మార్పులు చేర్పులు ఉండవచ్చు.

Read more about: news
English summary

రివర్స్ మార్టుగేజ్ రుణం.. ఆర్ధిక అవసరాలకు అండ | Reverse Mortgage, need for financial essentials

A reverse mortgage is a loan for seniors age 62 and older. HECM reverse mortgage loans are insured by the Federal Housing Administration (FHA)1 and allow homeowners to convert their home equity into cash with no monthly mortgage payments.
Story first published: Wednesday, August 7, 2019, 14:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X