For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా ఆరో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, తెలుగు రాష్ట్రాల్లో...

|

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజు (మంగళవారం) తగ్గాయి. అలాగే డీజిల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు తగ్గింది. ఈ రోజు పెట్రోల్ ధర 13-14 పైసలు తగ్గగా, డీజిల్ ధర 7-8 పైసలు తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో ధర తగ్గింది.

ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.72.86, లీటర్ డీజిల్ ధర రూ.66గా ఉంది. సోమవారం లీటర్ పెట్రోల్ రూ.72.99, లీటల్ డీజిల్ రూ.66.07గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.75.50, డీజిల్ రూ.68.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ 14 పైసలు తగ్గి రూ.75.66గా ఉండగా, డీజిల్ 7 పైసలు తగ్గి రూ.69.71గా ఉంది. ముంబైలో పెట్రోల్ 13 పైసలు తగ్గి రూ.78.48, డీజిల్ 7 పైసలు తగ్గి రూ. 69.17గా ఉంది.

కస్టమర్లకు ఎయిర్‌టెల్ భారీ షాక్, బ్యాలెన్స్ ఉన్నా రీచార్జ్కస్టమర్లకు ఎయిర్‌టెల్ భారీ షాక్, బ్యాలెన్స్ ఉన్నా రీచార్జ్

Petrol prices fall for the sixth straight day, May increase next month

హైదరాబాదులో పెట్రోల్ లీటర్ రూ.77.38, డీజిల్ రూ.71.88గా ఉంది. అమరావతిలో పెట్రోల్ రూ.77.08, డీజిల్ రూ.71.24గా, విజయవాడలో పెట్రోల్ రూ.76.73, డీజిల్ రూ.70.92గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ 0.49 శాతం పెరిగి 63.93 డాలర్లకు పెరిగింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.55 శాతం పెరుగుదలతో 57.18 డాలర్లకు ఎగిసింది.

ఇదిలా ఉండగా, వచ్చే నెల (ఆగస్ట్)లో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ధరలు కాస్త పెరగనున్నాయని తెలుస్తోంది.

English summary

వరుసగా ఆరో రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, తెలుగు రాష్ట్రాల్లో... | Petrol prices fall for the sixth straight day, May increase next month

The state run oil companies have cut the petrol prices for the sixth consecutive day and diesel prices for the second consecutive day across major cities on Tuesday.
Story first published: Tuesday, July 30, 2019, 14:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X