కాలిఫోర్నియా: లింక్డిన్‌లో జరిగిన సాంకేతిక పొరపాటు కారణంగా గూగుల్ సీఈవో ఉద్యోగం ఖాళీగా ఉన్నట్లు చూపించింది. దీంతో గూగుల్ సీఈవో పోస్ట్ ఆఫర్ పలువురికి వెళ్లింది. ఓ బగ్ కారణంగా కంపెనీకి తెలియకుండానే ఎవరైనా ఈ జాబ్ పోస్ట్ చేసేలా యూజర్లకు అనుమతి లభించింది. లింక్డిన్‌లోని ఏ బిజినెస్ పేజీలో అయినా జాబ్ పోస్ట్ చేసేలా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సీఈవో ఆఫర్ వెళ్లింది.

గూగుల్ సీఈవో ఉద్యోగం ఖాళీగా ఉందా.. షాకైన నెటిజన్లు
గూగుల్ సీఈవో పోస్ట్ ఖాళీగా ఉందని చూసి లింక్డిన్ యూజర్లు షాకయ్యారు. గూగుల్‌లో ఉద్యోగం కావాలని కోట్లాది మంది కోరుకుంటారు. ఇక సీఈవో పదవి అంటే.. ఇది చూసిన అవాక్కయ్యారు. దీంతో సుందర్ పిచాయ్ స్థానంలో గూగుల్ మరొకరిని తీసుకు వస్తుందా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఇది బగ్ కారణంగా వచ్చిన సమస్య.

టెక్నికల్ సమస్యను సరిచేశారు
ఈ జాబ్ అంశాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన రిక్రూటర్ మైఖేల్ రిజిండర్స్ గుర్తించాడు. కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. చాలామంది గూగుల్ సెర్చింజన్‌లో సీఈవో జాబ్ గురించి వెతికారు. అయితే టెక్నికల్ సమస్య అని తెలియడంతో దానిని సరిచేశారు. ఈ విషయాన్ని లింక్డిన్ ధ్రవీకరించింది. బగ్ వల్ల ఈ సమస్య తలెత్తిందని, దీనిని సరిచేశామని, ఇక నుంచి అలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపింది.

అందుకే.. ఇలా
తమ పోర్టల్లో బగ్ కారణంగా జాబ్ పోస్ట్ చేశాక యూజర్లు కంపెనీని ఎడిట్ చేసే అవకాశం కలిగిందని, ఇలాంటి మోసపూరిత ప్రకటనలు తమ కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధమని లింక్డిన్ ప్రకటించింది. ఓ కంపెనీ తరఫున మరో కంపెనీ జాబ్‌లను పోస్ట్ చేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ, దానికి వేరే పార్టీ వాళ్ల అనుమతి తప్పనిసరి అని, చిన్న, మధ్యస్థ కంపెనీల జాబ్‌లను ఉచితంగా పోస్ట్ చేసేలా ఫ్రీ ట్రయల్స్ చేస్తున్నామని, గూగుల్ సీఈవో పోస్టును చేసిన కంపెనీ అందులో ఒకటి అని పేర్కొంది.

ఛార్జీలు వసూలు చేసే లింక్డిన్
సాధారణంగా ఈ ప్లాట్‌పాంలో ఉద్యోగాల ఓపెనింగ్ కోసం లింక్డిన్ ఛార్జీలు వసూలు చేస్తుంది. దీని కోసం ప్రీమియం అకౌంట్ పొందాలి. గూగుల్ సీఈవో ఉద్యోగం ఖాళీకి సంబంధించిన పోస్టు జూలై 28, 2019న కనిపించింది. ఇది రెగ్యులర్ జాబ్ పోస్టింగ్‌ల వలె ఉంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేశారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications