For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అసోం గోల్డ్ టీ 'బంగారమే', కిలో రూ.50,000

|

గువహతి: పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. మంగళవారం నాడు గుహవతి టీ ఆక్షన్ సెంటర్ (GTAC) ఓ ప్రత్యేకమైన టీ కిలో రూ.50,000 పలికింది. మనోహరి గోల్డ్ టీ ఈఆక్షన్‌లో పెద్ద మొత్తంలో పలికి రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు, ఎక్కడ, ఎప్పూడూ ఏ టీకి రాని అత్యధిక ధర ఈ టీ పలికిందని GTAC సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

పెట్రోల్ బంకులో మీరు ఈ సేవలు ఉచితంగా పొందవచ్చుపెట్రోల్ బంకులో మీరు ఈ సేవలు ఉచితంగా పొందవచ్చు

టీ.. రికార్డ్ ధర

టీ.. రికార్డ్ ధర

గత కొన్నేళ్లుగా ఈ వేలంలో టీ రికార్డ్ ధర పలుకుతోందని, ముఖ్యంగా ప్రత్యేకమైన టీ అధిక ధర పలుకుతోందని, కొనుగోలుదారుల నుంచి స్పెషాలిటీ టీకి మంచి డిమాండ్ ఉందని GTAC అధికారులు వెల్లడించారు. ఎప్పుడైనా వేలం సమయంలో నాణ్యత గురించి చూస్తారని, క్వాలిటీ కలిగిన టీకి ధరలు అడ్డుగా రావని అంటున్నారు.

ఇతర క్వాలిటీ ఉత్పత్తులకు ప్రోత్సాహం

ఇతర క్వాలిటీ ఉత్పత్తులకు ప్రోత్సాహం

టీ అమ్మడానికి GTAC ఓ వేదిక. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఆక్షన్ ద్వారా అమ్ముతున్న ప్రత్యేక టీలు రికార్డ్ స్థాయి పలుకుతున్నాయి. దీని వల్ల ఇతర క్వాలిటీ టీ ఉత్పత్తులకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, మనోహరి టీ ఎస్టేట్ ఓనర్ పేరు రాజన్ లోహియా.

రికార్డ్ ధర పలికిన టీ ఓనర్ ఏమన్నారంటే...

రికార్డ్ ధర పలికిన టీ ఓనర్ ఏమన్నారంటే...

తన టీ అత్యధిక ధరకు అమ్ముడుపోవడంపై రాజన్ లోహియా స్పందిస్తూ... అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల తమ ఎస్టేట్ కేవలం ఐదు కిలోల ప్రత్యేక టీని మాత్రమే ఉత్పత్తి చేయగలిగిందని చెప్పారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితి బాగా లేదని, అది టీ పరిశ్రమను ప్రభావితం చేసిందన్నారు. అత్యుత్తమ క్లోన్స్ ( P-126) నుంచి తమ ఎస్టేట్‌లో గోల్డ్ టీ తయారు అవుతోందన్నారు. ఇది ఆకుల నుంచి తయారు కాదని, చిన్న మొగ్గల నుంచి తయారవుతుందని చెప్పారు. ఇది చాలా క్లిష్ట ప్రక్రియ అన్నారు.

రికార్డ్ బద్దలు...

రికార్డ్ బద్దలు...

మంగళవారం ఉదయం జరిగిన వేలంలో సౌరభ్ టీ ట్రేడర్స్‌కు చెందిన మంజీలాల్ మహేశ్వరి ఈ ప్రత్యేకమైన టీని ఆక్షన్‌లో రికార్డ్ ధరకు కొనుగోలు చేసినట్లు GTAC వర్గాలు వెల్లడించాయి. వీరు 2018లోను 2 కిలోల ఇదే టీ కొనుగోలు చేశారు. క్రితం సంవత్సరం మనోహరి గోల్డ్ టీ కిలో రూ.39,001 పలికింది. అయితే, ఆ తర్వాత త్వరగానే ఈ రికార్డ్ బద్దలైంది. అరుణాచల్ ప్రదేశ్ డోన్యీ పోలో టీ ఎస్టేట్‌కు చెందిన గోల్డెన్ నీడిల్ వెరైటీ రూ.40,000 పలికింది. అయితే, ఇప్పుడు ఈ రికార్డ్‌ను తిరిగి మనోహరి గోల్డ్ టీ బద్దలు కొట్టింది.

మనోహరి గోల్డ్ టీకి డిమాండ్

మనోహరి గోల్డ్ టీకి డిమాండ్

మనోహరి గోల్డ్ టీని కొనుగోలు చేసిన వారు మళ్లీ కొనుగోలు చేసేందుకు ఆశక్తి కనబరుస్తున్నారట. ఇది రిటైల్‌గా 100 గ్రాములను రూ.8,000గా ఉందట. ఈ టీ చిక్కనైన బంగారం రంగులో ఉంటుందట. నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి వివిధ ప్రత్యేక టీ రకాలను తయారు చేస్తుంటారు. మనోహరి టీ ఎస్టేట్‌లో ఎక్కువమంది వాడే సంప్రదాయ టీలతో పాటు అలగే గ్రీన్, అలోంగ్, యెల్లో, వైట్ వంటి పలు రకాలను ఉత్పత్తి చేస్తున్నారు.

Read more about: news
English summary

ఈ అసోం గోల్డ్ టీ 'బంగారమే', కిలో రూ.50,000 | Assam tea auctioned at Rs.50,000 per kg

Breaking all past records, a kilogram of speciality tea at the Guwahati Tea Auction Centre (GTAC) in Assam fetched Rs 50,000 on Tuesday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X